హోమ్ › సూరాలు › సూరా Adh-Dhaariyat
సూరా Adh-Dhaariyat الذاريات
60 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 67
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلذَّٰرِيَٰتِ ذَرْوًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad దుమ్ము ఎగురవేసే వాటి (గాలుల) సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْحَٰمِلَٰتِ وِقْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (నీటి) భారాన్ని మోసే (మేఘాల);
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْجَٰرِيَٰتِ يُسْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు సముద్రంలో సులభంగా తేలియాడే (ఓడల);
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْمُقَسِّمَٰتِ أَمْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (ఆయన) ఆజ్ఞతో (అనుగ్రహాలను) పంచిపెట్టే (దేవదూతల సాక్షిగా);[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మీకు చేయబడ్డ వాగ్దానం సత్యం.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّ ٱلدِّينَ لَوَٰقِعٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా తీర్పు రానున్నది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْحُبُكِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّكُمْ لَفِى قَوْلٍ مُّخْتَلِفٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (సత్యం నుండి) మరలింపబడిన వాడే, మోసగింపబడిన వాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قُتِلَ ٱلْخَرَّٰصُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ هُمْ فِى غَمْرَةٍ سَاهُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎవరైతే నిర్లక్ష్యంలో పడి అశ్రద్ధగా ఉన్నారో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَسْـَٔلُونَ أَيَّانَ يَوْمُ ٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు ఇలా అడుగుతున్నారు: "తీర్పుదినం ఎప్పుడు రానున్నది?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ هُمْ عَلَى ٱلنَّارِ يُفْتَنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ దినమున, వారు అగ్నితో దహింపబడతారు (పరీక్షింపబడతారు).
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ذُوقُوا۟ فِتْنَتَكُمْ هَٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تَسْتَعْجِلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (వారితో ఇలా అనబడుతుంది): "మీ పరీక్షను[1] రుచి చూడండి! మీరు దీని కొరకే తొందర పెట్టేవారు!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍ وَعُيُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, దైవభీతి గలవారు చెలమలు గల స్వర్గవనాలలో ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ءَاخِذِينَ مَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ! నిశ్చయంగా వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَانُوا۟ قَلِيلًا مِّنَ ٱلَّيْلِ مَا يَهْجَعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَبِٱلْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు రాత్రి చివరి ఘడియలలో[1] క్షమాపణ వేడుకునే వారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّ لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి[1] హక్కు ఉంటుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفِى ٱلْأَرْضِ ءَايَٰتٌ لِّلْمُوقِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفِىٓ أَنفُسِكُمْ أَفَلَا تُبْصِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفِى ٱلسَّمَآءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినది ఉంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَوَرَبِّ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ إِنَّهُۥ لَحَقٌّ مِّثْلَ مَآ أَنَّكُمْ تَنطِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో)!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
هَلْ أَتَىٰكَ حَدِيثُ ضَيْفِ إِبْرَٰهِيمَ ٱلْمُكْرَمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? ఇబ్రాహీమ్ యొక్క గౌరవనీయులైన అతిథుల గాథ నీకు చేరిందా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَٰمًا قَالَ سَلَٰمٌ قَوْمٌ مُّنكَرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు అతని వద్దకు వచ్చినపుడు: "మీకు సలాం!" అని అన్నారు. అతను: "మీకూ సలాం!" అని జవాబిచ్చి : "మీరు పరిచయం లేని (కొత్త) వారుగా ఉన్నారు." అని అన్నాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَرَاغَ إِلَىٰٓ أَهْلِهِۦ فَجَآءَ بِعِجْلٍ سَمِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత అతను తన ఇంటిలోకి పోయి బలిసిన (వేయించిన) ఒక ఆవు దూడను తీసుకొని వచ్చాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَقَرَّبَهُۥٓ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దానిని వారి ముందుకు జరిపి: "ఏమీ? మీరెందుకు తినటం లేదు?" అని అడిగాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً قَالُوا۟ لَا تَخَفْ وَبَشَّرُوهُ بِغُلَٰمٍ عَلِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (వారు తినకుండా ఉండటం చూసి), వారి నుండి భయపడ్డాడు.[1] వారన్నారు: "భయపడకు!" మరియు వారు అతనికి జ్ఞానవంతుడైన కుమారుని శుభవార్తనిచ్చారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَقْبَلَتِ ٱمْرَأَتُهُۥ فِى صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: "నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوا۟ كَذَٰلِكِ قَالَ رَبُّكِ إِنَّهُۥ هُوَ ٱلْحَكِيمُ ٱلْعَلِيمُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారన్నారు: "నీ ప్రభువు ఇలాగే అన్నాడు! నిశ్చయంగా, ఆయన మహావివేకవంతుడు, సర్వజ్ఞుడు!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (ఇబ్రాహీమ్) అడిగాడు: "ఓ సందేశహరులారా (ఓ దేవదూతలారా)! అయితే మీరు వచ్చిన కారణమేమిటి?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారన్నారు: "వాస్తవానికి, మేము నేరస్థులైన జనుల వైపునకు పంపబడ్డాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి మీద (కాల్చబడిన) మట్టి రాళ్ళను కురిపించటం కోసం![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడిన (రాళ్ళు);[1] మితిమీరి ప్రవర్తించేవారి కొరకు!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ ٱلْمُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు మేము అందులో ఉన్న విశ్వాసులందరినీ బయటికి తీశాము. [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ ٱلْمُسْلِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేము అందు ఒక్క గృహం తప్ప![1] ఇతర విధేయుల (ముస్లింల)[2] గృహాన్ని చూడలేదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَرَكْنَا فِيهَآ ءَايَةً لِّلَّذِينَ يَخَافُونَ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు బాధాకరమైన శిక్షకు భయపడేవారి కొరకు, మేము అక్కడ ఒక సూచన (ఆయత్) ను వదలి పెట్టాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفِى مُوسَىٰٓ إِذْ أَرْسَلْنَٰهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَٰنٍ مُّبِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక మూసా (గాథలో) కూడా (ఒక సూచన వుంది) మేము అతనిని ఫిర్ఔన్ వద్దకు స్పష్టమైన ప్రమాణంతో పంపినపుడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَتَوَلَّىٰ بِرُكْنِهِۦ وَقَالَ سَٰحِرٌ أَوْ مَجْنُونٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతడు (ఫిర్ఔన్) తన సభాసదులతో సహా మరలిపోతూ, ఇలా అన్నాడు: "ఇతడు మాంత్రికుడు లేదా పిచ్చివాడు!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَخَذْنَٰهُ وَجُنُودَهُۥ فَنَبَذْنَٰهُمْ فِى ٱلْيَمِّ وَهُوَ مُلِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున మేము అతనిని మరియు అతని సైనికులను పట్టుకొని, వారందరినీ సముద్రంలో ముంచి వేశాము మరియు దానికి అతడే నిందితుడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفِى عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ ٱلرِّيحَ ٱلْعَقِيمَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక ఆద్ జాతి వారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَا تَذَرُ مِن شَىْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَٱلرَّمِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفِى ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا۟ حَتَّىٰ حِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: "కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَعَتَوْا۟ عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ ٱلصَّٰعِقَةُ وَهُمْ يَنظُرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారి మీద విరుచుకు పడింది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَا ٱسْتَطَٰعُوا۟ مِن قِيَامٍ وَمَا كَانُوا۟ مُنتَصِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకపోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడు కోలేక పోయారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًا فَٰسِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు దీనికి ముందు నూహ్ జాతి వారిని కూడా (నాశనం చేశాము). నిశ్చయంగా, వారు కూడా అవిధేయులు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلسَّمَآءَ بَنَيْنَٰهَا بِأَيْي۟دٍ وَإِنَّا لَمُوسِعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఆకాశాన్ని మేము (మా) చేతులతో నిర్మించాము. మరియు నిశ్చయంగా, మేమే దానిని విస్తరింపజేయ గలవారము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْأَرْضَ فَرَشْنَٰهَا فَنِعْمَ ٱلْمَٰهِدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు భూమిని మేము పరుపుగా చేశాము, మేమే చక్కగా పరిచేవారము!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمِن كُلِّ شَىْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మేము ప్రతిదానిని జంటలుగా సృష్టించాము, మీరు గ్రహించాలని.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَفِرُّوٓا۟ إِلَى ٱللَّهِ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున మీరు అల్లాహ్ వైపునకు పరుగెత్తండి. నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَا تَجْعَلُوا۟ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మీరు అల్లాహ్ కు సాటిగా ఇతర దైవాన్ని నిలుపకండి! నిశ్చయంగా, నేను (ముహమ్మద్) ఆయన తరఫు నుండి మీకు స్పష్టంగా హెచ్చరిక చేసేవాడిని మాత్రమే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَذَٰلِكَ مَآ أَتَى ٱلَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا۟ سَاحِرٌ أَوْ مَجْنُونٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇదే విధంగా, వారికి పూర్వం గడిచిన వారి వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు: "ఇతను మాంత్రికుడు లేదా పిచ్చివాడు." అని అనకుండా ఉండలేదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَتَوَاصَوْا۟ بِهِۦ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? దీనిని (ఇలా పలుకుటను) వారు ఒకరికొకరు వారసత్వంగా ఇచ్చుకున్నారా? అలా కాదు! అసలు వారు తలబిరుసుతనంతో ప్రవర్తించే జనం!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَتَوَلَّ عَنْهُمْ فَمَآ أَنتَ بِمَلُومٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున నీవు వారి నుండి మరలిపో, ఇక నీపై ఎలాంటి నింద లేదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَذَكِّرْ فَإِنَّ ٱلذِّكْرَىٰ تَنفَعُ ٱلْمُؤْمِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారిని ఉపదేశిస్తూ వుండు, నిశ్చయంగా, ఉపదేశం విశ్వాసులకు ప్రయోజనకర మవుతుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَآ أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَآ أُرِيدُ أَن يُطْعِمُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلْقُوَّةِ ٱلْمَتِينُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَٰبِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడినవారి పాపాలు వారి (పూర్వ) స్నేహితుల పాపాల వంటివే! కావున వారు నా (శిక్ష కొరకు) తొందర పెట్టనవసరం లేదు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا۟ مِن يَوْمِهِمُ ٱلَّذِى يُوعَدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున సత్యతిరస్కారులకు వినాశం గలదు - వారికి వాగ్దానం చేయబడిన - ఆ దినమున!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Qaaf
సూరా At-Tur →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.