caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Muminoon المؤمنون

118 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 74

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قَدْ أَفْلَحَ ٱلْمُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِينَ هُمْ فِى صَلَاتِهِمْ خَٰشِعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారే! ఎవరైతే తమ నమాజ్ లో వినమ్రత పాటిస్తారో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ هُمْ عَنِ ٱللَّغْوِ مُعْرِضُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ هُمْ لِلزَّكَوٰةِ فَٰعِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే విధిదానం (జకాత్) సక్రమంగా చెల్లిస్తారో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَٰفِظُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప![1] అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ هُمْ لِأَمَٰنَٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَٰتِهِمْ يُحَافِظُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْوَٰرِثُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِينَ يَرِثُونَ ٱلْفِرْدَوْسَ هُمْ فِيهَا خَٰلِدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారే ఫిరదౌస్ స్వర్గానికి వారసులై, అందులో వారు శాశ్వతంగా ఉంటారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ مِن سُلَٰلَةٍ مِّن طِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ جَعَلْنَٰهُ نُطْفَةً فِى قَرَارٍ مَّكِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ خَلَقْنَا ٱلنُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا ٱلْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا ٱلْمُضْغَةَ عِظَٰمًا فَكَسَوْنَا ٱلْعِظَٰمَ لَحْمًا ثُمَّ أَنشَأْنَٰهُ خَلْقًا ءَاخَرَ فَتَبَارَكَ ٱللَّهُ أَحْسَنُ ٱلْخَٰلِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు)[1] అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ إِنَّكُمْ يَوْمَ ٱلْقِيَٰمَةِ تُبْعَثُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآئِقَ وَمَا كُنَّا عَنِ ٱلْخَلْقِ غَٰفِلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము మీపై ఏడు మార్గాలను (ఆకాశాలను) సృష్టించాము.[1] మరియు మేము సృష్టి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా లేము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ فَأَسْكَنَّٰهُ فِى ٱلْأَرْضِ وَإِنَّا عَلَىٰ ذَهَابٍۭ بِهِۦ لَقَٰدِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము ఆకాశం నుండి ఒక పరిమాణంతో వర్షాన్ని (నీటిని) కురిపించాము, పిదప దానిని భూమిలో నిలువ జేశాము. మరియు నిశ్చయంగా, దానిని వెనక్కి తీసుకునే శక్తి మాకుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَنشَأْنَا لَكُم بِهِۦ جَنَّٰتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَٰبٍ لَّكُمْ فِيهَا فَوَٰكِهُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత దాని ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటలను ద్రాక్షతోటలను ఉత్పత్తి చేశాము; అందులో మీకు ఎన్నో ఫలాలు దొరుకుతాయి. మరియు వాటి నుండి మీరు తింటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَشَجَرَةً تَخْرُجُ مِن طُورِ سَيْنَآءَ تَنۢبُتُ بِٱلدُّهْنِ وَصِبْغٍ لِّلْـَٔاكِلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సినాయి కొండ ప్రాంతంలో ఒక వృక్షం పెరుగుతున్నది. అది నూనె ఇస్తుంది మరియు (దాని ఫలం) తినేవారికి రుచికరమైన (కూరగా) ఉపయోగపడుతుంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ لَكُمْ فِى ٱلْأَنْعَٰمِ لَعِبْرَةً نُّسْقِيكُم مِّمَّا فِى بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَٰفِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, మీ పశువులలో మీకు ఒక గుణపాఠముంది. మేము వాటి కడుపులలో ఉన్నది (పాలు) మీకు త్రాపుతున్నాము. మరియు వాటిలో మీకు ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటి (మాంసం) మీరు తింటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَعَلَيْهَا وَعَلَى ٱلْفُلْكِ تُحْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాటి మీద మరియు ఓడల మీద మీరు సవారీ చేస్తారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦ فَقَالَ يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُۥٓ أَفَلَا تَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము నూహ్ ను తన జాతి ప్రజల వద్దకు పంపాము. అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! ఏమీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండరా?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَقَالَ ٱلْمَلَؤُا۟ ٱلَّذِينَ كَفَرُوا۟ مِن قَوْمِهِۦ مَا هَٰذَآ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً مَّا سَمِعْنَا بِهَٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅతని జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు! మీపై ఆధిక్యత పొందగోరుతున్నాడు. మరియు అల్లాహ్ తలుచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు. ఇలాంటి విషయం పూర్వీకులైన మన తాతముత్తాతలలో కూడా జరిగినట్లు మేము వినలేదే!"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ فَتَرَبَّصُوا۟ بِهِۦ حَتَّىٰ حِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"ఇతడు కేవలం పిచ్చి పట్టిన మనిషి కావున కొంత కాలం ఇతనిని సహించండి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు నన్ను అసత్యపరుడని తిరస్కరిస్తున్నారు. కావున నాకు సహాయం చేయి."[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَوْحَيْنَآ إِلَيْهِ أَنِ ٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَآءَ أَمْرُنَا وَفَارَ ٱلتَّنُّورُ فَٱسْلُكْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ ٱثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ ٱلْقَوْلُ مِنْهُمْ وَلَا تُخَٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ إِنَّهُم مُّغْرَقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మేము అతనికి ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మా పర్యవేక్షణలో, మా దివ్యజ్ఞానం (వహీ) ప్రకారం ఒక ఓడను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు మరియు పొయ్యి నుండి నీరు ఉబికినప్పుడు (పొంగినప్పుడు)[1], ఆ నావలో ప్రతిరకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను మరియు నీ పరివారపు వారిని ఎక్కించుకో ఎవరిని గురించి అయితే ముందుగానే నిర్ణయం జరిగిందో వారు తప్ప! ఇక దుర్మార్గుల కొరకు నాతో మనవి చేయకు. నిశ్చయంగా, వారు ముంచి వేయబడతారు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا ٱسْتَوَيْتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى ٱلْفُلْكِ فَقُلِ ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"ఆ తరువాత నీవు మరియు నీతో ఉన్నవారు నావలోకి ఎక్కిన పిదప ఇలా ప్రార్థించండి: 'సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే, ఆయనే మమ్మల్ని దుర్మార్గుల నుండి విమోచనం కలిగించాడు.'

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقُل رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇంకా ఇలా ప్రార్థించు: 'ఓ నా ప్రభూ! నన్ను శుభప్రదమైన గమ్యస్థానంలో దించు. గమ్యస్థానానికి చేర్పించే వారిలో నీవే అత్యుత్తముడవు!'"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ وَإِن كُنَّا لَمُبْتَلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఇందులో (ఈ గాథలో) సూచనలున్నాయి. మరియు నిశ్చయంగా, మేము (ప్రజలను) పరీక్షకు గురి చేస్తూ ఉంటాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قَرْنًا ءَاخَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి తరువాత మేము మరొక తరాన్ని పుట్టించాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًا مِّنْهُمْ أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُۥٓ أَفَلَا تَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి వద్దకు వారి నుండియే, ఒక సందేశహరుణ్ణి పంపినప్పుడు, (అతను): "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా?" అని అన్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَالَ ٱلْمَلَأُ مِن قَوْمِهِ ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِلِقَآءِ ٱلْـَٔاخِرَةِ وَأَتْرَفْنَٰهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا مَا هَٰذَآ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadదానికి, అతని జాతివారిలోని - సత్యతిరస్కారులైనట్టి వారు, పరలోక సమావేశాన్ని అబద్ధమని నిరాకరించేవారు మరియు ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినట్టి - నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు, మీరు తినేదే ఇతనూ తింటున్నాడు మరియు మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَٰسِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఒకవేళ మీరు మీ వంటి ఒక సాధారణ మానవుణ్ణి అనుసరించినట్లైతే! నిశ్చయంగా, మీరు నష్టపడిన వారవుతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَٰمًا أَنَّكُم مُّخْرَجُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మీరు మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా తిరిగి లేపబడతారని ఇతను మీకు వాగ్దానం చేస్తున్నాడా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం నెరవేరటం అసంభవం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ هِىَ إِلَّا حَيَاتُنَا ٱلدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేది ఇక్కడే! మనం ఏ మాత్రమూ తిరిగి సజీవులుగా లేపబడము!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنْ هُوَ إِلَّا رَجُلٌ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُۥ بِمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఇతను, ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు మరియు మేము ఇతనిని (ఇతని మాటలను) ఎన్నటికీ విశ్వసించలేము."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఆ ప్రవక్త) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి నన్ను కాపాడు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ عَمَّا قَلِيلٍ لَّيُصْبِحُنَّ نَٰدِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు: "వీరు కొంతకాలంలోనే పశ్చాత్తాప పడతారు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ بِٱلْحَقِّ فَجَعَلْنَٰهُمْ غُثَآءً فَبُعْدًا لِّلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత సత్య (వాగ్దాన) ప్రకారం ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని చుట్టు ముట్టింది. మేము వారిని చెత్తా చెదారంగా మార్చి వేశాము. ఇక దుర్మార్గులైన జాతివారు ఈ విధంగానే దూరమై పోతారు (నాశనం చేయబడతారు)!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قُرُونًا ءَاخَرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి తరువాత ఇతర తరాల వారిని పుట్టించాము.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَـْٔخِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏ సమాజం వారు కూడా తమకు (నియమింపబడిన) గడువుకు ముందు కాలేరు మరియు దానికి వెనుక కాలేరు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا كُلَّ مَا جَآءَ أُمَّةً رَّسُولُهَا كَذَّبُوهُ فَأَتْبَعْنَا بَعْضَهُم بَعْضًا وَجَعَلْنَٰهُمْ أَحَادِيثَ فَبُعْدًا لِّقَوْمٍ لَّا يُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత మేము మా సందేశహరులను ఒకరి తరువాత ఒకరిని పంపుతూ వచ్చాము. ప్రతిసారి ఒక సమాజం వద్దకు దాని సందేశహరుడు వచ్చినప్పుడు, వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు. వారిని ఒకరి తరువాత ఒకరిని నశింపజేస్తూ వచ్చాము. చివరకు వారిని గాథలుగా చేసి వదిలాము. ఇక విశ్వసించని ప్రజలు ఈ విధంగా దూరమై పోవుగాక (నాశనం చేయబడుగాక!)

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَرْسَلْنَا مُوسَىٰ وَأَخَاهُ هَٰرُونَ بِـَٔايَٰتِنَا وَسُلْطَٰنٍ مُّبِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత మూసా మరియు అతని సోదరుడు హారూన్ లను మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦ فَٱسْتَكْبَرُوا۟ وَكَانُوا۟ قَوْمًا عَالِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు. కాని వారు దురహంకారం చూపారు. వారు తమ అహంభావంలో మునిగి ఉండేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَقَالُوٓا۟ أَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عَٰبِدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅపుడు వారన్నారు: "ఏమీ? మేము మా వంటి ఈ ఇద్దరు మానవులను విశ్వసించాలా? మరియు ఎవరి జాతి వారైతే మా బానిసలుగా ఉన్నారో!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَكَذَّبُوهُمَا فَكَانُوا۟ مِنَ ٱلْمُهْلَكِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున వారు, ఆ ఇరువురిని అసత్యవాదులని తిరస్కరించి, నాశనం చేయబడిన వారిలో చేరిపోయారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَٰبَ لَعَلَّهُمْ يَهْتَدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَعَلْنَا ٱبْنَ مَرْيَمَ وَأُمَّهُۥٓ ءَايَةً وَءَاوَيْنَٰهُمَآ إِلَىٰ رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَمَعِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక మర్యమ్ కుమారుణ్ణి మరియు అతని తల్లిని మేము (మా అనుగ్రహపు) సూచనగా చేశాము.[1] మరియు వారిద్దరికి ఉన్నతమైన, ప్రశాంతమైన నీడ, ప్రవహించే సెలయేళ్ళు మరియు చెలమలు గల స్థానంలో ఆశ్రయమిచ్చాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلرُّسُلُ كُلُوا۟ مِنَ ٱلطَّيِّبَٰتِ وَٱعْمَلُوا۟ صَٰلِحًا إِنِّى بِمَا تَعْمَلُونَ عَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వస్తువులనే తినండి మరియు సత్కార్యాలు చేయండి.[1] నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ هَٰذِهِۦٓ أُمَّتُكُمْ أُمَّةً وَٰحِدَةً وَأَنَا۠ رَبُّكُمْ فَٱتَّقُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు నేనే మీ ప్రభువును, కావున మీరు నా యందే భయభక్తులు కలిగి ఉండండి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَتَقَطَّعُوٓا۟ أَمْرَهُم بَيْنَهُمْ زُبُرًا كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని వారు తమ (ధర్మం) విషయంలో పరస్పర భేదాభిప్రాయాలు కల్పించుకొని, విభిన్న తెగలుగా చీలిపోయారు.[1] ప్రతి వర్గం వారు, తాము అనుసరించే దానితో సంతోషపడుతున్నారు.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَذَرْهُمْ فِى غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున వారిని కొంత కాలం వరకు వారి మూఢత్వంలోనే మునిగి ఉండనివ్వు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِۦ مِن مَّالٍ وَبَنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? మేము వారికి సంపదలు మరియు సంతానం సమృద్ధిగా ఇస్తున్నామంటే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

نُسَارِعُ لَهُمْ فِى ٱلْخَيْرَٰتِ بَل لَّا يَشْعُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము వారికి మేలు చేయటంలో తొందరపడుతున్నామని, వారు భావిస్తున్నారా?[1] అలా కాదు వారు గ్రహించటం లేదు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱلَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఎవరైతే, తమ ప్రభువు భయం వల్ల, భీతిపరులై ఉంటారో;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ هُم بِـَٔايَٰتِ رَبِّهِمْ يُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే, తమ ప్రభువు ఆయాతులను విశ్వసిస్తారో;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే తమ ప్రభువుకు ఎవ్వరినీ సాటిగా (భాగస్వాములుగా) కల్పించరో;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ يُؤْتُونَ مَآ ءَاتَوا۟ وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَٰجِعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే, తాము ఇవ్వ వలసినది (జకాత్) ఇచ్చేటప్పుడు, నిశ్చయంగా, వారు తమ ప్రభువు వైపుకు మరలిపోవలసి ఉన్నదనే భయాన్ని తమ హృదయాలలో ఉంచుకొని ఇస్తారో;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أُو۟لَٰٓئِكَ يُسَٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَهُمْ لَهَا سَٰبِقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలాంటి వారే మంచిపనులు చేయటంలో పోటీ పడేవారు. మరియు వారు వాటిని చేయటానికి అందరి కంటే ముందు ఉండేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا وَلَدَيْنَا كِتَٰبٌ يَنطِقُ بِٱلْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము ఏ ప్రాణి పై కూడా దాని శక్తికి మించిన భారం వేయము.[1] మరియు మా వద్ద అంతా వ్రాయబడిన ఒక గ్రంథముంది. అది సత్యాన్ని పలుకుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلْ قُلُوبُهُمْ فِى غَمْرَةٍ مِّنْ هَٰذَا وَلَهُمْ أَعْمَٰلٌ مِّن دُونِ ذَٰلِكَ هُمْ لَهَا عَٰمِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు, వారి హృదయాలు దీనిని గురించి అజ్ఞానంలో పడి ఉన్నాయి. ఇంతేగాక వారు చేసే (దుష్ట) కార్యాలు ఎన్నో ఉన్నాయి వారు వాటిని చూస్తునే ఉంటారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

حَتَّىٰٓ إِذَآ أَخَذْنَا مُتْرَفِيهِم بِٱلْعَذَابِ إِذَا هُمْ يَجْـَٔرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచివరకు, వారిలోని ఇహలోక భోగభాగ్యాలలో మునిగి ఉన్న వారిని శిక్షించటానికి మేము పట్టుకున్నప్పుడు, వారు మొరపెట్టుకుంటారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا تَجْـَٔرُوا۟ ٱلْيَوْمَ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఈరోజు మీరు మొరపెట్టుకోకండి! నిశ్చయంగా, మా తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం లభించడం జరుగదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَدْ كَانَتْ ءَايَٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُمْ عَلَىٰٓ أَعْقَٰبِكُمْ تَنكِصُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, నా సూచనలు మీకు వినిపించబడినప్పుడు, మీరు మీ మడమల మీద వెనుకకు తిరిగి పోయేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُسْتَكْبِرِينَ بِهِۦ سَٰمِرًا تَهْجُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"దురహంకారంతో దానిని[1] గురించి వ్యర్థపు ప్రలాపాలలో రాత్రులు గడుపుతూ ఉండేవారు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَلَمْ يَدَّبَّرُوا۟ ٱلْقَوْلَ أَمْ جَآءَهُم مَّا لَمْ يَأْتِ ءَابَآءَهُمُ ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారు ఈ (దైవ) వాక్కును[1] గురించి ఎన్నడూ ఆలోచించలేదా? లేక వారి పూర్వీకులైన, వారి తాతముత్తాతల వద్దకు ఎన్నడూ రానిది, వారి వద్దకు వచ్చిందనా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ لَمْ يَعْرِفُوا۟ رَسُولَهُمْ فَهُمْ لَهُۥ مُنكِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక వారు తమ సందేశహరుణ్ణి ఎరుగరా? అందుకే అతన్ని తిరస్కరిస్తున్నారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ يَقُولُونَ بِهِۦ جِنَّةٌۢ بَلْ جَآءَهُم بِٱلْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَٰرِهُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక: "అతనికి పిచ్చిపట్టింది!" అని అంటున్నారా? వాస్తవానికి, అతను వారి వద్దకు సత్యాన్ని తెచ్చాడు. కాని చాలామంది సత్యాన్ని అసహ్యించుకుంటున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوِ ٱتَّبَعَ ٱلْحَقُّ أَهْوَآءَهُمْ لَفَسَدَتِ ٱلسَّمَٰوَٰتُ وَٱلْأَرْضُ وَمَن فِيهِنَّ بَلْ أَتَيْنَٰهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఒకవేళ సత్యమే[1] వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమై పోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము.[2] కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ تَسْـَٔلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌ وَهُوَ خَيْرُ ٱلرَّٰزِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక నీవు (ఓ ముహమ్మద్!) వారిని ప్రతిఫలం ఏమైనా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలమే ఎంతో మేలైనది. ఆయనే అందరి కంటే శ్రేష్ఠుడైన ఉపాధి ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, నీవు వారిని ఋజుమార్గం వైపునకు పిలుస్తున్నావు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ عَنِ ٱلصِّرَٰطِ لَنَٰكِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, పరలోకాన్ని నమ్మని వారు (ఋజు) మార్గం నుండి వైదొలగిన వారే!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوْ رَحِمْنَٰهُمْ وَكَشَفْنَا مَا بِهِم مِّن ضُرٍّ لَّلَجُّوا۟ فِى طُغْيَٰنِهِمْ يَعْمَهُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ మేము వారిని కరుణించి, (ఇహలోకంలో వారికున్న) ఆపదను తొలగించినా! వారు తలబిరుసుతనంతో పట్టు విడువకుండా త్రోవ తప్పి, సంచరిస్తూ ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ أَخَذْنَٰهُم بِٱلْعَذَابِ فَمَا ٱسْتَكَانُوا۟ لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురి చేశాము.[1] అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు మరియు వారు వినమ్రులు కూడా కాలేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

حَتَّىٰٓ إِذَا فَتَحْنَا عَلَيْهِم بَابًا ذَا عَذَابٍ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبْلِسُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచివరకు మేము వారి కొరకు కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచాము. అప్పుడు వారు నిరాశ చెందిన వారయ్యారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهُوَ ٱلَّذِىٓ أَنشَأَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَٰرَ وَٱلْأَفْـِٔدَةَ قَلِيلًا مَّا تَشْكُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే, మీకు వినే శక్తినీ, చూసే శక్తినీ మరియు (అర్థం చేసుకోవటానికి) హృదయాలను సృజించినవాడు! అయినా మీరెంత తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهُوَ ٱلَّذِى ذَرَأَكُمْ فِى ٱلْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మిమ్మల్ని భూమిపై వ్యాపింప జేసినవాడు ఆయనే. మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهُوَ ٱلَّذِى يُحْىِۦ وَيُمِيتُ وَلَهُ ٱخْتِلَٰفُ ٱلَّيْلِ وَٱلنَّهَارِ أَفَلَا تَعْقِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీకు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! మరియు రాత్రింబవళ్ళ మార్పు ఆయన ఆధీనంలోనే ఉంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلْ قَالُوا۟ مِثْلَ مَا قَالَ ٱلْأَوَّلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని వారు తమ పూర్వీకులు పలికినట్లే పలుకుతున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوٓا۟ أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారంటున్నారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَقَدْ وُعِدْنَا نَحْنُ وَءَابَآؤُنَا هَٰذَا مِن قَبْلُ إِنْ هَٰذَآ إِلَّآ أَسَٰطِيرُ ٱلْأَوَّلِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి, ఇటువంటి వాగ్దానాలు, మాకూ మరియు మాకు పూర్వం మా తాతముత్తాతలకు చేయబడినవే! వాస్తవానికి ఇవి కేవలం పూర్వకాలపు కట్టుకథలు మాత్రమే"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُل لِّمَنِ ٱلْأَرْضُ وَمَن فِيهَآ إِن كُنتُمْ تَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిని ఇలా అడుగు: "ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَذَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారంటారు: "అల్లాహ్ కే!" వారితో అను: "అయినా మీరు హితోపదేశం స్వీకరించరా?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُلْ مَن رَّبُّ ٱلسَّمَٰوَٰتِ ٱلسَّبْعِ وَرَبُّ ٱلْعَرْشِ ٱلْعَظِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిని అడుగు: "సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు ఎవరు?"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَتَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారంటారు: "అల్లాహ్ మాత్రమే!" అని. వారితో అను: "అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُلْ مَنۢ بِيَدِهِۦ مَلَكُوتُ كُلِّ شَىْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిని ఇలా అడుగు: "మీకు తెలిస్తే చెప్పండి! ప్రతిదానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చేవాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వగల వాడెవ్వడూ లేనివాడు, ఎవరు?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَيَقُولُونَ لِلَّهِ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారంటారు: "అల్లాహ్ మాత్రమే!" వారితో అను: "అయితే మీరెందుకు మాయాజాలానికి గురవుతున్నారు (మోసగింపబడుతున్నారు)?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلْ أَتَيْنَٰهُم بِٱلْحَقِّ وَإِنَّهُمْ لَكَٰذِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలా కాదు! మేము వారికి సత్యాన్ని అందజేశాము. మరియు నిశ్చయంగా, వారే అసత్యవాదులు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا ٱتَّخَذَ ٱللَّهُ مِن وَلَدٍ وَمَا كَانَ مَعَهُۥ مِنْ إِلَٰهٍ إِذًا لَّذَهَبَ كُلُّ إِلَٰهٍۭ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ سُبْحَٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَٰلِمِ ٱلْغَيْبِ وَٱلشَّهَٰدَةِ فَتَعَٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు. వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే, ఆయన అత్యున్నతుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُل رَّبِّ إِمَّا تُرِيَنِّى مَا يُوعَدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! ఏ (శిక్ష అయితే) వారికి (అవిశ్వాసులకు) వాగ్దానం చేయబడి ఉన్నదో దానిని నీవు నాకు చూపనున్నచో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبِّ فَلَا تَجْعَلْنِى فِى ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ నా ప్రభూ! నన్ను ఈ దుర్మార్గ ప్రజలలో చేర్చకు."[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنَّا عَلَىٰٓ أَن نُّرِيَكَ مَا نَعِدُهُمْ لَقَٰدِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నిశ్చయంగా, మేము వారికి (అవిశ్వాసులకు) వాగ్దానము చేసింది (శిక్ష) నీకు చూపగల సమర్ధులము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱدْفَعْ بِٱلَّتِى هِىَ أَحْسَنُ ٱلسَّيِّئَةَ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచెడును, మంచితనముతో నివారించు.[1] వారు ఆపాదించే విషయాలు మాకు బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقُل رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَٰتِ ٱلشَّيَٰطِينِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! షైతానులు రేకెత్తించే కలతల నుండి (రక్షణ పొందటానికి) నేను నీ శరణు వేడుకుంటున్నాను.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఓ నా ప్రభూ! అవి నా వద్దకు రాకుండా ఉండాలని, నేను నీ శరణు వేడుకుంటున్నాను."[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَهُمُ ٱلْمَوْتُ قَالَ رَبِّ ٱرْجِعُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచివరికి వారిలో ఒకడికి మరణం సమీపించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: "ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు:

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَعَلِّىٓ أَعْمَلُ صَٰلِحًا فِيمَا تَرَكْتُ كَلَّآ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَآئِلُهَا وَمِن وَرَآئِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి."[1] అది కాని పని. నిశ్చయంగా అది అతని నోటిమాట మాత్రమే![2] ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది.[3]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ فَلَآ أَنسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَلَا يَتَسَآءَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత బాగా ఊదబడిన దినమున వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరి నొకరు పలుకరించుకోరు కూడా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَمَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఎవరి (సత్కార్యాల) పళ్ళాలు బరువుగా ఉంటాయో, ఆలాంటి వారే సాఫల్యం పొందేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ فَأُو۟لَٰٓئِكَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ فِى جَهَنَّمَ خَٰلِدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَلْفَحُ وُجُوهَهُمُ ٱلنَّارُ وَهُمْ فِيهَا كَٰلِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅగ్ని వారి ముఖాలను కాల్చి వేస్తుంది.[1] వారి పెదవులు బిగించుకు పోయి, పళ్ళు బయట పడతాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ تَكُنْ ءَايَٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُم بِهَا تُكَذِّبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారిని అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తాడు): "ఏమీ? నా సూచనలు మీకు వినిపించబడలేదా? అప్పుడు మీరు వాటిని అసత్యాలని తిరస్కరిస్తూ ఉండేవారు కదా?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَآلِّينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిలా అంటారు: "ఓ మా ప్రభూ! మా దురదృష్టం మమ్మల్ని క్రమ్ముకొని ఉండింది. మేము మార్గభ్రష్టులమైన వారిగా ఉండేవారం!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَبَّنَآ أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَٰلِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ మా ప్రభూ! మమ్మల్ని దీని (ఈ నరకం) నుండి బయటకు తీయి. ఒకవేళ మేము మరల (పాపాలు) చేస్తే, మేము నిశ్చయంగా, దుర్మార్గులమే!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالَ ٱخْسَـُٔوا۟ فِيهَا وَلَا تُكَلِّمُونِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన (అల్లాహ్) అంటాడు: "దానిలోనే పరాభవంతో పడి ఉండండి మరియు నాతో మాట్లాడకండి!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّهُۥ كَانَ فَرِيقٌ مِّنْ عِبَادِى يَقُولُونَ رَبَّنَآ ءَامَنَّا فَٱغْفِرْ لَنَا وَٱرْحَمْنَا وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰٓ أَنسَوْكُمْ ذِكْرِى وَكُنتُم مِّنْهُمْ تَضْحَكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారి మీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنِّى جَزَيْتُهُمُ ٱلْيَوْمَ بِمَا صَبَرُوٓا۟ أَنَّهُمْ هُمُ ٱلْفَآئِزُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా వారే విజయం పొందినవారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَٰلَ كَمْ لَبِثْتُمْ فِى ٱلْأَرْضِ عَدَدَ سِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అల్లాహ్) ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు భూమిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَالُوا۟ لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَسْـَٔلِ ٱلْعَآدِّينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిలా జవాబిస్తారు: "మేమక్కడ ఒక్క దినమో లేక దినపు కొంత భాగమో ఉంటిమి. లెక్క పెట్టిన వారిని అడుగు!"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَٰلَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا لَّوْ أَنَّكُمْ كُنتُمْ تَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(అల్లాహ్) అంటాడు: "మీరక్కడ ఉన్నది కొంతకాలం మాత్రమే! ఒకవేళ ఇది మీరు తెలుసుకొని ఉంటే (ఎంత బాగుండేది)!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَٰكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَتَعَٰلَى ٱللَّهُ ٱلْمَلِكُ ٱلْحَقُّ لَآ إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ ٱلْعَرْشِ ٱلْكَرِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున (తెలుసుకోండి) అల్లాహ్ అత్యున్నతుడు, నిజమైన విశ్వసార్వభౌముడు,[1] ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَن يَدْعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ لَا بُرْهَٰنَ لَهُۥ بِهِۦ فَإِنَّمَا حِسَابُهُۥ عِندَ رَبِّهِۦٓ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلْكَٰفِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقُل رَّبِّ ٱغْفِرْ وَٱرْحَمْ وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70