హోమ్ › సూరాలు › సూరా Al-Ma'aarij
సూరా Al-Ma'aarij المعارج
44 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 79
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ سَأَلَ سَآئِلٌۢ بِعَذَابٍ وَاقِعٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ప్రశ్నించేవాడు[1], ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِّلْكَٰفِرِينَ لَيْسَ لَهُۥ دَافِعٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مِّنَ ٱللَّهِ ذِى ٱلْمَعَارِجِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
تَعْرُجُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيْهِ فِى يَوْمٍ كَانَ مِقْدَارُهُۥ خَمْسِينَ أَلْفَ سَنَةٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో[1], దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[2] ఆయన వద్దకు అధిరోహిస్తారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَٱصْبِرْ صَبْرًا جَمِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُمْ يَرَوْنَهُۥ بَعِيدًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَرَىٰهُ قَرِيبًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని మాకది అతి దగ్గరలో కనిపిస్తోంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلْمُهْلِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనే వలే) అయి పోతుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు కొండలు ఏకిన ఉన్ని వలె అయి పోతాయి[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَا يَسْـَٔلُ حَمِيمٌ حَمِيمًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يُبَصَّرُونَهُمْ يَوَدُّ ٱلْمُجْرِمُ لَوْ يَفْتَدِى مِنْ عَذَابِ يَوْمِئِذٍۭ بِبَنِيهِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَصَٰحِبَتِهِۦ وَأَخِيهِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తన సహవాసిని మరియు తన సోదరుణ్ణి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفَصِيلَتِهِ ٱلَّتِى تُـْٔوِيهِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَن فِى ٱلْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّآ إِنَّهَا لَظَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
نَزَّاعَةً لِّلشَّوَىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
تَدْعُوا۟ مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَجَمَعَ فَأَوْعَىٰٓ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ ٱلْإِنسَٰنَ خُلِقَ هَلُوعًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذَا مَسَّهُ ٱلشَّرُّ جَزُوعًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِذَا مَسَّهُ ٱلْخَيْرُ مَنُوعًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తనకు మేలు కలిగినపుడు స్వార్థపరునిగా ప్రవర్తిస్తాడు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا ٱلْمُصَلِّينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నమాజ్ ను ఖచ్ఛితంగా పాఠించేవారు తప్ప!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَآئِمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎవరైతే తమ నమాజ్ ను సదా నియమంతో పాటిస్తారో;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّذِينَ فِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّ مَّعْلُومٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ ٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అలాంటి వారికి, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَٰفِظُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప[1] - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటివారే మితిమీరి పోయేవారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّذِينَ هُمْ لِأَمَٰنَٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّذِينَ هُم بِشَهَٰدَٰتِهِمْ قَآئِمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أُو۟لَٰٓئِكَ فِى جَنَّٰتٍ مُّكْرَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَالِ ٱلَّذِينَ كَفَرُوا۟ قِبَلَكَ مُهْطِعِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ عِزِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَيَطْمَعُ كُلُّ ٱمْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَلَّآ إِنَّا خَلَقْنَٰهُم مِّمَّا يَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلَآ أُقْسِمُ بِرَبِّ ٱلْمَشَٰرِقِ وَٱلْمَغَٰرِبِ إِنَّا لَقَٰدِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథం చేసి చెబుతున్నాను[1]. నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَلَىٰٓ أَن نُّبَدِّلَ خَيْرًا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారికి బదులుగా వారి కంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించి పోయేవారు ఎవ్వరూ లేరు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَذَرْهُمْ يَخُوضُوا۟ وَيَلْعَبُوا۟ حَتَّىٰ يُلَٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى يُوعَدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున వారిని - వారితో వాగ్దానం చేయబడిన ఆ దినానికి చేరే వరకు - వ్యర్థపు మాటలలో మరియు విలాస వినోదాల్లో విడిచిపెట్టు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَوْمَ يَخْرُجُونَ مِنَ ٱلْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ రోజు వారు తమ సమాధుల నుండి లేచి, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి తొందర పడుతూ వేగంగా బయటికి వస్తారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
خَٰشِعَةً أَبْصَٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلَّذِى كَانُوا۟ يُوعَدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Al-Haaqqa
సూరా Nooh →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.