caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ar-Rahmaan الرحمن

78 ఆయతులు · మదీనా · అవతరణ క్రమం 97

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱلرَّحْمَٰنُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅనంత కరుణామయుడు (అల్లాహ్)!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَلَّمَ ٱلْقُرْءَانَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే ఈ ఖుర్ఆన్ ను నేర్పాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خَلَقَ ٱلْإِنسَٰنَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే మానవుణ్ణి సృష్టించాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَلَّمَهُ ٱلْبَيَانَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلشَّمْسُ وَٱلْقَمَرُ بِحُسْبَانٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلنَّجْمُ وَٱلشَّجَرُ يَسْجُدَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلْمِيزَانَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَّا تَطْغَوْا۟ فِى ٱلْمِيزَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَقِيمُوا۟ ٱلْوَزْنَ بِٱلْقِسْطِ وَلَا تُخْسِرُوا۟ ٱلْمِيزَانَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِيهَا فَٰكِهَةٌ وَٱلنَّخْلُ ذَاتُ ٱلْأَكْمَامِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْحَبُّ ذُو ٱلْعَصْفِ وَٱلرَّيْحَانُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు దంట్లపై (పొరలలో చుట్టబడి)[1] ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خَلَقَ ٱلْإِنسَٰنَ مِن صَلْصَٰلٍ كَٱلْفَخَّارِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో[1] సృష్టించాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَخَلَقَ ٱلْجَآنَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبُّ ٱلْمَشْرِقَيْنِ وَرَبُّ ٱلْمَغْرِبَيْنِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَرَجَ ٱلْبَحْرَيْنِ يَلْتَقِيَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَخْرُجُ مِنْهُمَا ٱللُّؤْلُؤُ وَٱلْمَرْجَانُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَهُ ٱلْجَوَارِ ٱلْمُنشَـَٔاتُ فِى ٱلْبَحْرِ كَٱلْأَعْلَٰمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎత్తైన కొండల వలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو ٱلْجَلَٰلِ وَٱلْإِكْرَامِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు[1] మరియు పరమదాత[2] అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే![3]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَسْـَٔلُهُۥ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ كُلَّ يَوْمٍ هُوَ فِى شَأْنٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadభూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ ٱلثَّقَلَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadభారాలను మోసే మీరిద్దరు![1] త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰمَعْشَرَ ٱلْجِنِّ وَٱلْإِنسِ إِنِ ٱسْتَطَعْتُمْ أَن تَنفُذُوا۟ مِنْ أَقْطَارِ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ فَٱنفُذُوا۟ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَٰنٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ[1] పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَٱلدِّهَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَيَوْمَئِذٍ لَّا يُسْـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٌ وَلَا جَآنٌّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُعْرَفُ ٱلْمُجْرِمُونَ بِسِيمَٰهُمْ فَيُؤْخَذُ بِٱلنَّوَٰصِى وَٱلْأَقْدَامِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِى يُكَذِّبُ بِهَا ٱلْمُجْرِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ ءَانٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవడైతే తన ప్రభువు సన్నధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذَوَاتَآ أَفْنَانٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِيهِمَا مِن كُلِّ فَٰكِهَةٍ زَوْجَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشٍۭ بَطَآئِنُهَا مِنْ إِسْتَبْرَقٍ وَجَنَى ٱلْجَنَّتَيْنِ دَانٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు జరీ పని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِيهِنَّ قَٰصِرَٰتُ ٱلطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందులో తమ దృష్టి ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَأَنَّهُنَّ ٱلْيَاقُوتُ وَٱلْمَرْجَانُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَلْ جَزَآءُ ٱلْإِحْسَٰنِ إِلَّا ٱلْإِحْسَٰنُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِن دُونِهِمَا جَنَّتَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలుంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُدْهَآمَّتَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅవి దట్టంగా ముదరు పచ్చగా ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలుంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِيهِمَا فَٰكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِيهِنَّ خَيْرَٰتٌ حِسَانٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాటిలో గుణవంతులు, సౌందర్యవతులైన స్త్రీలు ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

حُورٌ مَّقْصُورَٰتٌ فِى ٱلْخِيَامِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిర్మలమైన, శీలవంతులైన స్త్రీలు (హూర్) డేరాలలో ఉంటారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ స్త్రీలను ఇంతకు ముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُتَّكِـِٔينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِىٍّ حِسَانٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَبَٰرَكَ ٱسْمُ رَبِّكَ ذِى ٱلْجَلَٰلِ وَٱلْإِكْرَامِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమహిమాన్వితుడు మరియు పరమ దాత[1] అయిన నీ ప్రభువు పేరే సర్వశ్రేష్ఠమైనది.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70