హోమ్ › సూరాలు › సూరా Al-Muddaththir
సూరా Al-Muddaththir المدثر
56 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 4
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ يَٰٓأَيُّهَا ٱلْمُدَّثِّرُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قُمْ فَأَنذِرْ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లే! ఇక హెచ్చరించు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَرَبَّكَ فَكَبِّرْ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَثِيَابَكَ فَطَهِّرْ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلرُّجْزَ فَٱهْجُرْ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَا تَمْنُن تَسْتَكْثِرُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلِرَبِّكَ فَٱصْبِرْ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِذَا نُقِرَ فِى ٱلنَّاقُورِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَلَى ٱلْكَٰفِرِينَ غَيْرُ يَسِيرٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ذَرْنِى وَمَنْ خَلَقْتُ وَحِيدًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ[1]!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَجَعَلْتُ لَهُۥ مَالًا مَّمْدُودًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَبَنِينَ شُهُودًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَهَّدتُّ لَهُۥ تَمْهِيدًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّآ إِنَّهُۥ كَانَ لِـَٔايَٰتِنَا عَنِيدًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سَأُرْهِقُهُۥ صَعُودًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَقُتِلَ كَيْفَ قَدَّرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ نَظَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు అతడు ఆలోచించాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ عَبَسَ وَبَسَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ أَدْبَرَ وَٱسْتَكْبَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَقَالَ إِنْ هَٰذَآ إِلَّا سِحْرٌ يُؤْثَرُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنْ هَٰذَآ إِلَّا قَوْلُ ٱلْبَشَرِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
سَأُصْلِيهِ سَقَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَآ أَدْرَىٰكَ مَا سَقَرُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు[1]?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَا تُبْقِى وَلَا تَذَرُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَوَّاحَةٌ لِّلْبَشَرِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది మానవుణ్ణి (అతడి చర్మాన్ని0 దహించి వేస్తుంది[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَلَيْهَا تِسْعَةَ عَشَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا جَعَلْنَآ أَصْحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةً وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا۟ لِيَسْتَيْقِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَيَزْدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِيمَٰنًا وَلَا يَرْتَابَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَٱلْمُؤْمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌ وَٱلْكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلًا كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ وَمَا هِىَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు[1]. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّا وَٱلْقَمَرِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! చంద్రుని సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّيْلِ إِذْ أَدْبَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad గడిచిపోయే రాత్రి సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلصُّبْحِ إِذَآ أَسْفَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ప్రకాశించే, ఉదయం సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهَا لَإِحْدَى ٱلْكُبَرِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
نَذِيرًا لِّلْبَشَرِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మానవునికి ఒక హెచ్చరిక;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِمَن شَآءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِينَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّآ أَصْحَٰبَ ٱلْيَمِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కుడిపక్షం వారు తప్ప!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى جَنَّٰتٍ يَتَسَآءَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَنِ ٱلْمُجْرِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَا سَلَكَكُمْ فِى سَقَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَمْ نَكُ نُطْعِمُ ٱلْمِسْكِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ ٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
حَتَّىٰٓ أَتَىٰنَا ٱلْيَقِينُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَا تَنفَعُهُمْ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَا لَهُمْ عَنِ ٱلتَّذْكِرَةِ مُعْرِضِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَرَّتْ مِن قَسْوَرَةٍۭ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)[1]!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
بَلْ يُرِيدُ كُلُّ ٱمْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّا بَل لَّا يَخَافُونَ ٱلْـَٔاخِرَةَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّآ إِنَّهُۥ تَذْكِرَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَن شَآءَ ذَكَرَهُۥ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا يَذْكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ هُوَ أَهْلُ ٱلتَّقْوَىٰ وَأَهْلُ ٱلْمَغْفِرَةِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Al-Muzzammil
సూరా Al-Qiyaama →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.