హోమ్ › సూరాలు › సూరా Al-Hijr
సూరా Al-Hijr الحجر
99 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 54
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ الٓر تِلْكَ ءَايَٰتُ ٱلْكِتَٰبِ وَقُرْءَانٍ مُّبِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలిఫ్ - లామ్ - రా[1]. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్.[2]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
رُّبَمَا يَوَدُّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْ كَانُوا۟ مُسْلِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ذَرْهُمْ يَأْكُلُوا۟ وَيَتَمَتَّعُوا۟ وَيُلْهِهِمُ ٱلْأَمَلُ فَسَوْفَ يَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُومٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَّا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَـْٔخِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనుక గానీ కాజాలదు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقَالُوا۟ يَٰٓأَيُّهَا ٱلَّذِى نُزِّلَ عَلَيْهِ ٱلذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (సత్యతిరస్కారులు) అంటారు: "ఓ హితబోధ (ఖుర్ఆన్) అవతరింప జేయబడిన వాడా (ముహమ్మద్)! నిశ్చయంగా నీవు పిచ్చివాడవు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّوْ مَا تَأْتِينَا بِٱلْمَلَٰٓئِكَةِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "నీవు సత్యవంతుడవే అయితే, మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకొనిరావు?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَا نُنَزِّلُ ٱلْمَلَٰٓئِكَةَ إِلَّا بِٱلْحَقِّ وَمَا كَانُوٓا۟ إِذًا مُّنظَرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا نَحْنُ نَزَّلْنَا ٱلذِّكْرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِى شِيَعِ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము, నీకు పూర్వం గతించిన తెగల వారి వద్దకు కూడా (ప్రవక్తలను) పంపాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَذَٰلِكَ نَسْلُكُهُۥ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఈ విధంగా మేము దీనిని (సత్యతిరస్కారాన్ని) అపరాధుల హృదయాలలో ప్రవేశపెడుతున్నాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَا يُؤْمِنُونَ بِهِۦ وَقَدْ خَلَتْ سُنَّةُ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَوْ فَتَحْنَا عَلَيْهِم بَابًا مِّنَ ٱلسَّمَآءِ فَظَلُّوا۟ فِيهِ يَعْرُجُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా, వారు దానిపైకి ఎక్కుతూ పోతూ!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَقَالُوٓا۟ إِنَّمَا سُكِّرَتْ أَبْصَٰرُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُورُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇలా అనేవారు: "నిశ్చయంగా, మా చూపులు భ్రమింపజేయబడ్డాయి. అలా కాదు, మాపై మంత్రజాలం చేయబడింది."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ جَعَلْنَا فِى ٱلسَّمَآءِ بُرُوجًا وَزَيَّنَّٰهَا لِلنَّٰظِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَحَفِظْنَٰهَا مِن كُلِّ شَيْطَٰنٍ رَّجِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు శపించబడిన (బహిష్కరించబడిన) ప్రతి షైతాన్ నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا مَنِ ٱسْتَرَقَ ٱلسَّمْعَ فَأَتْبَعَهُۥ شِهَابٌ مُّبِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని, ఎవడైనా (ఏ షైతానైనా) దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్ని జ్వాల) అతనిని వెంబడిస్తుంది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْأَرْضَ مَدَدْنَٰهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَٰسِىَ وَأَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ شَىْءٍ مَّوْزُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَٰيِشَ وَمَن لَّسْتُمْ لَهُۥ بِرَٰزِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِن مِّن شَىْءٍ إِلَّا عِندَنَا خَزَآئِنُهُۥ وَمَا نُنَزِّلُهُۥٓ إِلَّا بِقَدَرٍ مَّعْلُومٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَرْسَلْنَا ٱلرِّيَٰحَ لَوَٰقِحَ فَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَسْقَيْنَٰكُمُوهُ وَمَآ أَنتُمْ لَهُۥ بِخَٰزِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّا لَنَحْنُ نُحْىِۦ وَنُمِيتُ وَنَحْنُ ٱلْوَٰرِثُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ عَلِمْنَا ٱلْمُسْتَقْدِمِينَ مِنكُمْ وَلَقَدْ عَلِمْنَا ٱلْمُسْتَـْٔخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ مِن صَلْصَٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే (ధ్వని చేసే) మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద (బంకమట్టి)తో సృష్టించాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْجَآنَّ خَلَقْنَٰهُ مِن قَبْلُ مِن نَّارِ ٱلسَّمُومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَٰٓئِكَةِ إِنِّى خَٰلِقٌۢ بَشَرًا مِّن صَلْصَٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِذَا سَوَّيْتُهُۥ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِى فَقَعُوا۟ لَهُۥ سَٰجِدِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَسَجَدَ ٱلْمَلَٰٓئِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు -
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّآ إِبْلِيسَ أَبَىٰٓ أَن يَكُونَ مَعَ ٱلسَّٰجِدِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ يَٰٓإِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ ٱلسَّٰجِدِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (అల్లాహ్) ఇలా ప్రశ్నించాడు: "ఓ ఇబ్లీస్! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో ఎందుకు చేరలేదు?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُۥ مِن صَلْصَٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ فَٱخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (అల్లాహ్) అన్నాడు: "అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించ (బహిష్కరించ) బడ్డవాడవు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ عَلَيْكَ ٱللَّعْنَةَ إِلَىٰ يَوْمِ ٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, తీర్పు దినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ رَبِّ فَأَنظِرْنِىٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఇబ్లీస్) వేడుకున్నాడు: "ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ فَإِنَّكَ مِنَ ٱلْمُنظَرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (అల్లాహ్) జవాబిచ్చాడు: "ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَىٰ يَوْمِ ٱلْوَقْتِ ٱلْمَعْلُومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (నాకు మాత్రమే) తెలిసి వున్న ఆ దినపు, ఆ సమయం వరకు!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ رَبِّ بِمَآ أَغْوَيْتَنِى لَأُزَيِّنَنَّ لَهُمْ فِى ٱلْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا عِبَادَكَ مِنْهُمُ ٱلْمُخْلَصِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారిలో నీవు ఎన్నుకున్న (నీ ఆజ్ఞానువర్తనులైన) నీ దాసులు తప్ప!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ هَٰذَا صِرَٰطٌ عَلَىَّ مُسْتَقِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ عِبَادِى لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَٰنٌ إِلَّا مَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْغَاوِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, వారందరి కొరకు వాగ్దానం చేయబడిన (నివాసం) నరకమే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَهَا سَبْعَةُ أَبْوَٰبٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దానికి (నరకానికి) ఏడు ద్వారాలు ఉన్నాయి.[1] వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍ وَعُيُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో చెలమల మధ్య ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱدْخُلُوهَا بِسَلَٰمٍ ءَامِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు: 'శాంతితో సురక్షితంగా ప్రవేశించండి!' అని ఆహ్వానించబడతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَزَعْنَا مَا فِى صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَٰنًا عَلَىٰ سُرُرٍ مُّتَقَٰبِلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అక్కడ వారికి అలసట ఉండదు. మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడల గొట్టబడరు."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
نَبِّئْ عِبَادِىٓ أَنِّىٓ أَنَا ٱلْغَفُورُ ٱلرَّحِيمُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَنَّ عَذَابِى هُوَ ٱلْعَذَابُ ٱلْأَلِيمُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَٰهِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారికి ఇబ్రాహీమ్ అతిథులను గురించి తెలుపు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَٰمًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوا۟ لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَٰمٍ عَلِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు జవాబిచ్చారు: "నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ أَبَشَّرْتُمُونِى عَلَىٰٓ أَن مَّسَّنِىَ ٱلْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوا۟ بَشَّرْنَٰكَ بِٱلْحَقِّ فَلَا تَكُن مِّنَ ٱلْقَٰنِطِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారన్నారు: "మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِۦٓ إِلَّا ٱلضَّآلُّونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఇబ్రాహీమ్) అన్నాడు: "తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఇంకా) ఇలా అన్నాడు: "ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారన్నారు: "వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము [1] -
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّآ ءَالَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లూత్ ఇంటివారు[1] తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا ٱمْرَأَتَهُۥ قَدَّرْنَآ إِنَّهَا لَمِنَ ٱلْغَٰبِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلَمَّا جَآءَ ءَالَ لُوطٍ ٱلْمُرْسَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوا۟ بَلْ جِئْنَٰكَ بِمَا كَانُوا۟ فِيهِ يَمْتَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَتَيْنَٰكَ بِٱلْحَقِّ وَإِنَّا لَصَٰدِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ ٱلَّيْلِ وَٱتَّبِعْ أَدْبَٰرَهُمْ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ وَٱمْضُوا۟ حَيْثُ تُؤْمَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقَضَيْنَآ إِلَيْهِ ذَٰلِكَ ٱلْأَمْرَ أَنَّ دَابِرَ هَٰٓؤُلَآءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: "నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَجَآءَ أَهْلُ ٱلْمَدِينَةِ يَسْتَبْشِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ إِنَّ هَٰٓؤُلَآءِ ضَيْفِى فَلَا تَفْضَحُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱتَّقُوا۟ ٱللَّهَ وَلَا تُخْزُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوٓا۟ أَوَلَمْ نَنْهَكَ عَنِ ٱلْعَٰلَمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారన్నారు: "ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా?"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ هَٰٓؤُلَآءِ بَنَاتِىٓ إِن كُنتُمْ فَٰعِلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (లూత్) అన్నాడు: "మీకు (ఏమైనా) చేయాలనే ఉంటే, నా కుమార్తెలు (జాతి స్త్రీలు) ఉన్నారు."[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَعَمْرُكَ إِنَّهُمْ لَفِى سَكْرَتِهِمْ يَعْمَهُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad "నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు."[1] (అని దైవదూతలు అన్నారు.)
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُشْرِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَجَعَلْنَا عَٰلِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّلْمُتَوَسِّمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّلْمُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِن كَانَ أَصْحَٰبُ ٱلْأَيْكَةِ لَظَٰلِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱنتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ كَذَّبَ أَصْحَٰبُ ٱلْحِجْرِ ٱلْمُرْسَلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَءَاتَيْنَٰهُمْ ءَايَٰتِنَا فَكَانُوا۟ عَنْهَا مُعْرِضِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు. [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَكَانُوا۟ يَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًا ءَامِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు,[1] సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُصْبِحِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన (సయ్ హా) వారిపై కూడా వచ్చి పడింది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు వారు సంపాదించింది వారికి ఏ మాత్రం పనికి రాలేక పోయింది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَإِنَّ ٱلسَّاعَةَ لَـَٔاتِيَةٌ فَٱصْفَحِ ٱلصَّفْحَ ٱلْجَمِيلَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే[1] సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ رَبَّكَ هُوَ ٱلْخَلَّٰقُ ٱلْعَلِيمُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త,[1] సర్వజ్ఞుడు.[2]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ ءَاتَيْنَٰكَ سَبْعًا مِّنَ ٱلْمَثَانِى وَٱلْقُرْءَانَ ٱلْعَظِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِۦٓ أَزْوَٰجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَٱخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقُلْ إِنِّىٓ أَنَا ٱلنَّذِيرُ ٱلْمُبِينُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَمَآ أَنزَلْنَا عَلَى ٱلْمُقْتَسِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని), విభజించే వారిపై అవతరింపజేశామో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ جَعَلُوا۟ ٱلْقُرْءَانَ عِضِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَوَرَبِّكَ لَنَسْـَٔلَنَّهُمْ أَجْمَعِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَمَّا كَانُوا۟ يَعْمَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ ٱلْمُشْرِكِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు.[1] మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا كَفَيْنَٰكَ ٱلْمُسْتَهْزِءِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ يَجْعَلُونَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَسَوْفَ يَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ ٱلسَّٰجِدِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ ٱلْيَقِينُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Ibrahim
సూరా An-Nahl →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.