caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-A'laa الأعلى

19 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 8

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى خَلَقَ فَسَوَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِى قَدَّرَ فَهَدَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు[1], మరియు మార్గం చూపాడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِىٓ أَخْرَجَ ٱلْمَرْعَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَجَعَلَهُۥ غُثَآءً أَحْوَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا مَا شَآءَ ٱللَّهُ إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ وَمَا يَخْفَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ కోరింది తప్ప[1]! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَذَكِّرْ إِن نَّفَعَتِ ٱلذِّكْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَتَجَنَّبُهَا ٱلْأَشْقَى

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِى يَصْلَى ٱلنَّارَ ٱلْكُبْرَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَذَكَرَ ٱسْمَ رَبِّهِۦ فَصَلَّىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلْ تُؤْثِرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْـَٔاخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ هَٰذَا لَفِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

صُحُفِ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70