హోమ్ › సూరాలు › సూరా As-Saaffaat
సూరా As-Saaffaat الصافات
182 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 56
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلصَّٰٓفَّٰتِ صَفًّا
Telugu Translation - Abdurrahim ibn Muhammad వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلزَّٰجِرَٰتِ زَجْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلتَّٰلِيَٰتِ ذِكْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ إِلَٰهَكُمْ لَوَٰحِدٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
رَّبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ ٱلْمَشَٰرِقِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِزِينَةٍ ٱلْكَوَاكِبِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَحِفْظًا مِّن كُلِّ شَيْطَٰنٍ مَّارِدٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి; [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلْمَلَإِ ٱلْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
دُحُورًا وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا مَنْ خَطِفَ ٱلْخَطْفَةَ فَأَتْبَعَهُۥ شِهَابٌ ثَاقِبٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَآ إِنَّا خَلَقْنَٰهُم مِّن طِينٍ لَّازِبٍۭ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا ذُكِّرُوا۟ لَا يَذْكُرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا رَأَوْا۟ ءَايَةً يَسْتَسْخِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقَالُوٓا۟ إِنْ هَٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారిలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قُلْ نَعَمْ وَأَنتُمْ دَٰخِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారితో ఇలా అను: "అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు." [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقَالُوا۟ يَٰوَيْلَنَا هَٰذَا يَوْمُ ٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
هَٰذَا يَوْمُ ٱلْفَصْلِ ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే!" [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱحْشُرُوا۟ ٱلَّذِينَ ظَلَمُوا۟ وَأَزْوَٰجَهُمْ وَمَا كَانُوا۟ يَعْبُدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని -
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مِن دُونِ ٱللَّهِ فَٱهْدُوهُمْ إِلَىٰ صِرَٰطِ ٱلْجَحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقِفُوهُمْ إِنَّهُم مَّسْـُٔولُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు?'"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
بَلْ هُمُ ٱلْيَوْمَ مُسْتَسْلِمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوٓا۟ إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ ٱلْيَمِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కొందరు అంటారు: "మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు!"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوا۟ بَل لَّمْ تَكُونُوا۟ مُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇతరులు ఇలా జవాబిస్తారు: "అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَٰنٍۭ بَلْ كُنتُمْ قَوْمًا طَٰغِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు[1]."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَآ إِنَّا لَذَآئِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَغْوَيْنَٰكُمْ إِنَّا كُنَّا غَٰوِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి[1]!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُمْ كَانُوٓا۟ إِذَا قِيلَ لَهُمْ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ يَسْتَكْبِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి, వారితో: "అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓا۟ ءَالِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍۭ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
بَلْ جَآءَ بِٱلْحَقِّ وَصَدَّقَ ٱلْمُرْسَلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّكُمْ لَذَآئِقُوا۟ ٱلْعَذَابِ ٱلْأَلِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు -
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أُو۟لَٰٓئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَوَٰكِهُ وَهُم مُّكْرَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى جَنَّٰتِ ٱلنَّعِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad పరమ సుఖాలు గల స్వర్గవనాలలో;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَلَىٰ سُرُرٍ مُّتَقَٰبِلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు, [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍۭ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
بَيْضَآءَ لَذَّةٍ لِّلشَّٰرِبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَعِندَهُمْ قَٰصِرَٰتُ ٱلطَّرْفِ عِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ قَآئِلٌ مِّنْهُمْ إِنِّى كَانَ لِى قَرِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారిలో ఒకడంటాడు: "వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلْمُصَدِّقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَدِينُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతడు ఇంకా ఇలా అంటాడు: "ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱطَّلَعَ فَرَءَاهُ فِى سَوَآءِ ٱلْجَحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: "అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَوْلَا نِعْمَةُ رَبِّى لَكُنتُ مِنَ ٱلْمُحْضَرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): "ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا مَوْتَتَنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ هَٰذَا لَهُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ ٱلْعَٰمِلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ ٱلزَّقُّومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు[1] ఆతిథ్యమా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا جَعَلْنَٰهَا فِتْنَةً لِّلظَّٰلِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِىٓ أَصْلِ ٱلْجَحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
طَلْعُهَا كَأَنَّهُۥ رُءُوسُ ٱلشَّيَٰطِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِنَّهُمْ لَـَٔاكِلُونَ مِنْهَا فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى ٱلْجَحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُمْ أَلْفَوْا۟ ءَابَآءَهُمْ ضَآلِّينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَهُمْ عَلَىٰٓ ءَاثَٰرِهِمْ يُهْرَعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱنظُرْ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلْمُنذَرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ نَادَىٰنَا نُوحٌ فَلَنِعْمَ ٱلْمُجِيبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవంగా, నూహ్[1] మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَجَّيْنَٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَجَعَلْنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلْبَاقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سَلَٰمٌ عَلَىٰ نُوحٍ فِى ٱلْعَٰلَمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత మేము ఇతరులను ముంచి వేశాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ مِن شِيعَتِهِۦ لَإِبْرَٰهِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذْ جَآءَ رَبَّهُۥ بِقَلْبٍ سَلِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَاذَا تَعْبُدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు దేనిని ఆరాధిస్తున్నారు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَئِفْكًا ءَالِهَةً دُونَ ٱللَّهِ تُرِيدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَا ظَنُّكُم بِرَبِّ ٱلْعَٰلَمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَنَظَرَ نَظْرَةً فِى ٱلنُّجُومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَقَالَ إِنِّى سَقِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు అతను ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَتَوَلَّوْا۟ عَنْهُ مُدْبِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: "మీరు తినటం లేదేమిటి?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَا لَكُمْ لَا تَنطِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًۢا بِٱلْيَمِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَقْبَلُوٓا۟ إِلَيْهِ يَزِفُّونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: "ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوا۟ ٱبْنُوا۟ لَهُۥ بُنْيَٰنًا فَأَلْقُوهُ فِى ٱلْجَحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): "ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَرَادُوا۟ بِهِۦ كَيْدًا فَجَعَلْنَٰهُمُ ٱلْأَسْفَلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقَالَ إِنِّى ذَاهِبٌ إِلَىٰ رَبِّى سَيَهْدِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
رَبِّ هَبْ لِى مِنَ ٱلصَّٰلِحِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (అతను ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَبَشَّرْنَٰهُ بِغُلَٰمٍ حَلِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعْىَ قَالَ يَٰبُنَىَّ إِنِّىٓ أَرَىٰ فِى ٱلْمَنَامِ أَنِّىٓ أَذْبَحُكَ فَٱنظُرْ مَاذَا تَرَىٰ قَالَ يَٰٓأَبَتِ ٱفْعَلْ مَا تُؤْمَرُ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّٰبِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: "ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلَمَّآ أَسْلَمَا وَتَلَّهُۥ لِلْجَبِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَٰدَيْنَٰهُ أَن يَٰٓإِبْرَٰهِيمُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: "ఓ ఇబ్రాహీమ్!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَدْ صَدَّقْتَ ٱلرُّءْيَآ إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ هَٰذَا لَهُوَ ٱلْبَلَٰٓؤُا۟ ٱلْمُبِينُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفَدَيْنَٰهُ بِذِبْحٍ عَظِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سَلَٰمٌ عَلَىٰٓ إِبْرَٰهِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَبَشَّرْنَٰهُ بِإِسْحَٰقَ نَبِيًّا مِّنَ ٱلصَّٰلِحِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَبَٰرَكْنَا عَلَيْهِ وَعَلَىٰٓ إِسْحَٰقَ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِۦ مُبِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَٰرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَجَّيْنَٰهُمَا وَقَوْمَهُمَا مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَصَرْنَٰهُمْ فَكَانُوا۟ هُمُ ٱلْغَٰلِبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَءَاتَيْنَٰهُمَا ٱلْكِتَٰبَ ٱلْمُسْتَبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَهَدَيْنَٰهُمَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَرَكْنَا عَلَيْهِمَا فِى ٱلْـَٔاخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سَلَٰمٌ عَلَىٰ مُوسَىٰ وَهَٰرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُمَا مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَلَا تَتَّقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ ٱلْخَٰلِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? మీరు బఅల్ [1] (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱللَّهَ رَبَّكُمْ وَرَبَّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سَلَٰمٌ عَلَىٰٓ إِلْ يَاسِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "ఇల్ యాసీన్ [1] కు శాంతి కలుగు గాక (సలాం)!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ لُوطًا لَّمِنَ ٱلْمُرْسَلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذْ نَجَّيْنَٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో -
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا عَجُوزًا فِى ٱلْغَٰبِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَبِٱلَّيْلِ أَفَلَا تَعْقِلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, యూనుస్[1] కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذْ أَبَقَ إِلَى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلْمُدْحَضِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْتَقَمَهُ ٱلْحُوتُ وَهُوَ مُلِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلَوْلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلْمُسَبِّحِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَلَبِثَ فِى بَطْنِهِۦٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَنَبَذْنَٰهُ بِٱلْعَرَآءِ وَهُوَ سَقِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَنۢبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము. [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَرْسَلْنَٰهُ إِلَىٰ مِا۟ئَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَـَٔامَنُوا۟ فَمَتَّعْنَٰهُمْ إِلَىٰ حِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱسْتَفْتِهِمْ أَلِرَبِّكَ ٱلْبَنَاتُ وَلَهُمُ ٱلْبَنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అయితే వారిని ఇలా అడుగు: "ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ خَلَقْنَا ٱلْمَلَٰٓئِكَةَ إِنَٰثًا وَهُمْ شَٰهِدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా?"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَلَآ إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు:
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَدَ ٱللَّهُ وَإِنَّهُمْ لَكَٰذِبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَصْطَفَى ٱلْبَنَاتِ عَلَى ٱلْبَنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَلَا تَذَكَّرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? మీరు గ్రహించలేరా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ لَكُمْ سُلْطَٰنٌ مُّبِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأْتُوا۟ بِكِتَٰبِكُمْ إِن كُنتُمْ صَٰدِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَجَعَلُوا۟ بَيْنَهُۥ وَبَيْنَ ٱلْجِنَّةِ نَسَبًا وَلَقَدْ عَلِمَتِ ٱلْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు.[1] కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سُبْحَٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి);
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَآ أَنتُمْ عَلَيْهِ بِفَٰتِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا مَنْ هُوَ صَالِ ٱلْجَحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٌ مَّعْلُومٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (దైవదూతలు ఇలా అంటారు): "మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّا لَنَحْنُ ٱلصَّآفُّونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّا لَنَحْنُ ٱلْمُسَبِّحُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِن كَانُوا۟ لَيَقُولُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు:
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَكَفَرُوا۟ بِهِۦ فَسَوْفَ يَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلْمُرْسَلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُمْ لَهُمُ ٱلْمَنصُورُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلْغَٰلِبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ ٱلْمُنذَرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سُبْحَٰنَ رَبِّكَ رَبِّ ٱلْعِزَّةِ عَمَّا يَصِفُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَسَلَٰمٌ عَلَى ٱلْمُرْسَلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَٰلَمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Yaseen
సూరా Saad →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.