caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Qalam القلم

52 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 2

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ نٓ وَٱلْقَلَمِ وَمَا يَسْطُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనూన్[1][2], కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా[3]!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَآ أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు[1]!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بِأَييِّكُمُ ٱلْمَفْتُونُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీలో ఎవరికి పిచ్చి ఉందో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَا تُطِعِ ٱلْمُكَذِّبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَدُّوا۟ لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ గోరుతున్నారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَمَّازٍ مَّشَّآءٍۭ بِنَمِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عُتُلٍّۭ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَنَسِمُهُۥ عَلَى ٱلْخُرْطُومِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا بَلَوْنَٰهُمْ كَمَا بَلَوْنَآ أَصْحَٰبَ ٱلْجَنَّةِ إِذْ أَقْسَمُوا۟ لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا يَسْتَثْنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (అల్లాహ్ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَطَافَ عَلَيْهَا طَآئِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَآئِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై (ఆ తోటపై) ఒక ఆపద వచ్చి పడింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَصْبَحَتْ كَٱلصَّرِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదాంతో తెల్లవారే సరికి అది (ఆ తోట) పంట కోసిన పొలం వలే మారి పోయింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَتَنَادَوْا۟ مُصْبِحِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత ఉదయం లేచి వారు ఒకరితో నొకరు ఇలా చెప్పుకోసాగారు:

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَنِ ٱغْدُوا۟ عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَٰرِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱنطَلَقُوا۟ وَهُمْ يَتَخَٰفَتُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలు దేరారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَن لَّا يَدْخُلَنَّهَا ٱلْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَغَدَوْا۟ عَلَىٰ حَرْدٍ قَٰدِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَمَّا رَأَوْهَا قَالُوٓا۟ إِنَّا لَضَآلُّونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: "నిశ్చయంగా, మనం దారి తప్పాము!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلْ نَحْنُ مَحْرُومُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: "ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని ('ఇన్ షా అల్లాహ్!' అనరని)[1]?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ سُبْحَٰنَ رَبِّنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు ఇలా అన్నారు: "మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَٰوَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత వారు అభిముఖులై ఒకరి నొకరు నిందించుకోసాగారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ يَٰوَيْلَنَآ إِنَّا كُنَّا طَٰغِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు ఇలా వాపోయారు: "అయ్యో! మా పాడుగాను! నిశ్చయంగా, మేము తలబిరుసుతనం చూపాము!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَسَىٰ رَبُّنَآ أَن يُبْدِلَنَا خَيْرًا مِّنْهَآ إِنَّآ إِلَىٰ رَبِّنَا رَٰغِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadబహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَٰلِكَ ٱلْعَذَابُ وَلَعَذَابُ ٱلْـَٔاخِرَةِ أَكْبَرُ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా ఉంటుంది శిక్ష! మరియు పరలోక శిక్ష దీని కంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّٰتِ ٱلنَّعِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, దైవభీతి గలవారికి వారి ప్రభువు వద్ద పరమానందకరమైన స్వర్గవనాలు ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَنَجْعَلُ ٱلْمُسْلِمِينَ كَٱلْمُجْرِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా[1]?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీకేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ لَكُمْ كِتَٰبٌ فِيهِ تَدْرُسُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ لَكُمْ أَيْمَٰنٌ عَلَيْنَا بَٰلِغَةٌ إِلَىٰ يَوْمِ ٱلْقِيَٰمَةِ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక, పునరుత్థాన దినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని, మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిలో దీనికి ఎవడు హామీగా ఉన్నాడో అడుగు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ لَهُمْ شُرَكَآءُ فَلْيَأْتُوا۟ بِشُرَكَآئِهِمْ إِن كَانُوا۟ صَٰدِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక, వారికి ఎవరైనా (వారు అల్లాహ్ కు కల్పించిన) భాగస్వాములు ఉన్నారా? ఒకవేళ వారు సత్యవంతులే అయితే తమ ఆ భాగస్వాములను తీసుకు రమ్మను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ يُكْشَفُ عَن سَاقٍ وَيُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో, అప్పుడు వారు (కపట విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خَٰشِعَةً أَبْصَٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ وَقَدْ كَانُوا۟ يُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ وَهُمْ سَٰلِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి, అవమానం వారిని ఆవరించి ఉంటుంది. మరియు వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం (సజ్దా) చేయటానికి ఆహ్వానించబడితే (తిరస్కరించేవారు)!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَذَرْنِى وَمَن يُكَذِّبُ بِهَٰذَا ٱلْحَدِيثِ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొని పోతాము[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأُمْلِى لَهُمْ إِنَّ كَيْدِى مَتِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక, (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఏదైనా ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నావా? వారికి దాని రుణం భారమవటానికి?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా[1]? వారు దానిని వ్రాసి పెట్టడానికి?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) వలే వ్యవహరించకు[1]. (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొర పెట్టుకున్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَّوْلَآ أَن تَدَٰرَكَهُۥ نِعْمَةٌ مِّن رَّبِّهِۦ لَنُبِذَ بِٱلْعَرَآءِ وَهُوَ مَذْمُومٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడి ఉండేవాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట (బంజరు) మైదానంలో విసరి వేయ బడ్డాడు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱجْتَبَٰهُ رَبُّهُۥ فَجَعَلَهُۥ مِنَ ٱلصَّٰلِحِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సత్పురుషులలో చేర్చాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِن يَكَادُ ٱلَّذِينَ كَفَرُوا۟ لَيُزْلِقُونَكَ بِأَبْصَٰرِهِمْ لَمَّا سَمِعُوا۟ ٱلذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُۥ لَمَجْنُونٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు[1]. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని సర్వలోకాల (వారికి) ఇదొక హితోపదేశం మాత్రమే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70