caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Fajr الفجر

30 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 10

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلْفَجْرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadప్రాంతః కాలం సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَيَالٍ عَشْرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadపది రాత్రుల సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلشَّفْعِ وَٱلْوَتْرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసరి బేసీల సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّيْلِ إِذَا يَسْرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadగడచిపోయే రాత్రి సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَلْ فِى ذَٰلِكَ قَسَمٌ لِّذِى حِجْرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِرَمَ ذَاتِ ٱلْعِمَادِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّتِى لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى ٱلْبِلَٰدِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَثَمُودَ ٱلَّذِينَ جَابُوا۟ ٱلصَّخْرَ بِٱلْوَادِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَفِرْعَوْنَ ذِى ٱلْأَوْتَادِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِينَ طَغَوْا۟ فِى ٱلْبِلَٰدِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَكْثَرُوا۟ فِيهَا ٱلْفَسَادَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ رَبَّكَ لَبِٱلْمِرْصَادِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَمَّا ٱلْإِنسَٰنُ إِذَا مَا ٱبْتَلَىٰهُ رَبُّهُۥ فَأَكْرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَكْرَمَنِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَٰنَنِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا بَل لَّا تُكْرِمُونَ ٱلْيَتِيمَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تَحَٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَأْكُلُونَ ٱلتُّرَاثَ أَكْلًا لَّمًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتُحِبُّونَ ٱلْمَالَ حُبًّا جَمًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّآ إِذَا دُكَّتِ ٱلْأَرْضُ دَكًّا دَكًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّا صَفًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجِا۟ىٓءَ يَوْمَئِذٍۭ بِجَهَنَّمَ يَوْمَئِذٍ يَتَذَكَّرُ ٱلْإِنسَٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَقُولُ يَٰلَيْتَنِى قَدَّمْتُ لِحَيَاتِى

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيَّتُهَا ٱلنَّفْسُ ٱلْمُطْمَئِنَّةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱرْجِعِىٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱدْخُلِى فِى عِبَٰدِى

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱدْخُلِى جَنَّتِى

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70