caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Haaqqa الحاقة

52 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 78

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱلْحَآقَّةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا ٱلْحَآقَّةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటా అనివార్య సంఘటన?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحَآقَّةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ ثَمُودُ وَعَادٌۢ بِٱلْقَارِعَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا۟ بِٱلطَّاغِيَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا۟ بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆద్ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَٰنِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى ٱلْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు[1]. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَهَلْ تَرَىٰ لَهُم مِّنۢ بَاقِيَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَآءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُۥ وَٱلْمُؤْتَفِكَٰتُ بِٱلْخَاطِئَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ[1], అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَعَصَوْا۟ رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَّابِيَةً

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు, కావున ఆయన వారిని కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا لَمَّا طَغَا ٱلْمَآءُ حَمَلْنَٰكُمْ فِى ٱلْجَارِيَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని[1] పయనించే (నావలో) ఎక్కించాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَآ أُذُنٌ وَٰعِيَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవటానికి అనువైనదిగా చేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ نَفْخَةٌ وَٰحِدَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَحُمِلَتِ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَٰحِدَةً

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్ద దెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَيَوْمَئِذٍ وَقَعَتِ ٱلْوَاقِعَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు, ఆ రోజున సంభవించవలసిన ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِىَ يَوْمَئِذٍ وَاهِيَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْمَلَكُ عَلَىٰٓ أَرْجَآئِهَا وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَٰنِيَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقْرَءُوا۟ كِتَٰبِيَهْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: "ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنِّى ظَنَنتُ أَنِّى مُلَٰقٍ حِسَابِيَهْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَهُوَ فِى عِيشَةٍ رَّاضِيَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِى جَنَّةٍ عَالِيَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅత్యున్నతమైన స్వర్గవనంలో[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُطُوفُهَا دَانِيَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَآ أَسْلَفْتُمْ فِى ٱلْأَيَّامِ ٱلْخَالِيَةِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారితో ఇలా అనబడుతుంది): "గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَٰلَيْتَنِى لَمْ أُوتَ كِتَٰبِيَهْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰلَيْتَهَا كَانَتِ ٱلْقَاضِيَةَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَآ أَغْنَىٰ عَنِّى مَالِيَهْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనా సంపద నాకేమీ పనికి రాలేదు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَلَكَ عَنِّى سُلْطَٰنِيَهْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనా అధికారమంతా అంతమై పోయింది!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خُذُوهُ فَغُلُّوهُ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి[1];

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ ٱلْجَحِيمَ صَلُّوهُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ فِى سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَٱسْلُكُوهُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి[1]!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ كَانَ لَا يُؤْمِنُ بِٱللَّهِ ٱلْعَظِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَيْسَ لَهُ ٱلْيَوْمَ هَٰهُنَا حَمِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَّا يَأْكُلُهُۥٓ إِلَّا ٱلْخَٰطِـُٔونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَآ أُقْسِمُ بِمَا تُبْصِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا لَا تُبْصِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు చూడలేనట్టని వాటి (శపథం) కూడా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుని (పై అవతరింప జేయబడిన) వాక్కు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ قَلِيلًا مَّا تُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا بِقَوْلِ كَاهِنٍ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَنزِيلٌ مِّن رَّبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ ٱلْأَقَاوِيلِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَأَخَذْنَا مِنْهُ بِٱلْيَمِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము అతని కుడి చేతిని పట్టుకునే వారం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ لَقَطَعْنَا مِنْهُ ٱلْوَتِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَٰجِزِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّهُۥ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) దైవభీతి గల వారికొక హితోపదేశం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّهُۥ لَحَسْرَةٌ عَلَى ٱلْكَٰفِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఇది (ఈ తిరస్కారం) సత్యతిరస్కారులకు దుఃఖ కారణమవుతుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّهُۥ لَحَقُّ ٱلْيَقِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నమ్మదగిన సత్యం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు సర్వోత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70