caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Inshiqaaq الإنشقاق

25 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 83

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆకాశం బ్రద్దలయి పోయినప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَٰقِيهِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు తన కర్మపత్రం కుడిచేతిలో ఇవ్వబడినవాడి నుండి;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని లెక్క అతి తేలికగా తీసుకోబడగలదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతడు సంతోషంగా తన వారి దగ్గరకు మరలిపోతాడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక తన కర్మపత్రం వీపు వెనుక నుండి ఇవ్వబడినవాడు;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడతడు తన నాశనాన్నే - కోరుకుంటాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَصْلَىٰ سَعِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతడు మండుతున్న నరకాగ్నిలో పడిపోతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, అతడు (ప్రపంచంలో) తన వారి మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, అతడు (మా వైపుకు) మరలిరాడని భావించేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! వాస్తవానికి, అతని ప్రభువు అతనిని గమనిస్తూ ఉండేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّيْلِ وَمَا وَسَقَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadరాత్రి సాక్షిగా, అది ప్రోగు చేసేవాటి సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadపూర్ణచంద్రుని సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరందరూ తప్పనిసరిగా ఒక స్థితి నుండి మరొక స్థితికి క్రమక్రమంగా మారుతూ పోవలసి ఉంటుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయితే వీరి కేమయింది? వీరు ఎందుకు విశ్వసించరు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఖుర్ఆన్ వీరి ముందు పఠింపబడినప్పుడు వీరెందుకు సాష్టాంగం (సజ్దా) చేయరు?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! ఈ సత్యతిరస్కారులు దీనిని అసత్యమంటున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు కూడబెట్టేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాబట్టి వారికి (పరలోకంలో) లభించే వ్యధాభరితమైన శిక్ష యొక్క వార్తనివ్వు -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవిశ్వసించి సత్కార్యాలు చేసే వారికి తప్ప - వారికి ఎన్నటికీ అంతం గాని ప్రతిఫలం ఉంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70