సూరా An-Naazi'aat النازعات
46 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 81
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلنَّٰزِعَٰتِ غَرْقًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلنَّٰشِطَٰتِ نَشْطًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلسَّٰبِحَٰتِ سَبْحًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلسَّٰبِقَٰتِ سَبْقًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱلْمُدَبِّرَٰتِ أَمْرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ تَرْجُفُ ٱلرَّاجِفَةُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
تَتْبَعُهَا ٱلرَّادِفَةُ
Telugu Translation - Abdurrahim ibn Muhammadదాని తర్వాత రెండవ సారి[1] బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు (కొన్ని) హృదయాలు (భయంతో) దడదడలాడుతూ ఉంటాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَبْصَٰرُهَا خَٰشِعَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَقُولُونَ أَءِنَّا لَمَرْدُودُونَ فِى ٱلْحَافِرَةِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు ఇలా అంటున్నారు: "ఏమీ? మనం మన పూర్వ స్థితిలోకి మళ్ళీ తీసుకు రాబడతామా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَءِذَا كُنَّا عِظَٰمًا نَّخِرَةً
Telugu Translation - Abdurrahim ibn Muhammadమనం శిథిలమైన ఎముకలుగా మారి పోయిన తరువాత కూడానా?"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَالُوا۟ تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు (ఇంకా ఇలా) అంటారు: "అయితే ఈ తిరిగి రావటమనేది చాల నష్టదాయకమైనదే!"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అది వాస్తవానికి, ఒకే ఒక (తీవ్రమైన) ధ్వని.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు వారందరూ, ఒకేసారి లేచి మైదానంలోకి వచ్చి ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
هَلْ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? నీకు మూసా వృత్తాంతం అందిందా[1]?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذْ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلْوَادِ ٱلْمُقَدَّسِ طُوًى
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇలా అన్నాడు): "ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, నిశ్చయంగా, అతడు ధిక్కారుడయ్యాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَقُلْ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammad"ఇక (అతనితో) ఇట్లను: 'ఏమీ? నీవు పాపరహితుడవు అవటానికి ఇష్టపడతావా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నేను నీకు నీ ప్రభువు వైపునకు మార్గదర్శకత్వం చేస్తాను, మరి నీవు ఆయన పట్ల భీతి కలిగి ఉంటావా?'"
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَرَىٰهُ ٱلْـَٔايَةَ ٱلْكُبْرَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత అతను (మూసా) అతడికి (ఫిర్ఔన్ కు) గొప్ప అద్భుత నిదర్శనాన్ని చూపాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَكَذَّبَ وَعَصَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అతడు (ఫిర్ఔన్) దానిని అబద్ధమని తిరస్కరించాడు మరియు (అతని మాటను) ఉల్లంఘించాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తర్వాత అతడు (ఫిర్ఔన్) వెనక్కి మరలి పోయి, (కుట్రలు) పన్నసాగాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَحَشَرَ فَنَادَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadపిదప (ప్రజలను) సమావేశపరచి, ఎలుగెత్తి చాటుతూ;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلْأَعْلَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును!"[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلْـَٔاخِرَةِ وَٱلْأُولَىٰٓ
Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున అల్లాహ్ అతనిని ఇహపరలోకాల శిక్షకు గురి చేశాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَىٰٓ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇందులో (అల్లాహ్ కు) భయపడే ప్రతి వ్యక్తి కొరకు గుణపాఠముంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ءَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ ٱلسَّمَآءُ بَنَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మిమ్మల్ని సృష్టించడం కఠినమయిన పనా? లేక ఆకాశాన్నా? ఆయనే కదా దానిని నిర్మించింది![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
رَفَعَ سَمْكَهَا فَسَوَّىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన దాని కప్పు (ఎత్తు)ను చాలా పైకి లేపాడు. తరువాత దానిని క్రమపరిచాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు దాని పగటిని (వెలుగును) బహిర్గతం చేశాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَىٰهَآ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ పిదప భూమిని పరచినట్లు చేశాడు[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammadదాని నుండి దాని నీళ్ళను మరియు దాని పచ్చికను బయటికి తీశాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْجِبَالَ أَرْسَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పర్వతాలను (దానిలో) స్థిరంగా నాటాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مَتَٰعًا لَّكُمْ وَلِأَنْعَٰمِكُمْ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా[1]!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلْكُبْرَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఆ గొప్ప దుర్ఘటన (పునరుత్థాన దినం) వచ్చినప్పుడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ يَتَذَكَّرُ ٱلْإِنسَٰنُ مَا سَعَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు మానవుడు తాను చేసిందంతా జ్ఞాపకం చేసుకుంటాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِمَن يَرَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు చూసే వారి యెదుటకు, నరకాగ్ని స్పష్టంగా కనబడేటట్లు తేబడుతుంది. [1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَمَّا مَن طَغَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ధిక్కారంతో హద్దులు మీరి ప్రవర్తించిన వాడికి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَءَاثَرَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిచ్చిన వాడికి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِنَّ ٱلْجَحِيمَ هِىَ ٱلْمَأْوَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నరకాగ్నియే, వాని నివాస స్థానమవుతుంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفْسَ عَنِ ٱلْهَوَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తన ప్రభువు ముందు నిలబడ వలసి వుంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَإِنَّ ٱلْجَنَّةَ هِىَ ٱلْمَأْوَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, స్వర్గమే, అతని నివాస స్థానమవుతుంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَسْـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرْسَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) వీరు నిన్ను - ఆ ఘడియను గురించి: "అసలు అది ఎప్పుడొస్తుంది?" అని అడుగుతున్నారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِيمَ أَنتَ مِن ذِكْرَىٰهَآ
Telugu Translation - Abdurrahim ibn Muhammadదాని గురించి చెప్పడానికి దాంతో నీకేమి సంబంధం?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ
Telugu Translation - Abdurrahim ibn Muhammadదాని వాస్తవ జ్ఞానం నీ ప్రభువుకే ఉంది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخْشَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు, దానికి భయపడే వారిని హెచ్చరించే వాడవు మాత్రమే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوٓا۟ إِلَّا عَشِيَّةً أَوْ ضُحَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→