Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. [1] మరియు పూర్వ జాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి.
Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ, నీవు వారితో: "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: "వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు." అని అంటారు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే మీ కొరకు ఈ భూమిని పరుపుగా చేశాడు; మరియు మీరు మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి, అందులో మీ కొరకు త్రోవలు ఏర్పరచాడు. [1]
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించటానికి: "ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా (భాగస్వాములుగా / సంతానంగా) చేశారు. [1] నిశ్చయంగా, మానవుడు పరమ కృతఘ్నుడు!
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమిటి? ఆయన తాను సృష్టించిన వాటిలో నుండి తన కొరకు కుమార్తెలను తీసుకొని మీ కొరకు ప్రత్యేకంగా కుమారులను ఉంచాడా? [1]
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడ సంతానమే గనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అంద జేయబడి నప్పుడు, అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగి పోతాడు!
Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని అల్లాహ్ కు అంటగట్టుతున్నారా)?
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా? వీరు! వారు (దేవదూతలు) సృష్టించబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి వుంచబడతాయి. మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు ఇలా అంటారు: "ఒకవేళ ఆ కరుణామయుడు తలచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు." దాని వాస్తవ జ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు!
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! వారిలా అంటారు: "వాస్తవానికి మేము, మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా చూశాము. మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము."
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: [1] "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము."
Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారి ప్రవక్త) ఇలా అనేవాడు: "ఒకవేళ నేను మీ తండ్రితాతలు అనుసరిస్తూ వచ్చిన దాని కంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీ కోసం తెచ్చినా (మీరు వారినే అనుసరిస్తారా)?" వారిలా జవాబిచ్చే వారు: "నిశ్చయంగా, మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము."
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. [1]
Telugu Translation - Abdurrahim ibn Muhammad(నేనైతే) నన్ను సృజించిన ఆయన (అల్లాహ్ నే ఆరాధిస్తాను). ఎందుకంటే! నిశ్చయంగా, ఆయనే నాకు మార్గదర్శకత్వం చేయగలడు."
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అతను (ఇబ్రాహీమ్) ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు. [1] వారు దాని వైపుకు మరలుతారని!
Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, నేను వారికి మరియు వారి తండ్రితాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం మరియు (దానిని) స్పష్టంగా వివరించే దైవప్రవక్త కూడా వచ్చాడు. [1]
Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని వారి వద్దకు సత్యం (ఈ ఖుర్ఆన్) వచ్చినప్పుడు వారన్నారు: "ఇది కేవలం మంత్రజాలమే. [1] మరియు నిశ్చయంగా, మేము దీనిని తిరస్కరిస్తున్నాము."
Telugu Translation - Abdurrahim ibn Muhammadనీ ప్రభువు కారుణ్యాన్ని పంచి పెట్టే వారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచి పెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి,[1] వారిలో కొందరికి మరి కొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని (సంపద) కంటే నీ ప్రభువు కారుణ్యమే [2] ఎంతో ఉత్తమమైనది.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటి పైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు బంగారంతో కూడా![1] మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత (సుఖం) ఉంటుంది.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షైతాన్ ను నియమిస్తాము. ఇక వాడు (ఆ షైతాన్) వాని సహచరుడు (ఖరీనున్) అవుతాడు.[1]
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, వారు (షైతాన్ లు) వారిని (అల్లాహ్) మార్గం నుండి ఆటంక పరుస్తారు. మరియు వారేమో నిశ్చయంగా, తాము సరైన మార్గదర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు!
Telugu Translation - Abdurrahim ibn Muhammadచివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నీకూ నాకూ మధ్య తూర్పుపడమరల[1] మధ్య ఉన్నంత దూరం ఉండి వుంటే ఎంత బాగుండేది! ఎందుకంటే నీవు అతి చెడ్డ సహచరుడివి!"
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) నీవు చెవిటి వాడికి వినిపింప జేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించ గలవా? లేక, స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి (మార్గదర్శకత్వం చేయగలవా)?[1]
Telugu Translation - Abdurrahim ibn Muhammadలేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది.
Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా, నీవు ఋజుమార్గం మీద ఉన్నావు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నీకు మరియు నీ జాతి వారికి ఒక హితబోధ. మరియు (దీనిని గురించి) మీరు ప్రశ్నింప బడగలరు.[1]
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: "మేము, ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో?"
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవంగా, మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. అతను వారితో ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుణ్ణి."
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని (అద్భుత సూచన) కంటే మించినదిగా ఉండేది.[1] మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని![2]
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: "ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గులమవుతాము."
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు, ఫిర్ఔన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈజిప్టు (మిస్ర్) యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్ళు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటం లేదా?
Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా, అతడు (ఫిర్ఔన్) తన జాతి వారిని ప్రేరేపింప జేయటం వలన వారు అతనిని అనుసరించారు. నిశ్చయంగా వారు దుర్జనులు (ఫాసిఖీన్).
Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా, వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము. మరియు వారందరినీ ముంచి వేశాము.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మర్యమ్ కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొనబడినప్పుడు (ఓ ముహమ్మద్!) నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలు వేస్తారు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అంటారు: "మా దేవుళ్ళు మంచివా లేక అతడా (ఈసానా)?" వారు ఈ విషయం నీ ముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహ ప్రియులైన జనులు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతను (ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహిచాము. మరియు మేము అతనిని ఇస్రాయీల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన.[1] కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: "వాస్తవంగా, నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకొని వచ్చాను;[1] మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి.
Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయినా, తరువాత వచ్చిన వర్గాల వారు పరస్పర వర్గ భేదాలకు లోనయ్యారు. కావున దుర్మర్గానికి పాల్పడిన వారికి బాధాకరమైన ఆ దినమున శిక్ష పడుతుంది!
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి మధ్య, బంగారు పళ్ళాలు[1] మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు కళ్ళకు ఇంపుగా ఉండేవి, అన్నీ ఉంటాయి. మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు ఏదైనా నిర్ణయం (పన్నాగం) చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా మేము కూడా ఒక గట్టి నిర్ణయం (పన్నాగం) చేస్తున్నాము.[1]
Telugu Translation - Abdurrahim ibn Muhammadలేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా కాదు, (వాస్తవానికి) మా దూతలు వారి దగ్గర ఉండి, అంతా వ్రాస్తున్నారు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadవారికి వాగ్దానం చేయబడిన ఆ దినాన్ని వారు దర్శించే వరకు, వారిని వారి వాదోపవాదాలలో మరియు వారి క్రీడలలో మునిగి ఉండనీ!
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన (అల్లాహ్) మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు. మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.[1]
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు; మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది; మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు ఆయనను వదలి, ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారికి సిఫారసు చేసే అధికారం లేదు.[1] కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చేవారు మరియు (అల్లాహ్ ఒక్కడే! అని) తెలిసి ఉన్నవారు తప్ప!
Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?
Telugu Translation - Abdurrahim ibn Muhammad"మరియు ఓ నా ప్రభూ! నిశ్చయంగా, ఈ ప్రజలు విశ్వసించరు!" అని పలికే (ప్రవక్త యొక్క) మాట (అల్లాహ్ కు బాగా తెలుసు).