హోమ్ › సూరాలు › సూరా Al-Waaqia
సూరా Al-Waaqia الواقعة
96 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 46
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا وَقَعَتِ ٱلْوَاقِعَةُ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
خَافِضَةٌ رَّافِعَةٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది[1].
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِذَا رُجَّتِ ٱلْأَرْضُ رَجًّا
Telugu Translation - Abdurrahim ibn Muhammad భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَبُسَّتِ ٱلْجِبَالُ بَسًّا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَكَانَتْ هَبَآءً مُّنۢبَثًّا
Telugu Translation - Abdurrahim ibn Muhammad అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَكُنتُمْ أَزْوَٰجًا ثَلَٰثَةً
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ مَآ أَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ مَآ أَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أُو۟لَٰٓئِكَ ٱلْمُقَرَّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى جَنَّٰتِ ٱلنَّعِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُلَّةٌ مِّنَ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మొదటి తరాల వారిలో నుండి చాలా మంది;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَقَلِيلٌ مِّنَ ٱلْـَٔاخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
مُّتَّكِـِٔينَ عَلَيْهَا مُتَقَٰبِلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
يَطُوفُ عَلَيْهِمْ وِلْدَٰنٌ مُّخَلَّدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفَٰكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَحُورٌ عِينٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
كَأَمْثَٰلِ ٱللُّؤْلُؤِ ٱلْمَكْنُونِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాచబడిన ముత్యాల వలే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِلَّا قِيلًا سَلَٰمًا سَلَٰمًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad "శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَصْحَٰبُ ٱلْيَمِينِ مَآ أَصْحَٰبُ ٱلْيَمِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى سِدْرٍ مَّخْضُودٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య ![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَطَلْحٍ مَّنضُودٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَظِلٍّ مَّمْدُودٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వ్యాపించి ఉన్న నీడలు,[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَمَآءٍ مَّسْكُوبٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفَٰكِهَةٍ كَثِيرَةٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَفُرُشٍ مَّرْفُوعَةٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّآ أَنشَأْنَٰهُنَّ إِنشَآءً
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَجَعَلْنَٰهُنَّ أَبْكَارًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عُرُبًا أَتْرَابًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు);[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لِّأَصْحَٰبِ ٱلْيَمِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కుడిపక్షం వారి కొరకు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُلَّةٌ مِّنَ ٱلْأَوَّلِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَثُلَّةٌ مِّنَ ٱلْـَٔاخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَصْحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصْحَٰبُ ٱلشِّمَالِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى سَمُومٍ وَحَمِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَظِلٍّ مِّن يَحْمُومٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు).
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَكَانُوا۟ يُصِرُّونَ عَلَى ٱلْحِنثِ ٱلْعَظِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَكَانُوا۟ يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
قُلْ إِنَّ ٱلْأَوَّلِينَ وَٱلْـَٔاخِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوْمٍ مَّعْلُومٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ثُمَّ إِنَّكُمْ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلْمُكَذِّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَـَٔاكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దానితో కడుపులు నింపుకుంటారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَشَٰرِبُونَ عَلَيْهِ مِنَ ٱلْحَمِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَشَٰرِبُونَ شُرْبَ ٱلْهِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
هَٰذَا نُزُلُهُمْ يَوْمَ ٱلدِّينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
نَحْنُ خَلَقْنَٰكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَرَءَيْتُم مَّا تُمْنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ءَأَنتُمْ تَخْلُقُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلْخَٰلِقُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ ٱلْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمْثَٰلَكُمْ وَنُنشِئَكُمْ فِى مَا لَا تَعْلَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَلَقَدْ عَلِمْتُمُ ٱلنَّشْأَةَ ٱلْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَرَءَيْتُم مَّا تَحْرُثُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ءَأَنتُمْ تَزْرَعُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلزَّٰرِعُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَوْ نَشَآءُ لَجَعَلْنَٰهُ حُطَٰمًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు."
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّا لَمُغْرَمُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad (మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
بَلْ نَحْنُ مَحْرُومُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَرَءَيْتُمُ ٱلْمَآءَ ٱلَّذِى تَشْرَبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ءَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ ٱلْمُزْنِ أَمْ نَحْنُ ٱلْمُنزِلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَوْ نَشَآءُ جَعَلْنَٰهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَرَءَيْتُمُ ٱلنَّارَ ٱلَّتِى تُورُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీరు రాజేసే అగ్నిని గమనించారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
ءَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَآ أَمْ نَحْنُ ٱلْمُنشِـُٔونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
نَحْنُ جَعَلْنَٰهَا تَذْكِرَةً وَمَتَٰعًا لِّلْمُقْوِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلَآ أُقْسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَإِنَّهُۥ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّهُۥ لَقُرْءَانٌ كَرِيمٌ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فِى كِتَٰبٍ مَّكْنُونٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad సురక్షితమైన[1] గ్రంథంలో ఉన్నది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلْمُطَهَّرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad దానిని[1] పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
تَنزِيلٌ مِّن رَّبِّ ٱلْعَٰلَمِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
أَفَبِهَٰذَا ٱلْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఏమీ? మీరు ఈ సందేశాన్ని[1] తేలికగా తీసుకుంటున్నారా?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلَوْلَآ إِذَا بَلَغَتِ ٱلْحُلْقُومَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَلَوْلَآ إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే;
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
تَرْجِعُونَهَآ إِن كُنتُمْ صَٰدِقِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُقَرَّبِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَمَّآ إِن كَانَ مِنْ أَصْحَٰبِ ٱلْيَمِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَسَلَٰمٌ لَّكَ مِنْ أَصْحَٰبِ ٱلْيَمِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది).
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో![1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَنُزُلٌ مِّنْ حَمِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
وَتَصْلِيَةُ جَحِيمٍ
Telugu Translation - Abdurrahim ibn Muhammad మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلْيَقِينِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం!
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ
Telugu Translation - Abdurrahim ibn Muhammad కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.[1]
ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →
← సూరా Ar-Rahmaan
సూరా Al-Hadid →
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
→
అరబీ మూలం మరియు అనువాదాలు Tanzil , QuranEnc ద్వారా — యథాతథంగా, మార్పు లేకుండా · అనువాదాలు వాటి అనువాదకులవి; ఖుర్ఆన్ స్వయంగా కాదు
ఇది పరిశోధన సహాయకం; మతపరమైన తీర్పుల మూలం కాదు.