హోమ్ › సూరాలు › సూరా At-Tur
సూరా At-Tur الطور
49 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 76
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلطُّورِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తూర్ పర్వతం సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَكِتَٰبٍ مَّسْطُورٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వ్రాయబడిన గ్రంథం సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى رَقٍّ مَّنشُورٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad విప్పబడిన చర్మపత్రం మీద.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْبَيْتِ ٱلْمَعْمُورِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad చిరకాల సందర్శనాలయం సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلسَّقْفِ ٱلْمَرْفُوعِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْبَحْرِ ٱلْمَسْجُورِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఉప్పొంగే సముద్రం సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ عَذَابَ رَبِّكَ لَوَٰقِعٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష సంభవించ నున్నది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَّا لَهُۥ مِن دَافِعٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దానిని తప్పించేవాడు ఎవ్వడు లేడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ تَمُورُ ٱلسَّمَآءُ مَوْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَسِيرُ ٱلْجِبَالُ سَيْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَوَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు, ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ هُمْ فِى خَوْضٍ يَلْعَبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
هَٰذِهِ ٱلنَّارُ ٱلَّتِى كُنتُم بِهَا تُكَذِّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (వారితో ఇలా అనబడుతుంది): "మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَسِحْرٌ هَٰذَآ أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱصْلَوْهَا فَٱصْبِرُوٓا۟ أَوْ لَا تَصْبِرُوا۟ سَوَآءٌ عَلَيْكُمْ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍ وَنَعِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖసంతోషాలలో ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٰكِهِينَ بِمَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ وَوَقَىٰهُمْ رَبُّهُمْ عَذَابَ ٱلْجَحِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ వుండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مُتَّكِـِٔينَ عَلَىٰ سُرُرٍ مَّصْفُوفَةٍ وَزَوَّجْنَٰهُم بِحُورٍ عِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో[1] వారి వివాహం చేయిస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَٱتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَٰنٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَآ أَلَتْنَٰهُم مِّنْ عَمَلِهِم مِّن شَىْءٍ كُلُّ ٱمْرِئٍۭ بِمَا كَسَبَ رَهِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము.[1] మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు.[2]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَمْدَدْنَٰهُم بِفَٰكِهَةٍ وَلَحْمٍ مِّمَّا يَشْتَهُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము వారికి, వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَتَنَٰزَعُونَ فِيهَا كَأْسًا لَّا لَغْوٌ فِيهَا وَلَا تَأْثِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అందులో (ఆ స్వర్గంలో) వారు ఒకరి కొకరు (మధు) పాత్ర మార్చుకుంటూ ఉంటారు; దాన్ని (త్రాగటం) వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُونٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు,[1] వారి సేవ కొరకు వారి చుట్టు ప్రక్కలలో తిరుగుతూ ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు ఒకరి వైపుకొకరు మరలి పరస్పరం (తమ గతించిన జీవితాలను గురించి) మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوٓا۟ إِنَّا كُنَّا قَبْلُ فِىٓ أَهْلِنَا مُشْفِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు ఇలా అంటారు: "వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు (అల్లాహ్ శిక్షకు) భయపడుతూ ఉండేవారము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَنَّ ٱللَّهُ عَلَيْنَا وَوَقَىٰنَا عَذَابَ ٱلسَّمُومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున నిశ్చయంగా, అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا كُنَّا مِن قَبْلُ نَدْعُوهُ إِنَّهُۥ هُوَ ٱلْبَرُّ ٱلرَّحِيمُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా, ఆయన మహోపకారి,[1] అపార కరుణా ప్రదాత.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَذَكِّرْ فَمَآ أَنتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَلَا مَجْنُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున (ఓ ప్రవక్తా!) నీవు హితోపదేశం చేస్తూ వుండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్కుడవు కావు మరియు పిచ్చివాడవూ కావు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ يَقُولُونَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهِۦ رَيْبَ ٱلْمَنُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లేదా? వారు: "ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. అని అంటున్నారా?"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قُلْ تَرَبَّصُوا۟ فَإِنِّى مَعَكُم مِّنَ ٱلْمُتَرَبِّصِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారితో ఇలా అను: "మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా, నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ تَأْمُرُهُمْ أَحْلَٰمُهُم بِهَٰذَآ أَمْ هُمْ قَوْمٌ طَاغُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ يَقُولُونَ تَقَوَّلَهُۥ بَل لَّا يُؤْمِنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? వారు: "ఇతనే, దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు" అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించ దలుచుకోలేదు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلْيَأْتُوا۟ بِحَدِيثٍ مِّثْلِهِۦٓ إِن كَانُوا۟ صَٰدِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ خُلِقُوا۟ مِنْ غَيْرِ شَىْءٍ أَمْ هُمُ ٱلْخَٰلِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ خَلَقُوا۟ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ بَل لَّا يُوقِنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ عِندَهُمْ خَزَآئِنُ رَبِّكَ أَمْ هُمُ ٱلْمُصَۣيْطِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَٰنٍ مُّبِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు (దేవదూతల మాటలు) వినటానికి? అలా అయితే! వారిలో ఎవడైతే విన్నాడో, అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ لَهُ ٱلْبَنَٰتُ وَلَكُمُ ٱلْبَنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆయన (అల్లాహ్) కు కూతుళ్ళూ మరియు మీకేమో కుమారులా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఓ ముహమ్మద్!) నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు ఋణభారంతో అణిగి పోవటానికి?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దానిని వ్రాసి పెట్టారా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ يُرِيدُونَ كَيْدًا فَٱلَّذِينَ كَفَرُوا۟ هُمُ ٱلْمَكِيدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَمْ لَهُمْ إِلَٰهٌ غَيْرُ ٱللَّهِ سُبْحَٰنَ ٱللَّهِ عَمَّا يُشْرِكُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِن يَرَوْا۟ كِسْفًا مِّنَ ٱلسَّمَآءِ سَاقِطًا يَقُولُوا۟ سَحَابٌ مَّرْكُومٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలి పడటం చూసినా: "ఇవి దట్టమైన మేఘాలు!" అని అనేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَذَرْهُمْ حَتَّىٰ يُلَٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى فِيهِ يُصْعَقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున వారు తమ (తీర్పు) దినాన్ని దర్శించే వరకు వారిని వదిలి పెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడి పోతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ لَا يُغْنِى عَنْهُمْ كَيْدُهُمْ شَيْـًٔا وَلَا هُمْ يُنصَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆరోజు వారి పన్నాగం వారికి ఏ మాత్రం పనికి రాదు. మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ عَذَابًا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారికి, ఇదే గాక మరొక శిక్ష కూడా ఉంది,[1] కాని వారిలో చాలా మందికి అది తెలియదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمِنَ ٱلَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَٰرَ ٱلنُّجُومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు[1] మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను![2]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Adh-Dhaariyat
సూరా An-Najm →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.