caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Qiyaama القيامة

40 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 31

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ لَآ أُقْسِمُ بِيَوْمِ ٱلْقِيَٰمَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَآ أُقْسِمُ بِٱلنَّفْسِ ٱللَّوَّامَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَيَحْسَبُ ٱلْإِنسَٰنُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّىَ بَنَانَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلْ يُرِيدُ ٱلْإِنسَٰنُ لِيَفْجُرَ أَمَامَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَسْـَٔلُ أَيَّانَ يَوْمُ ٱلْقِيَٰمَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا بَرِقَ ٱلْبَصَرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَخَسَفَ ٱلْقَمَرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجُمِعَ ٱلشَّمْسُ وَٱلْقَمَرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَقُولُ ٱلْإِنسَٰنُ يَوْمَئِذٍ أَيْنَ ٱلْمَفَرُّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا لَا وَزَرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمُسْتَقَرُّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُنَبَّؤُا۟ ٱلْإِنسَٰنُ يَوْمَئِذٍۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلِ ٱلْإِنسَٰنُ عَلَىٰ نَفْسِهِۦ بَصِيرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا قَرَأْنَٰهُ فَٱتَّبِعْ قُرْءَانَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే[1]!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا بَلْ تُحِبُّونَ ٱلْعَاجِلَةَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَذَرُونَ ٱلْـَٔاخِرَةَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి[1];

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَوُجُوهٌ يَوْمَئِذٍۭ بَاسِرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి[1];

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِىَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు[1];

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقِيلَ مَنْ رَاقٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَظَنَّ أَنَّهُ ٱلْفِرَاقُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمَسَاقُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు[1]!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهْلِهِۦ يَتَمَطَّىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَيَحْسَبُ ٱلْإِنسَٰنُ أَن يُتْرَكَ سُدًى

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِىٍّ يُمْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَجَعَلَ مِنْهُ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَيْسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحْـِۧىَ ٱلْمَوْتَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70