సూరా Al-Mursalaat المرسلات
50 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 33
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلْمُرْسَلَٰتِ عُرْفًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా[1]!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْعَٰصِفَٰتِ عَصْفًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా[1]!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلنَّٰشِرَٰتِ نَشْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా[1]!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْفَٰرِقَٰتِ فَرْقًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా[1]!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْمُلْقِيَٰتِ ذِكْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadసందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عُذْرًا أَوْ نُذْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadసాకుగా లేక హెచ్చరికగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశం చీలిపోతుందో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا ٱلْجِبَالُ نُسِفَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِأَىِّ يَوْمٍ أُجِّلَتْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِيَوْمِ ٱلْفَصْلِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తీర్పుదినం కొరకా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلْفَصْلِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَلَمْ نُهْلِكِ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ نُتْبِعُهُمُ ٱلْـَٔاخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَلَمْ نَخْلُقكُّم مِّن مَّآءٍ مَّهِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَجَعَلْنَٰهُ فِى قَرَارٍ مَّكِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఒక నిర్ణీత కాలం వరకు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَقَدَرْنَا فَنِعْمَ ٱلْقَٰدِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ كِفَاتًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَحْيَآءً وَأَمْوَٰتًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadజీవులకూ మరియు మృతులకూను?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَجَعَلْنَا فِيهَا رَوَٰسِىَ شَٰمِخَٰتٍ وَأَسْقَيْنَٰكُم مَّآءً فُرَاتًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱنطَلِقُوٓا۟ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱنطَلِقُوٓا۟ إِلَىٰ ظِلٍّ ذِى ثَلَٰثِ شُعَبٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّا ظَلِيلٍ وَلَا يُغْنِى مِنَ ٱللَّهَبِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهَا تَرْمِى بِشَرَرٍ كَٱلْقَصْرِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَأَنَّهُۥ جِمَٰلَتٌ صُفْرٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ దినాన వారు మాట్లాడలేరు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
هَٰذَا يَوْمُ ٱلْفَصْلِ جَمَعْنَٰكُمْ وَٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ ٱلْمُتَّقِينَ فِى ظِلَٰلٍ وَعُيُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفَوَٰكِهَ مِمَّا يَشْتَهُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كُلُوا۟ وَتَمَتَّعُوا۟ قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا قِيلَ لَهُمُ ٱرْكَعُوا۟ لَا يَرْكَعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadదీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→