హోమ్ › సూరాలు › సూరా Ash-Shams
సూరా Ash-Shams الشمس
15 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 26
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلشَّمْسِ وَضُحَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad సూర్యుని మరియు దాని ఎండ సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْقَمَرِ إِذَا تَلَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాని వెనుక వచ్చే చంద్రుని సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad ప్రకాశించే పగటి సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلْأَرْضِ وَمَا طَحَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَفْسٍ وَمَا سَوَّىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَىٰهَآ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذِ ٱنۢبَعَثَ أَشْقَىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad తమలోని పరమ దుష్టుడు (ఆ దుష్కార్యం చేయటానికి) లేచినప్పుడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَقَالَ لَهُمْ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقْيَٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad అల్లాహ్ సందేశహరుడు (సాలిహ్) వారితో: "ఈ ఆడ ఒంటె అల్లాహ్ కు చెందింది. కాబట్టి దీనిని (నీళ్ళు) త్రాగనివ్వండి!" అని అన్నాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad అయినా వారు అతని (సాలిహ్) మాటను అబద్ధమని తిరస్కరించారు. మరియు దాని (ఆ ఒంటె) వెనక మోకాలి నరాన్ని కోసి, కుంటిదాన్ని చేసి చంపారు.[1] కాబట్టి వారి ప్రభువు వారి పాపానికి పర్యవసానంగా వారి మీద మహా విపత్తును పంపి వారందరినీ నాశనం చేశాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَا يَخَافُ عُقْبَٰهَا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Al-Balad
సూరా Al-Lail →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.