caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ad-Dukhaan الدخان

59 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 64

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ حمٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadహా - మీమ్[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadస్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةٍ مُّبَٰرَكَةٍ إِنَّا كُنَّا مُنذِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము.[1] నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. [2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْرًا مِّنْ عِندِنَآ إِنَّا كُنَّا مُرْسِلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَحْمَةً مِّن رَّبِّكَ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ إِن كُنتُم مُّوقِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadభూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلْ هُمْ فِى شَكٍّ يَلْعَبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱرْتَقِبْ يَوْمَ تَأْتِى ٱلسَّمَآءُ بِدُخَانٍ مُّبِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَغْشَى ٱلنَّاسَ هَٰذَا عَذَابٌ أَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَّبَّنَا ٱكْشِفْ عَنَّا ٱلْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసుల మవుతాము."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَنَّىٰ لَهُمُ ٱلذِّكْرَىٰ وَقَدْ جَآءَهُمْ رَسُولٌ مُّبِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ تَوَلَّوْا۟ عَنْهُ وَقَالُوا۟ مُعَلَّمٌ مَّجْنُونٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!" [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّا كَاشِفُوا۟ ٱلْعَذَابِ قَلِيلًا إِنَّكُمْ عَآئِدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ نَبْطِشُ ٱلْبَطْشَةَ ٱلْكُبْرَىٰٓ إِنَّا مُنتَقِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా, ప్రతీకారం చేస్తాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُولٌ كَرِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَنْ أَدُّوٓا۟ إِلَىَّ عِبَادَ ٱللَّهِ إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించు.[1] నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَن لَّا تَعْلُوا۟ عَلَى ٱللَّهِ إِنِّىٓ ءَاتِيكُم بِسُلْطَٰنٍ مُّبِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنِّى عُذْتُ بِرَبِّى وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِن لَّمْ تُؤْمِنُوا۟ لِى فَٱعْتَزِلُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَدَعَا رَبَّهُۥٓ أَنَّ هَٰٓؤُلَآءِ قَوْمٌ مُّجْرِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَسْرِ بِعِبَادِى لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱتْرُكِ ٱلْبَحْرَ رَهْوًا إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో.[1] నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَمْ تَرَكُوا۟ مِن جَنَّٰتٍ وَعُيُونٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَنَعْمَةٍ كَانُوا۟ فِيهَا فَٰكِهِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَٰلِكَ وَأَوْرَثْنَٰهَا قَوْمًا ءَاخَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَا بَكَتْ عَلَيْهِمُ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ وَمَا كَانُوا۟ مُنظَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ نَجَّيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ مِنَ ٱلْعَذَابِ ٱلْمُهِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مِن فِرْعَوْنَ إِنَّهُۥ كَانَ عَالِيًا مِّنَ ٱلْمُسْرِفِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఫిర్ఔన్ నుండి నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారి, అగ్రగణ్యుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدِ ٱخْتَرْنَٰهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము. [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَءَاتَيْنَٰهُم مِّنَ ٱلْـَٔايَٰتِ مَا فِيهِ بَلَٰٓؤٌا۟ مُّبِينٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ هَٰٓؤُلَآءِ لَيَقُولُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు:

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ هِىَ إِلَّا مَوْتَتُنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَٰدِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి!" [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ أَهْلَكْنَٰهُمْ إِنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు[1] మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَٰعِبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا خَلَقْنَٰهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ يَوْمَ ٱلْفَصْلِ مِيقَٰتُهُمْ أَجْمَعِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ لَا يُغْنِى مَوْلًى عَن مَّوْلًى شَيْـًٔا وَلَا هُمْ يُنصَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا مَن رَّحِمَ ٱللَّهُ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ شَجَرَتَ ٱلزَّقُّومِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షఫలం;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

طَعَامُ ٱلْأَثِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadపాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَٱلْمُهْلِ يَغْلِى فِى ٱلْبُطُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరిగే నూనే (సీసం) వలే,[1] అది వారి కడుపులో మరుగుతుంది;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَغَلْىِ ٱلْحَمِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసలసల కాగే నీటిలాగా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خُذُوهُ فَٱعْتِلُوهُ إِلَىٰ سَوَآءِ ٱلْجَحِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ صُبُّوا۟ فَوْقَ رَأْسِهِۦ مِنْ عَذَابِ ٱلْحَمِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذُقْ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْكَرِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِۦ تَمْتَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلْمُتَّقِينَ فِى مَقَامٍ أَمِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِى جَنَّٰتٍ وَعُيُونٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَٰبِلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَٰلِكَ وَزَوَّجْنَٰهُم بِحُورٍ عِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَدْعُونَ فِيهَا بِكُلِّ فَٰكِهَةٍ ءَامِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు. [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا يَذُوقُونَ فِيهَا ٱلْمَوْتَ إِلَّا ٱلْمَوْتَةَ ٱلْأُولَىٰ وَوَقَىٰهُمْ عَذَابَ ٱلْجَحِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారక్కడ మరణాన్ని[1] ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَضْلًا مِّن رَّبِّكَ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِنَّمَا يَسَّرْنَٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని).[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱرْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70