caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా As-Sajda السجدة

30 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 75

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ الٓمٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలిఫ్-లామ్-మీమ్[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَنزِيلُ ٱلْكِتَٰبِ لَا رَيْبَ فِيهِ مِن رَّبِّ ٱلْعَٰلَمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిస్సంకోచంగా, ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వలోకల ప్రభువు తరఫు నుండియే ఉంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ يَقُولُونَ ٱفْتَرَىٰهُ بَلْ هُوَ ٱلْحَقُّ مِن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّآ أَتَىٰهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَهْتَدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారు (అవిశ్వాసులు): "ఇతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా?[1] అలా కాదు! వాస్తవానికి ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించే వారెవ్వరూ రాని జాతి వారికి నీవు హెచ్చరిక చేయటానికి, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِى سِتَّةِ أَيَّامٍ ثُمَّ ٱسْتَوَىٰ عَلَى ٱلْعَرْشِ مَا لَكُم مِّن دُونِهِۦ مِن وَلِىٍّ وَلَا شَفِيعٍ أَفَلَا تَتَذَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్, ఆయనే ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా ఆరు దినములలో (అయ్యామ్ లలో)[1] సృష్టించాడు. ఆ తరువాత సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. ఆయన తప్ప మీకు మరొక సంరక్షకుడు గానీ, సిఫారసు చేసేవాడు గానీ ఎవ్వడూ లేడు, అయినా మీరు హితబోధ గ్రహించరా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُدَبِّرُ ٱلْأَمْرَ مِنَ ٱلسَّمَآءِ إِلَى ٱلْأَرْضِ ثُمَّ يَعْرُجُ إِلَيْهِ فِى يَوْمٍ كَانَ مِقْدَارُهُۥٓ أَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున,[1] ఆయన వద్దకు పోయి చేరుతుంది; దాని (ఆ దినపు) పరిమాణం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ذَٰلِكَ عَٰلِمُ ٱلْغَيْبِ وَٱلشَّهَٰدَةِ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన (అల్లాహ్) యే అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِىٓ أَحْسَنَ كُلَّ شَىْءٍ خَلَقَهُۥ وَبَدَأَ خَلْقَ ٱلْإِنسَٰنِ مِن طِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన తాను సృష్టించిన ప్రతి దానిని ఉత్తమరీతిలో చేశాడు. మరియు మానవ సృష్టిని మట్టితో ప్రారంభించాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ جَعَلَ نَسْلَهُۥ مِن سُلَٰلَةٍ مِّن مَّآءٍ مَّهِينٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత అతని సంతతిని ఒక అధమమైన ద్రవపదార్థపు సారంతో (వీర్యంతో) చేశాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ سَوَّىٰهُ وَنَفَخَ فِيهِ مِن رُّوحِهِۦ وَجَعَلَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَٰرَ وَٱلْأَفْـِٔدَةَ قَلِيلًا مَّا تَشْكُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత. అతనిని యుక్తమైన రూపంలో తీర్చిదిద్ది, అతనిలో తన (నుండి) ప్రాణం (ఆత్మ) ఊదాడు.[1] మరియు మీకు వినేశక్తిని, చూసేశక్తిని మరియు హృదయాలను (అర్థం చేసుకునే శక్తిని) ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలుపు కునేది చాలా తక్కువ!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَالُوٓا۟ أَءِذَا ضَلَلْنَا فِى ٱلْأَرْضِ أَءِنَّا لَفِى خَلْقٍ جَدِيدٍۭ بَلْ هُم بِلِقَآءِ رَبِّهِمْ كَٰفِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు (అవిశాసులు) అంటున్నారు: "ఏమీ? మేము నశించి, మట్టిలో కలిసి పోయినా, మేము మళ్ళీ క్రొత్తగా సృష్టించబడతామా?" అది కాదు! వారు తమ ప్రభువుతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తున్నారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُلْ يَتَوَفَّىٰكُم مَّلَكُ ٱلْمَوْتِ ٱلَّذِى وُكِّلَ بِكُمْ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوْ تَرَىٰٓ إِذِ ٱلْمُجْرِمُونَ نَاكِسُوا۟ رُءُوسِهِمْ عِندَ رَبِّهِمْ رَبَّنَآ أَبْصَرْنَا وَسَمِعْنَا فَٱرْجِعْنَا نَعْمَلْ صَٰلِحًا إِنَّا مُوقِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (పునరుత్థాన దినమున) ఈ అపరాధులు, తమ ప్రభువు సమక్షంలో, ఏ విధంగా తమ తలలు వంచుకొని నిలబడి ఉంటారో, నీవు చూడగలిగితే! వారు: "ఓ మా ప్రభూ! మేమిప్పుడు చూశాము మరియు విన్నాము, కావున మమ్మల్ని తిరిగి (భూలోకానికి) పంపించు. మేము సత్కార్యాలు చేస్తాము, నిశ్చయంగా, మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది." అని అంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوْ شِئْنَا لَـَٔاتَيْنَا كُلَّ نَفْسٍ هُدَىٰهَا وَلَٰكِنْ حَقَّ ٱلْقَوْلُ مِنِّى لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ أَجْمَعِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము కోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండేవారము.[1] కాని, నేను: "నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్ని నింపివేస్తాను." అని పలికిన, నా మాట సత్యమయ్యింది.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَذُوقُوا۟ بِمَا نَسِيتُمْ لِقَآءَ يَوْمِكُمْ هَٰذَآ إِنَّا نَسِينَٰكُمْ وَذُوقُوا۟ عَذَابَ ٱلْخُلْدِ بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున మీరు మీ యొక్క ఈనాటి సమావేశాన్ని మరచిపోయిన దాని ఫలితాన్ని రుచి చూడండి. నిశ్చయంగా, మేము కూడా మిమ్మల్ని మరచి పోయాము. మరియు మీరు మీ కర్మల ఫలితమైన ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّمَا يُؤْمِنُ بِـَٔايَٰتِنَا ٱلَّذِينَ إِذَا ذُكِّرُوا۟ بِهَا خَرُّوا۟ سُجَّدًا وَسَبَّحُوا۟ بِحَمْدِ رَبِّهِمْ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా వారే, మా సూచనలు (ఆయాత్) వారికి బోధించినప్పుడు, వాటిని విశ్వసించి సాష్టాంగంలో (సజ్దాలో) పడిపోతారు మరియు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతారు. మరియు ఆయనను స్తుతిస్తారు మరియు వారెన్నడూ గర్వపడరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

تَتَجَافَىٰ جُنُوبُهُمْ عَنِ ٱلْمَضَاجِعِ يَدْعُونَ رَبَّهُمْ خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَٰهُمْ يُنفِقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు[1] మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّآ أُخْفِىَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَمَن كَانَ مُؤْمِنًا كَمَن كَانَ فَاسِقًا لَّا يَسْتَوُۥنَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? విశ్వాసి అయినవాడు (దైవభీతి లేని) అవిధేయునితో సమానుడా? (కాదు!) వారు సరిసమానులు కాలేరు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمْ جَنَّٰتُ ٱلْمَأْوَىٰ نُزُلًۢا بِمَا كَانُوا۟ يَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో వారికి వారి కర్మల ఫలితంగా, వారి ఆతిథ్యం కొరకు స్వర్గవనాలలో నివాసాలుంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا ٱلَّذِينَ فَسَقُوا۟ فَمَأْوَىٰهُمُ ٱلنَّارُ كُلَّمَآ أَرَادُوٓا۟ أَن يَخْرُجُوا۟ مِنْهَآ أُعِيدُوا۟ فِيهَا وَقِيلَ لَهُمْ ذُوقُوا۟ عَذَابَ ٱلنَّارِ ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఎవరైతే, విద్రోహ వైఖరి అవలంబిస్తారో, వారి నివాసం నరకాగ్నియే. ప్రతిసారి వారు దాని నుండి బయట పడటానికి ప్రయత్నించినప్పుడల్లా, వారందులోకి తిరిగి నెట్టబడతారు. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని శిక్షను చవి చూడండి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَنُذِيقَنَّهُم مِّنَ ٱلْعَذَابِ ٱلْأَدْنَىٰ دُونَ ٱلْعَذَابِ ٱلْأَكْبَرِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ పెద్ద శిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచి చూపుతాము.[1] బహుశా, వారు (పశ్చాత్తాప పడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِـَٔايَٰتِ رَبِّهِۦ ثُمَّ أَعْرَضَ عَنْهَآ إِنَّا مِنَ ٱلْمُجْرِمِينَ مُنتَقِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు తన ప్రభువు సూచన (ఆయాత్) ల ద్వారా హితబోధ చేయబడిన తరువాత కూడా, వాటి నుండి విముఖుడయ్యే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం[1] చేసి తీరుతాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَٰبَ فَلَا تَكُن فِى مِرْيَةٍ مِّن لِّقَآئِهِۦ وَجَعَلْنَٰهُ هُدًى لِّبَنِىٓ إِسْرَٰٓءِيلَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. కావున, (ఓ ప్రవక్తా!) నీవు అతనిని (ఇస్రా రాత్రిలో) కలుసుకోబోయే విషయాన్ని గురించి సందేహంలో పడకు.[1] మరియు మేము దానిని (తౌరాత్ ను) ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేశాము.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَعَلْنَا مِنْهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا لَمَّا صَبَرُوا۟ وَكَانُوا۟ بِـَٔايَٰتِنَا يُوقِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము (ఇస్రాయీల్ సంతతి) వారిలో నుండి కొందరిని నాయకులుగా చేశాము. వారు, వారికి మా ఆజ్ఞానుసారంగా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు - ఎంత వరకైతే వారు సహనం వహించి ఉన్నారో మరియు వారు మా ఆయాత్ (సూచనలను) నమ్ముతూ ఉన్నారో!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ رَبَّكَ هُوَ يَفْصِلُ بَيْنَهُمْ يَوْمَ ٱلْقِيَٰمَةِ فِيمَا كَانُوا۟ فِيهِ يَخْتَلِفُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నీ ప్రభువు, పునరుత్థాన దినమున, వారికున్న భేదాభిప్రాయాలను గురించి వారి మధ్య తీర్పు చేస్తాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّنَ ٱلْقُرُونِ يَمْشُونَ فِى مَسَٰكِنِهِمْ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ أَفَلَا يَسْمَعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వీరికి పూర్వం అనేక తరాలను నాశనం చేసిన విషయం వీరికి మార్గదర్శకత్వం కాదా? వీరు, వారి నివాసస్థలాలలో తిరుగుతున్నారు కదా! నిశ్చయంగా ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఏమీ? వీరు వినటం లేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوَلَمْ يَرَوْا۟ أَنَّا نَسُوقُ ٱلْمَآءَ إِلَى ٱلْأَرْضِ ٱلْجُرُزِ فَنُخْرِجُ بِهِۦ زَرْعًا تَأْكُلُ مِنْهُ أَنْعَٰمُهُمْ وَأَنفُسُهُمْ أَفَلَا يُبْصِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారు చూడటం లేదా? నిశ్చయంగా, మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్ళను (వర్షాన్ని) పంపి దాని నుండి పైరును ఉత్పత్తి చేస్తే, దానిని వారి పశువులు మరియు వారూ తింటున్నారని. ఏమీ? వారిది గమనించటం (చూడటం) లేదా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلْفَتْحُ إِن كُنتُمْ صَٰدِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇంకా ఇలా అంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో చెప్పండి!"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُلْ يَوْمَ ٱلْفَتْحِ لَا يَنفَعُ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِيمَٰنُهُمْ وَلَا هُمْ يُنظَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అను: "ఆ తీర్పుదినం నాడు[1] సత్యతిరస్కారులు విశ్వసించ గోరినా, అది వారికి ఏ విధంగానూ పనికిరాదు! మరియు వారికెలాంటి గడువు కూడా ఇవ్వబడదు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَعْرِضْ عَنْهُمْ وَٱنتَظِرْ إِنَّهُم مُّنتَظِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు వారితో విముఖుడవగు![1] మరియు వేచి ఉండు నిశ్చయంగా, వారు కూడా (ఆ దినం కొరకు) వేచి ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70