caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Abasa عبس

42 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 24

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ عَبَسَ وَتَوَلَّىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَن جَآءَهُ ٱلْأَعْمَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا يُدْرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكْرَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمَّا مَنِ ٱسْتَغْنَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا مَن جَآءَكَ يَسْعَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهُوَ يَخْشَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّآ إِنَّهَا تَذْكِرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَن شَآءَ ذَكَرَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِى صُحُفٍ مُّكَرَّمَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది);

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍۭ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమహోన్నతమైనది, పవిత్రమైనది;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بِأَيْدِى سَفَرَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేఖకుల (దేవదూతల) చేతులలో;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كِرَامٍۭ بَرَرَةٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُتِلَ ٱلْإِنسَٰنُ مَآ أَكْفَرَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مِنْ أَىِّ شَىْءٍ خَلَقَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مِن نُّطْفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَمَاتَهُۥ فَأَقْبَرَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَلَّا لَمَّا يَقْضِ مَآ أَمَرَهُۥ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلْيَنظُرِ ٱلْإِنسَٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَنَّا صَبَبْنَا ٱلْمَآءَ صَبًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ شَقَقْنَا ٱلْأَرْضَ شَقًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَنۢبَتْنَا فِيهَا حَبًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَعِنَبًا وَقَضْبًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ద్రాక్షలను మరియు కూరగాయలను;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَزَيْتُونًا وَنَخْلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَحَدَآئِقَ غُلْبًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు దట్టమైన తోటలను;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَفَٰكِهَةً وَأَبًّا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَّتَٰعًا لَّكُمْ وَلِأَنْعَٰمِكُمْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ يَفِرُّ ٱلْمَرْءُ مِنْ أَخِيهِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأُمِّهِۦ وَأَبِيهِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَصَٰحِبَتِهِۦ وَبَنِيهِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لِكُلِّ ٱمْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَرْهَقُهَا قَتَرَةٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅవి నల్లగా మాడిపోయి ఉంటాయి;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70