హోమ్ › సూరాలు › సూరా Al-Muzzammil
సూరా Al-Muzzammil المزمل
20 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 3
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ يَٰٓأَيُّهَا ٱلْمُزَّمِّلُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఓ దుప్పటి కప్పుకున్నవాడా[1]!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قُمِ ٱلَّيْلَ إِلَّا قَلِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad రాత్రంతా (నమాజ్ లో) నిలబడు, కొంత భాగాన్ని విడిచి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
نِّصْفَهُۥٓ أَوِ ٱنقُصْ مِنْهُ قَلِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాని సగభాగంలో, లేదా దాని కంటే కొంత తక్కువ;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ ٱلْقُرْءَانَ تَرْتِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad లేదా దాని కంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్ఆన్ ను ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا سَنُلْقِى عَلَيْكَ قَوْلًا ثَقِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింప జేయబోతున్నాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ نَاشِئَةَ ٱلَّيْلِ هِىَ أَشَدُّ وَطْـًٔا وَأَقْوَمُ قِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగణమైనది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ لَكَ فِى ٱلنَّهَارِ سَبْحًا طَوِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి, పగటివేళ నీకు చాలా పనులుంటాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱذْكُرِ ٱسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రద్థతో ఆయన వైపుకు మరలుతూ ఉండు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
رَّبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ لَآ إِلَٰهَ إِلَّا هُوَ فَٱتَّخِذْهُ وَكِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆయనే తూర్పూ పడమరల స్వామి, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, కావున నీవు ఆయననే కార్యకర్తగా చేసుకో.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَٱهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَذَرْنِى وَٱلْمُكَذِّبِينَ أُو۟لِى ٱلنَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అసత్యవాదులైన ఈ సంపన్నులను, నాకు వదలిపెట్టు[1]. మరియు వారికి కొంత వ్యవధినివ్వు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ لَدَيْنَآ أَنكَالًا وَجَحِيمًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మా వద్ద వారి కొరకు సంకెళ్ళు మరియు భగభగమండే నరకాగ్ని ఉన్నాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు గొంతులో ఇరుక్కుపోయే ఆహారం మరియు బాధాకరమైన శిక్ష (ఉన్నాయి).
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ تَرْجُفُ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ وَكَانَتِ ٱلْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ రోజు భూమి మరియు పర్వతాలు కంపించి పోతాయి. మరియు పర్వతాలు ప్రవహించే ఇసుక దిబ్బలుగా మారిపోతాయి[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّآ أَرْسَلْنَآ إِلَيْكُمْ رَسُولًا شَٰهِدًا عَلَيْكُمْ كَمَآ أَرْسَلْنَآ إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేము ఫిర్ఔన్ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకు సాక్షిగా ఉండటానికి పంపాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَعَصَىٰ فِرْعَوْنُ ٱلرَّسُولَ فَأَخَذْنَٰهُ أَخْذًا وَبِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని ఫిర్ఔన్ ఆ సందేశహరునికి అవిధేయత చూపాడు. కావున మేము అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేశాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَكَيْفَ تَتَّقُونَ إِن كَفَرْتُمْ يَوْمًا يَجْعَلُ ٱلْوِلْدَٰنَ شِيبًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, బాలురను ముసలివారిగా చేసేటటు వంటి ఆ దినపు శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు[1]?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلسَّمَآءُ مُنفَطِرٌۢ بِهِۦ كَانَ وَعْدُهُۥ مَفْعُولًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు ఆకాశం బ్రద్దలై పోతుంది. ఆయన యొక్క వాగ్దానం తప్పక నెరవేరి తీరుతుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ هَٰذِهِۦ تَذْكِرَةٌ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఇదొక ఉపదేశం కావున ఇష్టమైన వాడు తన ప్రభువు వద్దకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ رَبَّكَ يَعْلَمُ أَنَّكَ تَقُومُ أَدْنَىٰ مِن ثُلُثَىِ ٱلَّيْلِ وَنِصْفَهُۥ وَثُلُثَهُۥ وَطَآئِفَةٌ مِّنَ ٱلَّذِينَ مَعَكَ وَٱللَّهُ يُقَدِّرُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ عَلِمَ أَن لَّن تُحْصُوهُ فَتَابَ عَلَيْكُمْ فَٱقْرَءُوا۟ مَا تَيَسَّرَ مِنَ ٱلْقُرْءَانِ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرْضَىٰ وَءَاخَرُونَ يَضْرِبُونَ فِى ٱلْأَرْضِ يَبْتَغُونَ مِن فَضْلِ ٱللَّهِ وَءَاخَرُونَ يُقَٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ فَٱقْرَءُوا۟ مَا تَيَسَّرَ مِنْهُ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتُوا۟ ٱلزَّكَوٰةَ وَأَقْرِضُوا۟ ٱللَّهَ قَرْضًا حَسَنًا وَمَا تُقَدِّمُوا۟ لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ ٱللَّهِ هُوَ خَيْرًا وَأَعْظَمَ أَجْرًا وَٱسْتَغْفِرُوا۟ ٱللَّهَ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌۢ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఓ ముహమ్మద్!) నీవు, వాస్తవానికి దాదాపు మూడింట రెండు వంతుల రాత్రి లేక సగం (రాత్రి) లేక మూడింట ఒక భాగం (నమాజ్ లో) నిలుస్తావనేది నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు నీతో పాటు ఉన్న వారిలో కొందరు కూడా! మరియు అల్లాహ్ రేయింబవళ్ళ పరిమాణాలను నిర్ణయిస్తాడు. మీరు ఖచ్ఛితంగా పూర్తి రాత్రి ప్రార్థించలేరని ఆయనకు తెలుసు. కావున ఆయన మీ వైపునకు (కనికరంతో) మరలాడు. కావున ఖుర్ఆన్ ను, మీరు సులభంగా పఠించగలిగినంతే పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులు కావచ్చు, మరికొందరు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ భూమిలో ప్రయాణంలో ఉండవచ్చు. మరికొందరు అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ ఉండవచ్చు అని ఆయనకు బాగా తెలుసు. కావున మీకు దానిలో సులభమైనంత దానినే పఠించండి[1]. మరియు నమాజ్ను స్థాపించండి[2], విధిదానం (జకాత్) ఇవ్వండి. మరియు అల్లాహ్ కు మంచి అప్పును, అప్పుగా ఇస్తూ ఉండండి. మరియు మీరు, మీ కొరకు ముందుగా చేసి పంపుకున్న మంచి కార్యాలన్నింటినీ అల్లాహ్ దగ్గర పొందుతారు. అదే చాలా ఉత్తమమైనది. మరియు దాని ప్రతిఫలం చాలా గొప్పది. మరియు మీరు అల్లాహ్ ను క్షమాభిక్ష అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Al-Jinn
సూరా Al-Muddaththir →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.