caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా At-Takwir التكوير

29 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 7

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا ٱلشَّمْسُ كُوِّرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْجِبَالُ سُيِّرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు పర్వతాలు కదిలించబడినప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْعِشَارُ عُطِّلَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْوُحُوشُ حُشِرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْبِحَارُ سُجِّرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْمَوْءُۥدَةُ سُئِلَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు:

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بِأَىِّ ذَنۢبٍ قُتِلَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْجَحِيمُ سُعِّرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నరకాగ్ని మండించబడినప్పుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا ٱلْجَنَّةُ أُزْلِفَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَلِمَتْ نَفْسٌ مَّآ أَحْضَرَتْ

Telugu Translation - Abdurrahim ibn Muhammadప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَآ أُقْسِمُ بِٱلْخُنَّسِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلْجَوَارِ ٱلْكُنَّسِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّيْلِ إِذَا عَسْعَسَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు గడచి పోయే రాత్రి సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلصُّبْحِ إِذَا تَنَفَّسَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذِى قُوَّةٍ عِندَ ذِى ٱلْعَرْشِ مَكِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్)[1] అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُّطَاعٍ ثَمَّ أَمِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ رَءَاهُ بِٱلْأُفُقِ ٱلْمُبِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا هُوَ عَلَى ٱلْغَيْبِ بِضَنِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا هُوَ بِقَوْلِ شَيْطَٰنٍ رَّجِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَيْنَ تَذْهَبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరి మీరు ఎటు పోతున్నారు?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لِمَن شَآءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70