caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ash-Shu'araa الشعراء

227 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 47

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ طسٓمٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతా - సీన్ - మీమ్[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تِلْكَ ءَايَٰتُ ٱلْكِتَٰبِ ٱلْمُبِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు)

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَعَلَّكَ بَٰخِعٌ نَّفْسَكَ أَلَّا يَكُونُوا۟ مُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةً فَظَلَّتْ أَعْنَٰقُهُمْ لَهَا خَٰضِعِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّنَ ٱلرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا۟ عَنْهُ مُعْرِضِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَقَدْ كَذَّبُوا۟ فَسَيَأْتِيهِمْ أَنۢبَٰٓؤُا۟ مَا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلْأَرْضِ كَمْ أَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని)[1] పుట్టించామో?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰٓ أَنِ ٱئْتِ ٱلْقَوْمَ ٱلظَّٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَوْمَ فِرْعَوْنَ أَلَا يَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ رَبِّ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَضِيقُ صَدْرِى وَلَا يَنطَلِقُ لِسَانِى فَأَرْسِلْ إِلَىٰ هَٰرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది[1], కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَهُمْ عَلَىَّ ذَنۢبٌ فَأَخَافُ أَن يَقْتُلُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది[1], కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ كَلَّا فَٱذْهَبَا بِـَٔايَٰتِنَآ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَآ إِنَّا رَسُولُ رَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: "నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَنْ أَرْسِلْ مَعَنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు[1]."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَفَعَلْتَ فَعْلَتَكَ ٱلَّتِى فَعَلْتَ وَأَنتَ مِنَ ٱلْكَٰفِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ فَعَلْتُهَآ إِذًا وَأَنَا۠ مِنَ ٱلضَّآلِّينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మూసా) అన్నాడు: "నేను పొరపాటుగా ఆ పని చేశాను!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِى رَبِّى حُكْمًا وَجَعَلَنِى مِنَ ٱلْمُرْسَلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَىَّ أَنْ عَبَّدتَّ بَنِىٓ إِسْرَٰٓءِيلَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ إِن كُنتُم مُّوقِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మూసా) జవాబిచ్చాడు: "మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ لِمَنْ حَوْلَهُۥٓ أَلَا تَسْتَمِعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?"[1] అని ప్రశ్నించాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ إِنَّ رَسُولَكُمُ ٱلَّذِىٓ أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఔన్) అన్నాడు: "మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ رَبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ وَمَا بَيْنَهُمَآ إِن كُنتُمْ تَعْقِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు[1]."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ لَئِنِ ٱتَّخَذْتَ إِلَٰهًا غَيْرِى لَأَجْعَلَنَّكَ مِنَ ٱلْمَسْجُونِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَىْءٍ مُّبِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా?"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ فَأْتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِىَ ثُعْبَانٌ مُّبِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِىَ بَيْضَآءُ لِلنَّٰظِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ لِلْمَلَإِ حَوْلَهُۥٓ إِنَّ هَٰذَا لَسَٰحِرٌ عَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِۦ فَمَاذَا تَأْمُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوٓا۟ أَرْجِهْ وَأَخَاهُ وَٱبْعَثْ فِى ٱلْمَدَآئِنِ حَٰشِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَجُمِعَ ٱلسَّحَرَةُ لِمِيقَٰتِ يَوْمٍ مَّعْلُومٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: "ఏమీ? మీరంతా సమావేశమయ్యారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَعَلَّنَا نَتَّبِعُ ٱلسَّحَرَةَ إِن كَانُوا۟ هُمُ ٱلْغَٰلِبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالُوا۟ لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ ٱلْغَٰلِبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా?"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَّمِنَ ٱلْمُقَرَّبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఔన్) అన్నాడు: "అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ لَهُم مُّوسَىٰٓ أَلْقُوا۟ مَآ أَنتُم مُّلْقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమూసా వారితో అన్నాడు: "మీరు విసర దలుచుకున్న దానిని విసరండి!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَلْقَوْا۟ حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا۟ بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ ٱلْغَٰلِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము[1]."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِىَ تَلْقَفُ مَا يَأْفِكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأُلْقِىَ ٱلسَّحَرَةُ سَٰجِدِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوٓا۟ ءَامَنَّا بِرَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము,

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبِّ مُوسَىٰ وَهَٰرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమూసా మరియు హారూన్ ల ప్రభువును."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ ءَامَنتُمْ لَهُۥ قَبْلَ أَنْ ءَاذَنَ لَكُمْ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِى عَلَّمَكُمُ ٱلسِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَٰفٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా?[1] నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను[2]."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ لَا ضَيْرَ إِنَّآ إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మాంత్రికులు) అన్నారు: "బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَٰيَٰنَآ أَن كُنَّآ أَوَّلَ ٱلْمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنْ أَسْرِ بِعِبَادِىٓ إِنَّكُم مُّتَّبَعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు[1]."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَرْسَلَ فِرْعَوْنُ فِى ٱلْمَدَآئِنِ حَٰشِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ هَٰٓؤُلَآءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇలా ప్రకటన చేయించాడు): "వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّهُمْ لَنَا لَغَآئِظُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّا لَجَمِيعٌ حَٰذِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَخْرَجْنَٰهُم مِّن جَنَّٰتٍ وَعُيُونٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَٰلِكَ وَأَوْرَثْنَٰهَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَمَّا تَرَٰٓءَا ٱلْجَمْعَانِ قَالَ أَصْحَٰبُ مُوسَىٰٓ إِنَّا لَمُدْرَكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: "నిశ్చయంగా మేము చిక్కి పోయాము!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ كَلَّآ إِنَّ مَعِىَ رَبِّى سَيَهْدِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)[1]."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضْرِب بِّعَصَاكَ ٱلْبَحْرَ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَٱلطَّوْدِ ٱلْعَظِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَزْلَفْنَا ثَمَّ ٱلْـَٔاخَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُۥٓ أَجْمَعِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَٰهِيمَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا تَعْبُدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَٰكِفِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ بَلْ وَجَدْنَآ ءَابَآءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ أَفَرَءَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَنتُمْ وَءَابَآؤُكُمُ ٱلْأَقْدَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِنَّهُمْ عَدُوٌّ لِّىٓ إِلَّا رَبَّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى خَلَقَنِى فَهُوَ يَهْدِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِى هُوَ يُطْعِمُنِى وَيَسْقِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِى يُمِيتُنِى ثُمَّ يُحْيِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِىٓ أَطْمَعُ أَن يَغْفِرَ لِى خَطِيٓـَٔتِى يَوْمَ ٱلدِّينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبِّ هَبْ لِى حُكْمًا وَأَلْحِقْنِى بِٱلصَّٰلِحِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱجْعَل لِّى لِسَانَ صِدْقٍ فِى ٱلْـَٔاخِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱجْعَلْنِى مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱغْفِرْ لِأَبِىٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تُخْزِنِى يَوْمَ يُبْعَثُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا مَنْ أَتَى ٱللَّهَ بِقَلْبٍ سَلِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِلْغَاوِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مِن دُونِ ٱللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكُبْكِبُوا۟ فِيهَا هُمْ وَٱلْغَاوُۥنَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు:

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَٱللَّهِ إِن كُنَّا لَفِى ضَلَٰلٍ مُّبِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ نُسَوِّيكُم بِرَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلْمُجْرِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَا لَنَا مِن شَٰفِعِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا صَدِيقٍ حَمِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ قَوْمُ نُوحٍ ٱلْمُرْسَلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوٓا۟ أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన[1] వారే కదా అనుసరిస్తున్నది?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ وَمَا عِلْمِى بِمَا كَانُوا۟ يَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(నూహ్) అన్నాడు: "వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّى لَوْ تَشْعُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌ مُّبِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు[1]."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَنجَيْنَٰهُ وَمَن مَّعَهُۥ فِى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَغْرَقْنَا بَعْدُ ٱلْبَاقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ عَادٌ ٱلْمُرْسَلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి సహోదరుడు[1] హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةً تَعْبَثُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱتَّقُوا۟ ٱلَّذِىٓ أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمَدَّكُم بِأَنْعَٰمٍ وَبَنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَنَّٰتٍ وَعُيُونٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తోటలను మరియు చెలమలను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ سَوَآءٌ عَلَيْنَآ أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ ٱلْوَٰعِظِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ هَٰذَآ إِلَّا خُلُقُ ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكَذَّبُوهُ فَأَهْلَكْنَٰهُمْ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము[1]. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ ثَمُودُ ٱلْمُرْسَلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَٰلِحٌ أَلَا تَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَتُتْرَكُونَ فِى مَا هَٰهُنَآ ءَامِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِى جَنَّٰتٍ وَعُيُونٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతోటలలో మరియు చెలమలలో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًا فَٰرِهِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تُطِيعُوٓا۟ أَمْرَ ٱلْمُسْرِفِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِينَ يُفْسِدُونَ فِى ٱلْأَرْضِ وَلَا يُصْلِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَآ أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِـَٔايَةٍ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ هَٰذِهِۦ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُومٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَعَقَرُوهَا فَأَصْبَحُوا۟ نَٰدِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَخَذَهُمُ ٱلْعَذَابُ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَتْ قَوْمُ لُوطٍ ٱلْمُرْسَلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَتَأْتُونَ ٱلذُّكْرَانَ مِنَ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَٰجِكُم بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَٰلُوطُ لَتَكُونَنَّ مِنَ ٱلْمُخْرَجِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(దానికి) వారన్నారు: "ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ إِنِّى لِعَمَلِكُم مِّنَ ٱلْقَالِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(లూత్) అన్నాడు: "నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبِّ نَجِّنِى وَأَهْلِى مِمَّا يَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَنَجَّيْنَٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا عَجُوزًا فِى ٱلْغَٰبِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا فَسَآءَ مَطَرُ ٱلْمُنذَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَّبَ أَصْحَٰبُ لْـَٔيْكَةِ ٱلْمُرْسَلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadషుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوْفُوا۟ ٱلْكَيْلَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُخْسِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَزِنُوا۟ بِٱلْقِسْطَاسِ ٱلْمُسْتَقِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadత్రాసుతో సరిసమానంగా తూచండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱتَّقُوا۟ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلْجِبِلَّةَ ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి[1]."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ ٱلْكَٰذِبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ ٱلسَّمَآءِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ رَبِّىٓ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ ٱلظُّلَّةِ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّهُۥ لَتَنزِيلُ رَبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

نَزَلَ بِهِ ٱلرُّوحُ ٱلْأَمِينُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు[1];

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ ٱلْمُنذِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بِلِسَانٍ عَرَبِىٍّ مُّبِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadస్పష్టమైన అరబ్బీ భాషలో[1]!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّهُۥ لَفِى زُبُرِ ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوَلَمْ يَكُن لَّهُمْ ءَايَةً أَن يَعْلَمَهُۥ عُلَمَٰٓؤُا۟ بَنِىٓ إِسْرَٰٓءِيلَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు[1] ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوْ نَزَّلْنَٰهُ عَلَىٰ بَعْضِ ٱلْأَعْجَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَقَرَأَهُۥ عَلَيْهِم مَّا كَانُوا۟ بِهِۦ مُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَٰلِكَ سَلَكْنَٰهُ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا يُؤْمِنُونَ بِهِۦ حَتَّىٰ يَرَوُا۟ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَيَقُولُوا۟ هَلْ نَحْنُ مُنظَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَرَءَيْتَ إِن مَّتَّعْنَٰهُمْ سِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ جَآءَهُم مَّا كَانُوا۟ يُوعَدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يُمَتَّعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذِكْرَىٰ وَمَا كُنَّا ظَٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadహితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا تَنَزَّلَتْ بِهِ ٱلشَّيَٰطِينُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا يَنۢبَغِى لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُمْ عَنِ ٱلسَّمْعِ لَمَعْزُولُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَا تَدْعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَتَكُونَ مِنَ ٱلْمُعَذَّبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنذِرْ عَشِيرَتَكَ ٱلْأَقْرَبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱخْفِضْ جَنَاحَكَ لِمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవిశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّى بَرِىٓءٌ مِّمَّا تَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: "మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَوَكَّلْ عَلَى ٱلْعَزِيزِ ٱلرَّحِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى يَرَىٰكَ حِينَ تَقُومُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَتَقَلُّبَكَ فِى ٱلسَّٰجِدِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ ٱلشَّيَٰطِينُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadషైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُلْقُونَ ٱلسَّمْعَ وَأَكْثَرُهُمْ كَٰذِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadగాలి వార్తలను చెవులలో ఊదుతారు[1]; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلْغَاوُۥنَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ تَرَ أَنَّهُمْ فِى كُلِّ وَادٍ يَهِيمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని[1];

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ وَذَكَرُوا۟ ٱللَّهَ كَثِيرًا وَٱنتَصَرُوا۟ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ وَسَيَعْلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَىَّ مُنقَلَبٍ يَنقَلِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప![1] అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70