caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Insaan الانسان

31 ఆయతులు · మదీనా · అవతరణ క్రమం 98

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ هَلْ أَتَىٰ عَلَى ٱلْإِنسَٰنِ حِينٌ مِّنَ ٱلدَّهْرِ لَمْ يَكُن شَيْـًٔا مَّذْكُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅనంత కాలచక్రంలో, మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا خَلَقْنَا ٱلْإِنسَٰنَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَٰهُ سَمِيعًۢا بَصِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము[1]. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము[2].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا هَدَيْنَٰهُ ٱلسَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు[1]!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّآ أَعْتَدْنَا لِلْكَٰفِرِينَ سَلَٰسِلَا۟ وَأَغْلَٰلًا وَسَعِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల కొరకు సంకెళ్ళను, మెడలో పట్టాలను మరియు భగభగ మండే నరకాగ్నిని (సఈరాను0 సిద్ధపరచి ఉంటాము[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلْأَبْرَارَ يَشْرَبُونَ مِن كَأْسٍ كَانَ مِزَاجُهَا كَافُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, పుణ్యాత్ములు కాఫూర్ అనే ఒక చెలమ నుండి ఒక గిన్నెలో తెచ్చిన (పానీయాన్ని) త్రాగుతారు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَيْنًا يَشْرَبُ بِهَا عِبَادُ ٱللَّهِ يُفَجِّرُونَهَا تَفْجِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadధారాళంగా పొంగి ప్రవహింప జేయబడే ఊటల నుండి, అల్లాహ్ దాసులు త్రాగుతూ ఉంటారు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُوفُونَ بِٱلنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُۥ مُسْتَطِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారై ఉంటారు[1]. మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيُطْعِمُونَ ٱلطَّعَامَ عَلَىٰ حُبِّهِۦ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అది తమకు ప్రీతికరమైనప్పటికీ వారు నిరుపేదలకు మరియు అనాథలకు మరియు ఖైదీలకు, ఆహారం పెట్టేవారై ఉంటారు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّمَا نُطْعِمُكُمْ لِوَجْهِ ٱللَّهِ لَا نُرِيدُ مِنكُمْ جَزَآءً وَلَا شُكُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadవార (వారితో ఇలా అంటారు): "వాస్తవానికి మేము అల్లాహ్ ప్రసన్నత కొరకే మీకు ఆహారం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలం గానీ, లేదా కృతజ్ఞతలు గానీ ఆశించటం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము మా ప్రభువు నుండి వచ్చే ఉగ్రమైన, దుర్భరమైన, ఆ దినానికి భయపడుతున్నాము!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَوَقَىٰهُمُ ٱللَّهُ شَرَّ ذَٰلِكَ ٱلْيَوْمِ وَلَقَّىٰهُمْ نَضْرَةً وَسُرُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున అల్లాహ్ వారిని ఆ దినపు కీడు నుండి కాపాడాడు. మరియు వారికి ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదించాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَزَىٰهُم بِمَا صَبَرُوا۟ جَنَّةً وَحَرِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి సహనానికి[1] ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని మరియు పట్టు వస్త్రాలను ఇచ్చాడు[2].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُّتَّكِـِٔينَ فِيهَا عَلَى ٱلْأَرَآئِكِ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో, వారు ఎత్తైన పీఠాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. అందులో వారు ఎండ (బాధ) గానీ, చలి తీవ్రతను గానీ చూడరు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَدَانِيَةً عَلَيْهِمْ ظِلَٰلُهَا وَذُلِّلَتْ قُطُوفُهَا تَذْلِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అందులో వారిపై నీడలు పడుతుంటాయి[1]. దాని ఫలాల గుత్తులు వారికి అందుబాటులో ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيُطَافُ عَلَيْهِم بِـَٔانِيَةٍ مِّن فِضَّةٍ وَأَكْوَابٍ كَانَتْ قَوَارِيرَا۠

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి మధ్య వెండి పాత్రలు మరియు గాజుగ్లాసులు త్రిప్ప బడుతూ ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَوَارِيرَا۟ مِن فِضَّةٍ قَدَّرُوهَا تَقْدِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ గాజు గ్లాసులు స్ఫటికం వలే తెల్లవైన వెండితో చేయబడి ఉంటాయి. అవి నియమబద్ధాం నింపబడి ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيُسْقَوْنَ فِيهَا كَأْسًا كَانَ مِزَاجُهَا زَنجَبِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారికి సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగటానికి ఇవ్వబడతాయి[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَيْنًا فِيهَا تُسَمَّىٰ سَلْسَبِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది స్వర్గంలోని సల్ సబీల్ అనే పేరు గల ఒక ఊట!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَطُوفُ عَلَيْهِمْ وِلْدَٰنٌ مُّخَلَّدُونَ إِذَا رَأَيْتَهُمْ حَسِبْتَهُمْ لُؤْلُؤًا مَّنثُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి మద్య శాశ్వతంగా, యవ్వనులుగా ఉంటే బాలురు తిరుగుతూ ఉంటారు. మరియు నీవు వారిని చూస్తే, వారిని వెదజల్లిన ముత్యాలుగా భావిస్తావు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا رَأَيْتَ ثَمَّ رَأَيْتَ نَعِيمًا وَمُلْكًا كَبِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీవు అక్కడ (స్వర్గంలో) చూస్తే, ఎక్కడ చూసినా ఆనందమే పొందుతావు. మరియు ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَٰلِيَهُمْ ثِيَابُ سُندُسٍ خُضْرٌ وَإِسْتَبْرَقٌ وَحُلُّوٓا۟ أَسَاوِرَ مِن فِضَّةٍ وَسَقَىٰهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి ఒంటి మీద సన్నని ఆకుపచ్చని శ్రేష్ఠమైన పట్టు వస్త్రాలు మరియు బంగారు జలతారు అల్లిన దుస్తులుంటాయి. మరియు వారికి వెండి కంకణాలు తొడిగించబడతాయి. మరియు వారి ప్రభువు వారికి నిర్మలమైన పానీయాన్ని త్రాగటానికి ప్రసాదిస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ هَٰذَا كَانَ لَكُمْ جَزَآءً وَكَانَ سَعْيُكُم مَّشْكُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారితో ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, ఇది మీకు ఇవ్వబడే ప్రతిఫలం. ఎందుకంటే, మీ శ్రమ అంగీరించబడింది."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا نَحْنُ نَزَّلْنَا عَلَيْكَ ٱلْقُرْءَانَ تَنزِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేమే, ఈ ఖుర్ఆన్ ను, నీ పై (ఓ ముహమ్మద్!) క్రమక్రమంగా అవతరింపజేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تُطِعْ مِنْهُمْ ءَاثِمًا أَوْ كَفُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాట గాని వినకు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱذْكُرِ ٱسْمَ رَبِّكَ بُكْرَةً وَأَصِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీ ప్రభువు నామాన్ని ఉదయం మరియు సాయంత్రం స్మరిస్తూ ఉండు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنَ ٱلَّيْلِ فَٱسْجُدْ لَهُۥ وَسَبِّحْهُ لَيْلًا طَوِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉండు[1] మరియు రాత్రివేళ సుదీర్ఘ కాలం, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ هَٰٓؤُلَآءِ يُحِبُّونَ ٱلْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَآءَهُمْ يَوْمًا ثَقِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై వున్నారు. మరియు మున్ముందు రానున్న భారమైన దినాని విస్మరిస్తున్నారు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

نَّحْنُ خَلَقْنَٰهُمْ وَشَدَدْنَآ أَسْرَهُمْ وَإِذَا شِئْنَا بَدَّلْنَآ أَمْثَٰلَهُمْ تَبْدِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేమే వీరిని సృష్టించినవారము మరియు వీరి శరీరాన్ని దృఢ పరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ هَٰذِهِۦ تَذْكِرَةٌ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇదొక హితోపదేశం కావున ఇష్టపడినవాడు తన ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అల్లాహ్ కోరకపోతే, మీరు కోరేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُدْخِلُ مَن يَشَآءُ فِى رَحْمَتِهِۦ وَٱلظَّٰلِمِينَ أَعَدَّ لَهُمْ عَذَابًا أَلِيمًۢا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన తాను కోరినవారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70