caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ibrahim ابراهيم

52 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 72

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ الٓر كِتَٰبٌ أَنزَلْنَٰهُ إِلَيْكَ لِتُخْرِجَ ٱلنَّاسَ مِنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ بِإِذْنِ رَبِّهِمْ إِلَىٰ صِرَٰطِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలిఫ్ - లామ్ - రా[1]. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - వారి ప్రభువు అనుమతితో - అంధకారాల నుండి వెలుతురులోకి,[2] సర్వశక్తిమంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) మార్గం వైపునకు తీసుకు రావటానికి, (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱللَّهِ ٱلَّذِى لَهُۥ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ وَوَيْلٌ لِّلْكَٰفِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే అల్లాహ్! ఆకాసాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం (వ్యధ) కలుగుతుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِينَ يَسْتَحِبُّونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا عَلَى ٱلْـَٔاخِرَةِ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا أُو۟لَٰٓئِكَ فِى ضَلَٰلٍۭ بَعِيدٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తూ, దానిని వక్రమైనదిగా చూపగోరుతారో! అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయిన వారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا بِلِسَانِ قَوْمِهِۦ لِيُبَيِّنَ لَهُمْ فَيُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతివారి భాషతోనే పంపాము; అతను వారికి స్పష్టంగా బోధించటానికి, మరియు అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు.[1] మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِـَٔايَٰتِنَآ أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ وَذَكِّرْهُم بِأَيَّىٰمِ ٱللَّهِ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) పంపి: "నీ జాతి వారిని అంధకారాల నుండి వెలుతురు వైపునకు తెచ్చి, వారికి అల్లాహ్ దినాలను[1] జ్ఞాపకం చేయించు." అని అన్నాము. నిశ్చయంగా, ఇందులో సహనశీలురకు, కృతజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ ٱذْكُرُوا۟ نِعْمَةَ ٱللَّهِ عَلَيْكُمْ إِذْ أَنجَىٰكُم مِّنْ ءَالِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوٓءَ ٱلْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَآءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَآءَكُمْ وَفِى ذَٰلِكُم بَلَآءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమూసా తన జాతివారితో ఇలా అన్నాడు: " అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ఫిర్ఔన్ జాతివారి నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన శిక్షలకు గురిచేస్తూ ఉండేవారు, మీ కుమారులను వధించి, మీ కుమార్తెలను (స్త్రీలను) బ్రతకనిచ్చేవారు.[1] మరియు అందులో మీకు, మీ ప్రభువు తరపు నుండి ఒక గొప్ప పరీక్ష ఉండింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِى لَشَدِيدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీ ప్రభువు ప్రకటించింది (జ్ఞాపకం చేసుకోండి): "మీరు కృతజ్ఞులైతే! నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను.[1] కాని ఒకవేళ మీరు కృతఘ్నులైతే! నిశ్చయంగా, నా శిక్ష ఎంతో కఠినమైనది.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَالَ مُوسَىٰٓ إِن تَكْفُرُوٓا۟ أَنتُمْ وَمَن فِى ٱلْأَرْضِ جَمِيعًا فَإِنَّ ٱللَّهَ لَغَنِىٌّ حَمِيدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మూసా ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు మరియు భూమిలో నున్న వారందరూ సత్యతిరస్కారానికి పాల్పడితే! తెలుసుకోండి నిశ్చయంగా, అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَأْتِكُمْ نَبَؤُا۟ ٱلَّذِينَ مِن قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَٱلَّذِينَ مِنۢ بَعْدِهِمْ لَا يَعْلَمُهُمْ إِلَّا ٱللَّهُ جَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَٰتِ فَرَدُّوٓا۟ أَيْدِيَهُمْ فِىٓ أَفْوَٰهِهِمْ وَقَالُوٓا۟ إِنَّا كَفَرْنَا بِمَآ أُرْسِلْتُم بِهِۦ وَإِنَّا لَفِى شَكٍّ مِّمَّا تَدْعُونَنَآ إِلَيْهِ مُرِيبٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? పూర్వం గతించిన, ప్రజల గాథలు మీకు చేరలేదా? నూహ్, ఆద్ మరియు సమూద్ జాతి వారి మరియు వారి తరువాత వచ్చిన వారి (గాథలు)? వారిని గురించి అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు, వారు తమ నోళ్ళలో తమ చేతులు పెట్టుకొని[1] ఇలా అన్నారు: "నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము. మరియు నిశ్చయంగా, మీరు దేని వైపునకైతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, దానిని గురించి మేము ఆందోళన కలిగించేటంత సందేహంలో పడి వున్నాము." [2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَتْ رُسُلُهُمْ أَفِى ٱللَّهِ شَكٌّ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ يَدْعُوكُمْ لِيَغْفِرَ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرَكُمْ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى قَالُوٓا۟ إِنْ أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعْبُدُ ءَابَآؤُنَا فَأْتُونَا بِسُلْطَٰنٍ مُّبِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి ప్రవక్తలు (వారితో) ఇలా అన్నారు: "ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన, అల్లాహ్ ను గురించి (మీకు) సందేహం ఉందా? ఆయన మీ పాపాలను క్షమించటానికి మరియు మీకు ఒక నిర్ణీత కాలం వరకు వ్యవధి నివ్వటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు!"[1] వారన్నారు: "మీరు కూడా మా వంటి మానవులే, మీరు మా తండ్రితాతలు ఆరాధిస్తూ వచ్చిన (దైవాల) ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? అయితే స్పష్టమైన ప్రమాణం ఏదైనా తీసుకురండి." [2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَتْ لَهُمْ رُسُلُهُمْ إِن نَّحْنُ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ وَلَٰكِنَّ ٱللَّهَ يَمُنُّ عَلَىٰ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ وَمَا كَانَ لَنَآ أَن نَّأْتِيَكُم بِسُلْطَٰنٍ إِلَّا بِإِذْنِ ٱللَّهِ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి ప్రవక్తలు వారితో (ఇంకా) ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము మీ వంటి మానవులం మాత్రమే! కాని అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు. మరియు - అల్లాహ్ అనుమతిస్తేనే తప్ప - మీ కొరకు ప్రమాణం తీసుకు రావటమనేది మా వశంలో లేదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదనే దృఢనమ్మకం ఉంచుకోవాలని.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا لَنَآ أَلَّا نَتَوَكَّلَ عَلَى ٱللَّهِ وَقَدْ هَدَىٰنَا سُبُلَنَا وَلَنَصْبِرَنَّ عَلَىٰ مَآ ءَاذَيْتُمُونَا وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُتَوَكِّلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"మరియు మేము అల్లాహ్ మీద నమ్మకం ఎందుకు ఉంచుకోరాదు? వాస్తవానికి ఆయనే మాకు సన్మార్గపు దారులను చూపాడు. మరియు మేము నిశ్చయంగా మీరు పెట్టే బాధలను సహనంతో భరిస్తాము. మరియు నమ్మకం గలవారు, కేవలం అల్లాహ్ మీదే దృఢ నమ్మకం ఉంచుకోవాలి!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُم مِّنْ أَرْضِنَآ أَوْ لَتَعُودُنَّ فِى مِلَّتِنَا فَأَوْحَىٰٓ إِلَيْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ ٱلظَّٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సత్యతిరస్కారులు తమ ప్రవక్తలతో అన్నారు: "మీరు మా మతంలోకి తిరిగి రాకపోతే మేము తప్పకుండా మిమ్మల్ని మా దేశం నుండి వెళ్ళగొడ్తాము."[1] అప్పుడు వారి ప్రభువు వారికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాడు: "మేము ఈ దుర్మార్గులను తప్పక నాశనం చేస్తాము.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَنُسْكِنَنَّكُمُ ٱلْأَرْضَ مِنۢ بَعْدِهِمْ ذَٰلِكَ لِمَنْ خَافَ مَقَامِى وَخَافَ وَعِيدِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి తరువాత ఆ భూమి మీద మిమ్మల్ని నివసింపజేస్తాము.[1] ఇది నా సాన్నిధ్యంలో నిలువటానికి (లెక్క చెప్పటానికి) భయపడేవానికి మరియు నా హెచ్చరికకు (శిక్షకు) భయపడేవానికి (నా వాగ్దానం)."[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱسْتَفْتَحُوا۟ وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيدٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు తీర్పు కోరారు[1] మరియు నిర్దయుడూ,[2] (సత్య) విరోధి అయిన ప్రతి వాడూ నాశనమయ్యాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مِّن وَرَآئِهِۦ جَهَنَّمُ وَيُسْقَىٰ مِن مَّآءٍ صَدِيدٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని ముందు నరకం అతనికై వేచి ఉంటుంది మరియు అక్కడ సలసల కాగే చిక్కని చీములాంటి నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَتَجَرَّعُهُۥ وَلَا يَكَادُ يُسِيغُهُۥ وَيَأْتِيهِ ٱلْمَوْتُ مِن كُلِّ مَكَانٍ وَمَا هُوَ بِمَيِّتٍ وَمِن وَرَآئِهِۦ عَذَابٌ غَلِيظٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదానిని అతడు గుటకలు గుటకలుగా బలవంతంగా గొంతులోకి దింపటానికి ప్రయత్నిస్తాడు. కాని దానిని మ్రింగలేడు. అతనికి ప్రతి వైపు నుండి మరణం ఆసన్నమవుతుంది, కాని అతడు మరణించలేడు. మరియు అతని ముందు భయంకరమైన శిక్ష వేచి ఉంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَّثَلُ ٱلَّذِينَ كَفَرُوا۟ بِرَبِّهِمْ أَعْمَٰلُهُمْ كَرَمَادٍ ٱشْتَدَّتْ بِهِ ٱلرِّيحُ فِى يَوْمٍ عَاصِفٍ لَّا يَقْدِرُونَ مِمَّا كَسَبُوا۟ عَلَىٰ شَىْءٍ ذَٰلِكَ هُوَ ٱلضَّلَٰلُ ٱلْبَعِيدُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతమ ప్రభువును తిరస్కరించిన వారి కర్మలను, తుఫాను దినమున పెనుగాలి ఎగురవేసే బూడిదతో పోల్చవచ్చు.[1] వారు తమ కర్మలకు ఎలాంటి ప్రతిఫలం పొందలేరు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం. [2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ تَرَ أَنَّ ٱللَّهَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలియదా?"[1] ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి, మరొక క్రొత్త సృష్టిని తేలగడు![2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا ذَٰلِكَ عَلَى ٱللَّهِ بِعَزِيزٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అలా చేయటం అల్లాహ్ కు కష్టమైన పని కాదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَبَرَزُوا۟ لِلَّهِ جَمِيعًا فَقَالَ ٱلضُّعَفَٰٓؤُا۟ لِلَّذِينَ ٱسْتَكْبَرُوٓا۟ إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا مِنْ عَذَابِ ٱللَّهِ مِن شَىْءٍ قَالُوا۟ لَوْ هَدَىٰنَا ٱللَّهُ لَهَدَيْنَٰكُمْ سَوَآءٌ عَلَيْنَآ أَجَزِعْنَآ أَمْ صَبَرْنَا مَا لَنَا مِن مَّحِيصٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారందరూ అల్లాహ్ ముందు హాజరు పరచబడి నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా ఉన్నవారు గొప్పవారిగా ఉన్న వారితో అంటారు: "వాస్తవానికి ప్రపంచంలో మేము మిమ్మల్ని అనుసరించాము, ఇపుడు మీరు మమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడటానికి ఏమైనా చేయగలరా?" వారంటారు: "అల్లాహ్ మాకు సన్మార్గం చూపి ఉంటే మేము మీకు కూడా (సన్మార్గం) చూపి ఉండేవారం. ఇపుడు మనం దుఃఖపడినా లేదా సహనం వహించినా అంతా ఒక్కటే! మనకిప్పుడు తప్పించుకునే మార్గం ఏదీ లేదు." [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَالَ ٱلشَّيْطَٰنُ لَمَّا قُضِىَ ٱلْأَمْرُ إِنَّ ٱللَّهَ وَعَدَكُمْ وَعْدَ ٱلْحَقِّ وَوَعَدتُّكُمْ فَأَخْلَفْتُكُمْ وَمَا كَانَ لِىَ عَلَيْكُم مِّن سُلْطَٰنٍ إِلَّآ أَن دَعَوْتُكُمْ فَٱسْتَجَبْتُمْ لِى فَلَا تَلُومُونِى وَلُومُوٓا۟ أَنفُسَكُم مَّآ أَنَا۠ بِمُصْرِخِكُمْ وَمَآ أَنتُم بِمُصْرِخِىَّ إِنِّى كَفَرْتُ بِمَآ أَشْرَكْتُمُونِ مِن قَبْلُ إِنَّ ٱلظَّٰلِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తీర్పు జరిగిన తరువాత షైతాను (వారితో) అంటాడు: "నిశ్చయంగా, అల్లాహ్ మీకు చేసిన వాగ్దానమే సత్యమైన వాగ్దానం. మరియు నేను మీకు వాగ్దానం చేసి దానిని భంగం చేశాను. మరియు నాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు; నేను కేవలం మిమ్మల్ని ఆహ్వానించాను, మీరు స్వీకరించారు.[1] కావున మీరు నన్ను నిందించకండి మిమ్మల్ని మీరే నిందించుకోండి. నేను మీకు సహాయం చేయలేను మరియు మీరూ నాకు సహాయం చేయలేరు. ఇంతకు ముందు మీరు నన్ను (అల్లాహ్ కు) సాటిగా కల్పించిన దాన్ని నిశ్చయంగా నేను తిరస్కరిస్తున్నాను".[2] నిశ్చయంగా, దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష ఉంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأُدْخِلَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَا بِإِذْنِ رَبِّهِمْ تَحِيَّتُهُمْ فِيهَا سَلَٰمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేయబడుతుంది. వారి ప్రభువు అనుమతితో వారక్కడ శాశ్వతంగా ఉంటారు. వారితో అక్కడ: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అనబడుతుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ تَرَ كَيْفَ ضَرَبَ ٱللَّهُ مَثَلًا كَلِمَةً طَيِّبَةً كَشَجَرَةٍ طَيِّبَةٍ أَصْلُهَا ثَابِتٌ وَفَرْعُهَا فِى ٱلسَّمَآءِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమంచి మాట (కలిమయె తయ్యిబ్) ను అల్లాహ్ దేనితో పోల్చాడో మీకు తెలియదా? ఒక మేలుజాతి చెట్టుతో! దాని వ్రేళ్ళు (భూమిలో) స్థిరంగా నాటుకొని ఉంటాయి. మరియు దాని శాఖలు ఆకాశాన్ని (అంటుకొంటున్నట్లు) ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تُؤْتِىٓ أُكُلَهَا كُلَّ حِينٍۭ بِإِذْنِ رَبِّهَا وَيَضْرِبُ ٱللَّهُ ٱلْأَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతన ప్రభువు ఆజ్ఞతో, అది ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తూ ఉంటుంది. మరియు ప్రజలు జ్ఞాపకముంచుకోవాలని అల్లాహ్ ఈ విధమైన ఉపమానాలు ఇస్తూ ఉంటాడు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَثَلُ كَلِمَةٍ خَبِيثَةٍ كَشَجَرَةٍ خَبِيثَةٍ ٱجْتُثَّتْ مِن فَوْقِ ٱلْأَرْضِ مَا لَهَا مِن قَرَارٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు చెడ్డమాటను, భూమి నుండి పెల్లగింపబడిన, స్థిరత్వం లేని, ఒక చెడ్డ జాతి చెట్టుతో పోల్చవచ్చు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُثَبِّتُ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱلْقَوْلِ ٱلثَّابِتِ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَفِى ٱلْـَٔاخِرَةِ وَيُضِلُّ ٱللَّهُ ٱلظَّٰلِمِينَ وَيَفْعَلُ ٱللَّهُ مَا يَشَآءُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవిశ్వసించి తమ మాటపై స్థిరంగా ఉన్నవారిని అల్లాహ్ ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ స్థిరపరుస్తాడు మరియు అల్లాహ్ దుర్మార్గులను మార్గభ్ర,ష్టులుగా చేస్తాడు. మరియు అల్లాహ్ తాను కోరినది చేస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ بَدَّلُوا۟ نِعْمَتَ ٱللَّهِ كُفْرًا وَأَحَلُّوا۟ قَوْمَهُمْ دَارَ ٱلْبَوَارِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? నీవు చూడలేదా (ఎరుగవా)? అల్లాహ్ అనుగ్రహాలను సత్యతిరస్కారంగా మార్చిన వారిని మరియు తమ జాతి వారిని వినాశ గృహంలోకి త్రోసినవారిని -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

جَهَنَّمَ يَصْلَوْنَهَا وَبِئْسَ ٱلْقَرَارُ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అంటే) నరకం! వారంతా అందులో ప్రవేశిస్తారు. మరియు అది ఎంత దుర్భరమైన నివాసము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَعَلُوا۟ لِلَّهِ أَندَادًا لِّيُضِلُّوا۟ عَن سَبِيلِهِۦ قُلْ تَمَتَّعُوا۟ فَإِنَّ مَصِيرَكُمْ إِلَى ٱلنَّارِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ప్రజలను) ఆయన మార్గం నుండి తప్పించటానికి వారు అల్లాహ్ కు సమానులను (అందాదులను) కల్పించారు. వారితో అను: "మీరు (తాత్కాలికంగా) సుఖసంతోషాలను అనుభవించండి. ఎందుకంటే! నిశ్చయంగా, మీ గమ్యస్థానం నరకాగ్నియే!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُل لِّعِبَادِىَ ٱلَّذِينَ ءَامَنُوا۟ يُقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَيُنفِقُوا۟ مِمَّا رَزَقْنَٰهُمْ سِرًّا وَعَلَانِيَةً مِّن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خِلَٰلٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనా దాసులలో విశ్వసించిన వారితో నమాజు స్థాపించమని మరియు మేము వారికిచ్చిన ఉపాధి నుండి రహస్యంగానో బహిరంగంగానో - బేరం జరుగటం గానీ, మిత్రుల సహాయం పొందటం గానీ సాధ్యం కాని దినం రాక పూర్వమే - ఖర్చు పెట్టమని చెప్పు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَخْرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزْقًا لَّكُمْ وَسَخَّرَ لَكُمُ ٱلْفُلْكَ لِتَجْرِىَ فِى ٱلْبَحْرِ بِأَمْرِهِۦ وَسَخَّرَ لَكُمُ ٱلْأَنْهَٰرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ ! ఆయనే, భూమ్యాకాశాలను సృష్టించాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి మీ కొరకు ఆహారంగా ఫలాలను పుట్టింటాడు. మరియు తన ఆజ్ఞతో, ఓడలను మీకు ఉపయుక్తంగా చేసి సముద్రంలో నడిపించాడు. మరియు నదులను కూడా మీకు ఉపయుక్తంగా చేశాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَسَخَّرَ لَكُمُ ٱلشَّمْسَ وَٱلْقَمَرَ دَآئِبَيْنِ وَسَخَّرَ لَكُمُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎడతెగకుండా, నిరంతరం పయనించే, సూర్యచంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు. మరియు రాత్రింబవళ్ళను కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేశాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَءَاتَىٰكُم مِّن كُلِّ مَا سَأَلْتُمُوهُ وَإِن تَعُدُّوا۟ نِعْمَتَ ٱللَّهِ لَا تُحْصُوهَآ إِنَّ ٱلْإِنسَٰنَ لَظَلُومٌ كَفَّارٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించజాలరు. నిశ్చయంగా, మానవుడు దుర్మార్గుడు, కృతఘ్నుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ رَبِّ ٱجْعَلْ هَٰذَا ٱلْبَلَدَ ءَامِنًا وَٱجْنُبْنِى وَبَنِىَّ أَن نَّعْبُدَ ٱلْأَصْنَامَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించిన విషయం (జ్ఞాపకం చేసుకోండి)[1]: "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతినిలయంగా ఉంచు! మరియు నన్నూ నా సంతానాన్నీ విగ్రహారాధన నుండి తప్పించు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِّنَ ٱلنَّاسِ فَمَن تَبِعَنِى فَإِنَّهُۥ مِنِّى وَمَنْ عَصَانِى فَإِنَّكَ غَفُورٌ رَّحِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ మా ప్రభూ! నిశ్చయంగా, అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి. ఇక నా విధానాన్ని అనుసరించేవాడు, నిశ్చయంగా, నా వాడు. మరియు ఎవడైనా నా విధానాన్ని ఉల్లంఘిస్తే! నిశ్చయంగా, నీవు క్షమాశీలుడవు, అపార కరుణా ప్రదాతపు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَّبَّنَآ إِنِّىٓ أَسْكَنتُ مِن ذُرِّيَّتِى بِوَادٍ غَيْرِ ذِى زَرْعٍ عِندَ بَيْتِكَ ٱلْمُحَرَّمِ رَبَّنَا لِيُقِيمُوا۟ ٱلصَّلَوٰةَ فَٱجْعَلْ أَفْـِٔدَةً مِّنَ ٱلنَّاسِ تَهْوِىٓ إِلَيْهِمْ وَٱرْزُقْهُم مِّنَ ٱلثَّمَرَٰتِ لَعَلَّهُمْ يَشْكُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం (కఅబహ్) దగ్గర, పైరు పండని, ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను.[1] ఓ మా ప్రభూ! వారిని అక్కడ నమాజ్ స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను, వారి వైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبَّنَآ إِنَّكَ تَعْلَمُ مَا نُخْفِى وَمَا نُعْلِنُ وَمَا يَخْفَىٰ عَلَى ٱللَّهِ مِن شَىْءٍ فِى ٱلْأَرْضِ وَلَا فِى ٱلسَّمَآءِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము దాచేదంతా మరియు వ్యక్త పరచేదంతా నీకు తెలుసు. మరియు భూమిలో గానీ, ఆకాశంలో గానీ అల్లాహ్ నుండి దాగి ఉన్నది ఏదీ లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى وَهَبَ لِى عَلَى ٱلْكِبَرِ إِسْمَٰعِيلَ وَإِسْحَٰقَ إِنَّ رَبِّى لَسَمِيعُ ٱلدُّعَآءِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయీల్ మరియు ఇస్ హాఖ్ లను ప్రసాదించాడు. నిశ్చయంగా, నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبِّ ٱجْعَلْنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِى رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"ఓ నా ప్రభూ! నన్ను మరియు నా సంతతి వారిని నమాజ్ స్థాపించే వారిగా చేయి. [1] ఓ మా ప్రభూ! నా ప్రార్థనలను స్వీకరించు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبَّنَا ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ ٱلْحِسَابُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ మా ప్రభూ! నన్నూ నా తల్లిదండ్రులను మరియు సమస్త విశ్వాసులను లెక్కల పరిష్కారం రోజు క్షమించు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تَحْسَبَنَّ ٱللَّهَ غَٰفِلًا عَمَّا يَعْمَلُ ٱلظَّٰلِمُونَ إِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍ تَشْخَصُ فِيهِ ٱلْأَبْصَٰرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఈ దుర్మార్గుల చేష్టల నుండి అల్లాహ్ నిర్లక్ష్యంగా ఉన్నాడని నీవు భావించకు.[1] నిశ్చయంగా, ఆయన వారిని - వారి కళ్ళు, రెప్ప వేయకుండా ఉండిపోయే - ఆ రోజు వరకు వ్యవధి నిస్తున్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُهْطِعِينَ مُقْنِعِى رُءُوسِهِمْ لَا يَرْتَدُّ إِلَيْهِمْ طَرْفُهُمْ وَأَفْـِٔدَتُهُمْ هَوَآءٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఆ రోజు) వారు తలలు పైకెత్తి, పరిగెత్తుతూ ఉంటారు, పై చూపులు పైనే నిలిచి ఉంటాయి. మరియు వారు శూన్యహృదయులై ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنذِرِ ٱلنَّاسَ يَوْمَ يَأْتِيهِمُ ٱلْعَذَابُ فَيَقُولُ ٱلَّذِينَ ظَلَمُوا۟ رَبَّنَآ أَخِّرْنَآ إِلَىٰٓ أَجَلٍ قَرِيبٍ نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ ٱلرُّسُلَ أَوَلَمْ تَكُونُوٓا۟ أَقْسَمْتُم مِّن قَبْلُ مَا لَكُم مِّن زَوَالٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ఓ ముహమ్మద్!) శిక్షపడే ఆ రోజు గురించి ప్రజలను నీవు హెచ్చరించు. ఆ రోజు దుర్మార్గం చేసిన వారు అంటారు: "ఓ మా ప్రభూ! నీ సందేశాన్ని స్వీకరించటానికి, ప్రవక్తలను అనుసరించటానికి, మాకు మరికొంత వ్యవధినివ్వు!"[1] (వారికి ఇలాంటి సమాధాన మివ్వబడుతుంది): "ఏమీ? ఇంతకు ముందు 'మాకు వినాశం లేదు' అని ప్రమాణం చేసి చెప్పిన వారు మీరే కాదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَسَكَنتُمْ فِى مَسَٰكِنِ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ ٱلْأَمْثَالَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"మరియు తమకు తాము అన్యాయం చేసుకున్న వారి స్థలాలలో మీరు నివసించారు. మరియు వారితో ఎలా వ్యవహరించామో మీకు బాగా తెలుసు. మరియు మేము మీకు ఎన్నో ఉపమానాలు కూడా ఇచ్చాము."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَدْ مَكَرُوا۟ مَكْرَهُمْ وَعِندَ ٱللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ ٱلْجِبَالُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి వారు తమ కుట్ర పన్నారు మరియు వారి కుట్ర అల్లాహ్ కు బాగా తెలుసు. కాని వారి కుట్ర కొండలను తమ చోటు నుండి కదిలింప గలిగేది కాదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَا تَحْسَبَنَّ ٱللَّهَ مُخْلِفَ وَعْدِهِۦ رُسُلَهُۥٓ إِنَّ ٱللَّهَ عَزِيزٌ ذُو ٱنتِقَامٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకనుక అల్లాహ్ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాన్ని భంగపరుస్తాడని భావించకు. నిశ్చయంగా, అల్లాహ్! సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ تُبَدَّلُ ٱلْأَرْضُ غَيْرَ ٱلْأَرْضِ وَٱلسَّمَٰوَٰتُ وَبَرَزُوا۟ لِلَّهِ ٱلْوَٰحِدِ ٱلْقَهَّارِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ భూమి మరొక భూమిగా మరియు ఆకాశాలు (వేరే ఆకాశాలుగా) మారే రోజు;[1] ఆ అద్వితీయుడు, ప్రబలుడు అయిన అల్లాహ్ ముందు అందరూ హాజరు చేయబడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَرَى ٱلْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِى ٱلْأَصْفَادِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ రోజు అపరాధులను సంకెళ్ళలో, కూడబెట్టి, బంధించి ఉంచటాన్ని నీవు చూస్తావు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ ٱلنَّارُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి వస్త్రాలు తారు (నల్ల జిడ్డు ద్రవం)తో చేయబడి ఉంటాయి మరియు అగ్ని జ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకొని ఉంటాయి -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لِيَجْزِىَ ٱللَّهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلْحِسَابِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ ప్రతి ప్రాణికి దాని కర్మల ప్రతిఫలం ఇవ్వటానికి. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَٰذَا بَلَٰغٌ لِّلنَّاسِ وَلِيُنذَرُوا۟ بِهِۦ وَلِيَعْلَمُوٓا۟ أَنَّمَا هُوَ إِلَٰهٌ وَٰحِدٌ وَلِيَذَّكَّرَ أُو۟لُوا۟ ٱلْأَلْبَٰبِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇది (ఈ ఖుర్ఆన్) మానవులకు ఒక సందేశం. వారు దీనితో హెచ్చరించబడటానికి మరియు నిశ్చయంగా ఆయన (అల్లాహ్) ఒక్కడే ఆరాధ్య దైవమని వారు తెలుసుకోవడానికి మరియు బుద్ధిమంతులు గ్రహించడానికి ఇది పంపబడింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70