సూరా Al-Ghaashiya الغاشية
26 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 68
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْغَٰشِيَةِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadహఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وُجُوهٌ يَوْمَئِذٍ خَٰشِعَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَامِلَةٌ نَّاصِبَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి,[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
تَصْلَىٰ نَارًا حَامِيَةً
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు దహించే అగ్నిలో పడి కాలుతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
تُسْقَىٰ مِنْ عَيْنٍ ءَانِيَةٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّا يُسْمِنُ وَلَا يُغْنِى مِن جُوعٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِّسَعْيِهَا رَاضِيَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadతాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى جَنَّةٍ عَالِيَةٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅత్యున్నతమైన స్వర్గవనంలో.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّا تَسْمَعُ فِيهَا لَٰغِيَةً
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِيهَا عَيْنٌ جَارِيَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పేర్చబడిన (మధు) పాత్రలు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَمَارِقُ مَصْفُوفَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَزَرَابِىُّ مَبْثُوثَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلْإِبِلِ كَيْفَ خُلِقَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِلَى ٱلسَّمَآءِ كَيْفَ رُفِعَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِلَى ٱلْجِبَالِ كَيْفَ نُصِبَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِلَى ٱلْأَرْضِ كَيْفَ سُطِحَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَذَكِّرْ إِنَّمَآ أَنتَ مُذَكِّرٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلْعَذَابَ ٱلْأَكْبَرَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ إِلَيْنَآ إِيَابَهُمْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→