caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Naba النبإ

40 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 80

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ عَمَّ يَتَسَآءَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَنِ ٱلنَّبَإِ ٱلْعَظِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ మహా వార్తను గురించేనా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى هُمْ فِيهِ مُخْتَلِفُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا سَيَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ مِهَٰدًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْجِبَالَ أَوْتَادًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పర్వతాలను మేకులుగా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَخَلَقْنَٰكُمْ أَزْوَٰجًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَعَلْنَا ٱلَّيْلَ لِبَاسًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَعَلْنَا ٱلنَّهَارَ مَعَاشًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنزَلْنَا مِنَ ٱلْمُعْصِرَٰتِ مَآءً ثَجَّاجًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لِّنُخْرِجَ بِهِۦ حَبًّا وَنَبَاتًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadదానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَنَّٰتٍ أَلْفَافًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు దట్టమైన తోటలను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ يَوْمَ ٱلْفَصْلِ كَانَ مِيقَٰتًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتْ أَبْوَٰبًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَسُيِّرَتِ ٱلْجِبَالُ فَكَانَتْ سَرَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నరకం ఒక మాటు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لِّلطَّٰغِينَ مَـَٔابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadధిక్కారుల గమ్యస్థానం;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَّٰبِثِينَ فِيهَآ أَحْقَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో వారు యుగాల తరబడి ఉంటారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا حَمِيمًا وَغَسَّاقًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadసలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం)[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

جَزَآءً وِفَاقًا

Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُمْ كَانُوا۟ لَا يَرْجُونَ حِسَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا كِذَّابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadపైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكُلَّ شَىْءٍ أَحْصَيْنَٰهُ كِتَٰبًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَذُوقُوا۟ فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

حَدَآئِقَ وَأَعْنَٰبًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكَوَاعِبَ أَتْرَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكَأْسًا دِهَاقًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిండి పొర్లే (మధు) పాత్ర

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّٰبًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

جَزَآءً مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلرَّحْمَٰنِ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadభూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلْمَلَٰٓئِكَةُ صَفًّا لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ ٱلرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్)[1] మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلْحَقُّ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّآ أَنذَرْنَٰكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ ٱلْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ ٱلْكَافِرُ يَٰلَيْتَنِى كُنتُ تُرَٰبًۢا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు.[1] మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది[2]!" అని వాపోతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70