caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Najm النجم

62 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 23

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلنَّجْمِ إِذَا هَوَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅస్తమించే నక్షత్రం సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا يَنطِقُ عَنِ ٱلْهَوَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ هُوَ إِلَّا وَحْىٌ يُوحَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَلَّمَهُۥ شَدِيدُ ٱلْقُوَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది అతనికి మహా బలవంతుడు (జిబ్రీల్) నేర్పాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذُو مِرَّةٍ فَٱسْتَوَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను శక్తిసామర్ధ్యాలు గలవాడు,[1] తన వాస్తవరూపంలో ప్రత్యక్షమయినప్పుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهُوَ بِٱلْأُفُقِ ٱلْأَعْلَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను ఎత్తైన దిజ్ఞ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు. [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ دَنَا فَتَدَلَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు అతను రెండు ధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَوْحَىٰٓ إِلَىٰ عَبْدِهِۦ مَآ أَوْحَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు అతను (జిబ్రీల్), ఆయన (అల్లాహ్) దాసునిపై అవతరింప జేయవలసిన, దానిని (వహీని) అవతరింపజేశాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا كَذَبَ ٱلْفُؤَادُ مَا رَأَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَتُمَٰرُونَهُۥ عَلَىٰ مَا يَرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ رَءَاهُ نَزْلَةً أُخْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عِندَ سِدْرَةِ ٱلْمُنتَهَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عِندَهَا جَنَّةُ ٱلْمَأْوَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ يَغْشَى ٱلسِّدْرَةَ مَا يَغْشَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا زَاغَ ٱلْبَصَرُ وَمَا طَغَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దుదాటి కూడా పోలేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَقَدْ رَأَىٰ مِنْ ءَايَٰتِ رَبِّهِ ٱلْكُبْرَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَرَءَيْتُمُ ٱللَّٰتَ وَٱلْعُزَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَنَوٰةَ ٱلثَّالِثَةَ ٱلْأُخْرَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَكُمُ ٱلذَّكَرُ وَلَهُ ٱلْأُنثَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇది అన్యాయమైన విభజన కాదా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ هِىَ إِلَّآ أَسْمَآءٌ سَمَّيْتُمُوهَآ أَنتُمْ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلْطَٰنٍ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهْوَى ٱلْأَنفُسُ وَلَقَدْ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلْهُدَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు.[1] వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ لِلْإِنسَٰنِ مَا تَمَنَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلِلَّهِ ٱلْـَٔاخِرَةُ وَٱلْأُولَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, అంతిమ (పరలోకం) మరియు ప్రథమం (ఇహలోకం) అన్నీ అల్లాహ్ కే చెందినవి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكَم مِّن مَّلَكٍ فِى ٱلسَّمَٰوَٰتِ لَا تُغْنِى شَفَٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ لَيُسَمُّونَ ٱلْمَلَٰٓئِكَةَ تَسْمِيَةَ ٱلْأُنثَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో! వారే దేవదూతలను స్త్రీల పేర్లతో పిలుస్తారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا لَهُم بِهِۦ مِنْ عِلْمٍ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنَّ ٱلظَّنَّ لَا يُغْنِى مِنَ ٱلْحَقِّ شَيْـًٔا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. కాని వాస్తవానికి, ఊహ సత్యానికి ఏ మాత్రం బదులు కాజాలదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున, మా హితబోధ (ఖుర్ఆన్) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు,

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذَٰلِكَ مَبْلَغُهُم مِّنَ ٱلْعِلْمِ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِمَنِ ٱهْتَدَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇదే వారి జ్ఞానపరిధి. నిశ్చయంగా, నీ ప్రభువుకు, ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడో కూడా, ఆయనకు బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلِلَّهِ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ لِيَجْزِىَ ٱلَّذِينَ أَسَٰٓـُٔوا۟ بِمَا عَمِلُوا۟ وَيَجْزِىَ ٱلَّذِينَ أَحْسَنُوا۟ بِٱلْحُسْنَى

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్ కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِينَ يَجْتَنِبُونَ كَبَٰٓئِرَ ٱلْإِثْمِ وَٱلْفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلْمَغْفِرَةِ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ ٱلْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌ فِى بُطُونِ أُمَّهَٰتِكُمْ فَلَا تُزَكُّوٓا۟ أَنفُسَكُمْ هُوَ أَعْلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి[1] మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా[2] ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి.[3] ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَرَءَيْتَ ٱلَّذِى تَوَلَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు (ఇస్లాం నుండి) మరలి పోయే వాడిని చూశావా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَعْطَىٰ قَلِيلًا وَأَكْدَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (అల్లాహ్ మార్గంలో) కొంత మాత్రమే ఇచ్చి, చేయి ఆపుకునేవాడిని?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَعِندَهُۥ عِلْمُ ٱلْغَيْبِ فَهُوَ يَرَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِى صُحُفِ مُوسَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِبْرَٰهِيمَ ٱلَّذِى وَفَّىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَن لَّيْسَ لِلْإِنسَٰنِ إِلَّا مَا سَعَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّ سَعْيَهُۥ سَوْفَ يُرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ يُجْزَىٰهُ ٱلْجَزَآءَ ٱلْأَوْفَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّ إِلَىٰ رَبِّكَ ٱلْمُنتَهَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّهُۥ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّهُۥ هُوَ أَمَاتَ وَأَحْيَا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّهُۥ خَلَقَ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, మగ-ఆడ జంటలను సృష్టించినవాడు ఆయనేనని -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవిసర్జింపబడిన వీర్యబిందువు నుండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّ عَلَيْهِ ٱلنَّشْأَةَ ٱلْأُخْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, దానికి మరొక జీవితాన్ని (పునరుత్థానం) ప్రసాదించడం ఆయన (అల్లాహ్) కే చెందినదని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّهُۥ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చు వాడని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّهُۥ هُوَ رَبُّ ٱلشِّعْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా ఆయనే అగ్ని[1] నక్షత్రానికి ప్రభువని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّهُۥٓ أَهْلَكَ عَادًا ٱلْأُولَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَثَمُودَا۟ فَمَآ أَبْقَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ إِنَّهُمْ كَانُوا۟ هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అంతకు పూర్వం నూహ్ జాతి వారిని. నిశ్చయంగా, వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْمُؤْتَفِكَةَ أَهْوَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَغَشَّىٰهَا مَا غَشَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత వాటిని క్రమ్ముకొనవలసింది (రాళ్ళ వర్షం) క్రమ్ముకున్నది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكَ تَتَمَارَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే (ఓ మానవుడా!) నీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَٰذَا نَذِيرٌ مِّنَ ٱلنُّذُرِ ٱلْأُولَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇది వరకు వచ్చిన హెచ్చరిక చేసే వారి వలే ఇతను (ముహమ్మద్) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَزِفَتِ ٱلْـَٔازِفَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadరానున్న ఘడియ (పునరుత్థాన దినం) సమీపంలోనే వుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَيْسَ لَهَا مِن دُونِ ٱللَّهِ كَاشِفَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَمِنْ هَٰذَا ٱلْحَدِيثِ تَعْجَبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మీరు ఈ సందేశాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు నవ్వుతున్నారా?మరియు మీకు ఏడ్పు రావటం లేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنتُمْ سَٰمِدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు నిర్లక్ష్యంలో మునిగి ఉన్నారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱسْجُدُوا۟ لِلَّهِ وَٱعْبُدُوا۟

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున! అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి. మరియు (ఆయనను మాత్రమే) ఆరాధించండి![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70