caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Qamar القمر

55 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 37

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱقْتَرَبَتِ ٱلسَّاعَةُ وَٱنشَقَّ ٱلْقَمَرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِن يَرَوْا۟ ءَايَةً يُعْرِضُوا۟ وَيَقُولُوا۟ سِحْرٌ مُّسْتَمِرٌّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكَذَّبُوا۟ وَٱتَّبَعُوٓا۟ أَهْوَآءَهُمْ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ جَآءَهُم مِّنَ ٱلْأَنۢبَآءِ مَا فِيهِ مُزْدَجَرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి, వారి వద్దకు సమాచారాలు వచ్చాయి. అందు వారికి మందలింపులు ఉండేవి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

حِكْمَةٌۢ بَٰلِغَةٌ فَمَا تُغْنِ ٱلنُّذُرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَتَوَلَّ عَنْهُمْ يَوْمَ يَدْعُ ٱلدَّاعِ إِلَىٰ شَىْءٍ نُّكُرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున (ఓ ముహమ్మద్!) నీవు వారి నుండి మరలిపో! పిలిచేవాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خُشَّعًا أَبْصَٰرُهُمْ يَخْرُجُونَ مِنَ ٱلْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُّنتَشِرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతల వలే, తమ గోరీల నుండి లేచి బయటికి వస్తారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُّهْطِعِينَ إِلَى ٱلدَّاعِ يَقُولُ ٱلْكَٰفِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవేగంగా పిలిచేవాని వైపునకు! సత్యతిరస్కారులు: "ఇది చాలా కఠినమైన రోజు." అని అంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا۟ عَبْدَنَا وَقَالُوا۟ مَجْنُونٌ وَٱزْدُجِرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారికి పూర్వం నూహ్[1] జాతి వారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు, అప్పుడు వారు మా దాసుణ్ణి: "అసత్యవాది!" అని అన్నారు. మరియు : "ఇతడు పిచ్చివాడు" అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَدَعَا رَبَّهُۥٓ أَنِّى مَغْلُوبٌ فَٱنتَصِرْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా నేను ఓడిపోయాను కావున నాకు సహాయం చేయి!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَفَتَحْنَآ أَبْوَٰبَ ٱلسَّمَآءِ بِمَآءٍ مُّنْهَمِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు మేము ఆకాశపు ద్వారాలు తెరిచి కుంభవర్షాన్ని కురిపించాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَفَجَّرْنَا ٱلْأَرْضَ عُيُونًا فَٱلْتَقَى ٱلْمَآءُ عَلَىٰٓ أَمْرٍ قَدْ قُدِرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు భూమి నుండి ఊటలను పొంగింపజేశాము అపుడు నిర్ణీత కార్యానికి గాను నీళ్ళన్నీ కలిసి పోయాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَحَمَلْنَٰهُ عَلَىٰ ذَاتِ أَلْوَٰحٍ وَدُسُرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము అతనిని (నూహ్ ను) పలకలు మరియు మేకులు గల దాని (ఓడపై) ఎక్కించాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَجْرِى بِأَعْيُنِنَا جَزَآءً لِّمَن كَانَ كُفِرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది మా కన్నుల ముందు తేలియాడుతూ పోయింది. (తన జాతి వారి చేత) తిరస్కరించబడిన వానికి ప్రతిఫలంగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَد تَّرَكْنَٰهَآ ءَايَةً فَهَلْ مِن مُّدَّكِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలి పెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكَيْفَ كَانَ عَذَابِى وَنُذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ يَسَّرْنَا ٱلْقُرْءَانَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِى وَنُذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆద్ జాతి సత్యాన్ని తిరస్కరించింది. చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّآ أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِى يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము పూర్తిగా దురదృష్టకరమైన (అరిష్టదాయకమైన) ఒక రోజున, తీవ్రమైన ఎడతెగని తుఫాను గాలిని పంపాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَنزِعُ ٱلنَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది ప్రజలను వేర్లతో పెళ్ళగింపబడిన ఖర్జూరపు చెట్ల వలే పెళ్ళగించి వేసింది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكَيْفَ كَانَ عَذَابِى وَنُذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ يَسَّرْنَا ٱلْقُرْءَانَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ ثَمُودُ بِٱلنُّذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసమూద్ జాతి హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَقَالُوٓا۟ أَبَشَرًا مِّنَّا وَٰحِدًا نَّتَّبِعُهُۥٓ إِنَّآ إِذًا لَّفِى ضَلَٰلٍ وَسُعُرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు వారు ఇలా అన్నారు: "ఏమీ? మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని, మేము అనుసరించాలా? అలా అయితే నిశ్చయంగా, మేము మార్గభ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَءُلْقِىَ ٱلذِّكْرُ عَلَيْهِ مِنۢ بَيْنِنَا بَلْ هُوَ كَذَّابٌ أَشِرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"ఏమీ? మా అందరిలో, కేవలం అతని మీదనే (దివ్య) సందేశం పంపబడిందా? అలా కాదు! అసలు అతను అసత్యవాది, డంబాలు పలికేవాడు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَيَعْلَمُونَ غَدًا مَّنِ ٱلْكَذَّابُ ٱلْأَشِرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅసత్యవాది, డంబాలు పలికేవాడు! ఎవడో రేపే (త్వరలోనే) వారికి తెలిసిపోతుంది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا مُرْسِلُوا۟ ٱلنَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَٱرْتَقِبْهُمْ وَٱصْطَبِرْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ సాలిహ్!) వారి విషయంలో వేచి ఉండు మరియు సహనం వహించు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَنَبِّئْهُمْ أَنَّ ٱلْمَآءَ قِسْمَةٌۢ بَيْنَهُمْ كُلُّ شِرْبٍ مُّحْتَضَرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి మధ్య నీరు (న్యాయంగా) పంచబడాలని వారికి బోధించు. ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చే రోజునే త్రాగాలని నియమించబడింది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَنَادَوْا۟ صَاحِبَهُمْ فَتَعَاطَىٰ فَعَقَرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకొని (దాని వెనుక కాలి మోకాలి నరాలు కోసి) చంపాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكَيْفَ كَانَ عَذَابِى وَنُذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّآ أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَٰحِدَةً فَكَانُوا۟ كَهَشِيمِ ٱلْمُحْتَظِرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము వారి మీదకు ఒక భయంకరమైన శబ్దాన్ని (సయ్ హాను) పంపాము, దాంతో వారు త్రొక్క బడిన పశువుల దొడ్డి కంచె వలే నుగ్గునుగ్గు అయి పోయారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ يَسَّرْنَا ٱلْقُرْءَانَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ قَوْمُ لُوطٍۭ بِٱلنُّذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలూత్ జాతి కూడా హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّآ أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّآ ءَالَ لُوطٍ نَّجَّيْنَٰهُم بِسَحَرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము లూత్ ఇంటివారు తప్ప! ఇతరుల మీదికి రాళ్ళు విసిరే తుఫాన్ గాలిని పంపాము. (లూత్ ఇంటి) వారిని మేము వేకువ ఝామున రక్షించాము;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

نِّعْمَةً مِّنْ عِندِنَا كَذَٰلِكَ نَجْزِى مَن شَكَرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమా తరఫు నుండి అనుగ్రహంగా. ఈ విధంగా మేము కృతజ్ఞులకు ప్రతిఫలం ఇస్తాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ أَنذَرَهُم بَطْشَتَنَا فَتَمَارَوْا۟ بِٱلنُّذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి (లూత్ తన జాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికలను సందేహించి (మొండి) వాదనలకు దిగారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ رَٰوَدُوهُ عَن ضَيْفِهِۦ فَطَمَسْنَآ أَعْيُنَهُمْ فَذُوقُوا۟ عَذَابِى وَنُذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి వారు అతని అతిథులను[1] అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొట్టాము. (వారితో ఇలా అన్నాము): "ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవి చూడండి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి, ఉదయపు వేళ శాశ్వతమైన శిక్ష వారి మీద పడింది:

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَذُوقُوا۟ عَذَابِى وَنُذُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"ఇప్పుడు మీరు నా శిక్షను మరియు నా హెచ్చరికలను చవి చూడండి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ يَسَّرْنَا ٱلْقُرْءَانَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ جَآءَ ءَالَ فِرْعَوْنَ ٱلنُّذُرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి ఫిర్ఔన్ జాతి వారికి కూడా హెచ్చరికలు వచ్చాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا كُلِّهَا فَأَخَذْنَٰهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు మా సూచనలను అన్నిటినీ అబద్ధాలని తిరస్కరించారు, కావున మేము వారిని పట్టుకున్నాము, సర్వశక్తిమంతుడు సర్వసమర్ధుడు పట్టుకునే విధంగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُو۟لَٰٓئِكُمْ أَمْ لَكُم بَرَآءَةٌ فِى ٱلزُّبُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్యతిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారి కంటే శ్రేష్ఠులా? లేక దివ్యగ్రంథాలలో మీ కొరకు (మా శిక్ష నుండి) ఏదైనా మినహాయింపు వ్రాయబడి ఉందా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక వారు: "మాది ఒక శక్తిగల వర్గం, (కావున) మేము ప్రాబల్యం పొందగలం" అని అంటున్నారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَيُهْزَمُ ٱلْجَمْعُ وَيُوَلُّونَ ٱلدُّبُرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلِ ٱلسَّاعَةُ مَوْعِدُهُمْ وَٱلسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅంతేకాదు! అంతిమ ఘడియయే, వారి వాగ్దాన సమయం మరియు ఆ ఘడియ ఎంతో దారుణమైనది మరియు ఎంతో తీవ్రమైనదీను (చేదైనదీను).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلْمُجْرِمِينَ فِى ضَلَٰلٍ وَسُعُرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, పాపాత్ములు మార్గభ్రష్టత్వంలో ఉన్నారు మరియు వారు (పరలోకంలో) నరకాగ్నిలో కాలుతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ يُسْحَبُونَ فِى ٱلنَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا۟ مَسَّ سَقَرَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు వారు తమ ముఖాల మీద నరకాగ్ని లోకి ఈడ్చబడతారు; (వారితో):"నరకాగ్ని స్పర్శను చవి చూడండి!" అని అనబడుతుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا كُلَّ شَىْءٍ خَلَقْنَٰهُ بِقَدَرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَمْرُنَآ إِلَّا وَٰحِدَةٌ كَلَمْحٍۭ بِٱلْبَصَرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్పపాటుది, (అది అయిపోతుంది).[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ أَهْلَكْنَآ أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి, మేము మీ వంటి వారిని, ఎందరినో నాశనం చేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكُلُّ شَىْءٍ فَعَلُوهُ فِى ٱلزُّبُرِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు చేసిన ప్రతి విషయం వారి కర్మ గ్రంథాలలో (చిట్టాలలో) వ్రాయబడి ఉంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ వ్రాయబడి ఉన్నాయి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍ وَنَهَرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో సెలయేళ్ళ దగ్గర ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِى مَقْعَدِ صِدْقٍ عِندَ مَلِيكٍ مُّقْتَدِرٍۭ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసత్యపీఠం మీద,[1] విశ్వసామ్రాట్టు,[2] సర్వసమర్ధుని సన్నిధిలో.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70