ٱلَّذِينَ يَجْتَنِبُونَ كَبَٰٓئِرَ ٱلْإِثْمِ وَٱلْفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلْمَغْفِرَةِ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ ٱلْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌ فِى بُطُونِ أُمَّهَٰتِكُمْ فَلَا تُزَكُّوٓا۟ أَنفُسَكُمْ هُوَ أَعْلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి[1] మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా[2] ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి.[3] ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు.