caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Ar-Room الروم

60 ఆయతులు · మక్కా · అవతరణ క్రమం 84

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ الٓمٓ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅలిఫ్-లామ్-మీమ్[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

غُلِبَتِ ٱلرُّومُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadరోమన్ లు పరాజితులయ్యారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِىٓ أَدْنَى ٱلْأَرْضِ وَهُم مِّنۢ بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతమ పొరుగు భూభాగంలోనే! మరియు వారు తమ ఈ పరాజయం తరువాత, తిరిగి విజేతలు కాగలరు[1] -

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فِى بِضْعِ سِنِينَ لِلَّهِ ٱلْأَمْرُ مِن قَبْلُ وَمِنۢ بَعْدُ وَيَوْمَئِذٍ يَفْرَحُ ٱلْمُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(రాబోయే) కొన్ని[1] సంవత్సరాలలోనే. మొదట నయినా, తరువాత నయినా నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ దే మరియు ఆ రోజు విశ్వాసులు సంతోష పడతారు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بِنَصْرِ ٱللَّهِ يَنصُرُ مَن يَشَآءُ وَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ ప్రసాదించిన సహాయానికి[1]. ఆయన తనకు ఇష్టమైన వారికి సహాయం చేస్తాడు. మరియు ఆయనే సర్వశక్తి మంతుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَعْدَ ٱللَّهِ لَا يُخْلِفُ ٱللَّهُ وَعْدَهُۥ وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ఇది) అల్లాహ్ చేసిన వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు, కానీ వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَعْلَمُونَ ظَٰهِرًا مِّنَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَهُمْ عَنِ ٱلْـَٔاخِرَةِ هُمْ غَٰفِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారికి ఇహలోక జీవితపు బాహ్యరూపం మాత్రమే తెలుసు మరియు వారు పరలోకాన్ని గురించి ఏమరుపాటులో పడి ఉన్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوَلَمْ يَتَفَكَّرُوا۟ فِىٓ أَنفُسِهِم مَّا خَلَقَ ٱللَّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى وَإِنَّ كَثِيرًا مِّنَ ٱلنَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكَٰفِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా ప్రజలలో చాలా మంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ كَانُوٓا۟ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا۟ ٱلْأَرْضَ وَعَمَرُوهَآ أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَٰتِ فَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు[1] మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ كَانَ عَٰقِبَةَ ٱلَّذِينَ أَسَٰٓـُٔوا۟ ٱلسُّوٓأَىٰٓ أَن كَذَّبُوا۟ بِـَٔايَٰتِ ٱللَّهِ وَكَانُوا۟ بِهَا يَسْتَهْزِءُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadచివరకు చెడుకార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించేవారు. వాటిని గురించి ఎగతాళి చేసేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱللَّهُ يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ యే సృష్టి ప్రారంభిస్తాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి (పూర్వ స్థితిలోకి) తెస్తాడు. ఆ తరువాత మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُبْلِسُ ٱلْمُجْرِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ ఘడియ (పునరుత్థానం) ఆసన్నమైన రోజు, అపరాధులందరూ నిరాశ చెందుతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَآئِهِمْ شُفَعَٰٓؤُا۟ وَكَانُوا۟ بِشُرَكَآئِهِمْ كَٰفِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించిన వారెవ్వరూ వారి సిఫారసు చేయజాలరు. మరియు వారు కల్పించుకున్న తమ భాగస్వాములను తిరస్కరిస్తారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ ఘడియ (పునరుత్థానం) ఆసన్నమైన రోజు, ఆ రోజు వారు (ప్రజలు), వేర్వేరు వర్గాలలో విభజింప బడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَهُمْ فِى رَوْضَةٍ يُحْبَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅప్పుడు ఎవరైతే, విశ్వసించి, సత్కార్యాలు చేసి ఉంటారో, వారు ఉద్యానవనంలో ఆనందంగా ఉంచబడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا وَلِقَآئِ ٱلْـَٔاخِرَةِ فَأُو۟لَٰٓئِكَ فِى ٱلْعَذَابِ مُحْضَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను మరియు పరలోక సమావేశాన్ని తిరస్కరించారో, అలాంటి వారు శిక్ష కొరకు హాజరు చేయబడతారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَسُبْحَٰنَ ٱللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున, మీరు సాయంత్రము వేళ మరియు ఉదయం పూట అల్లాహ్ పవిత్రతను కొనియాడండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَهُ ٱلْحَمْدُ فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ సర్వస్తోత్రాలు ఆయన (అల్లాహ్) కే మరియు సంధ్యాకాలంలోనూ మరియు మధ్యాహ్న కాలంలోనూ (స్తోత్రాలు ఆయనకే)![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَيُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ وَيُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَكَذَٰلِكَ تُخْرَجُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన సజీవిని నిర్జీవి నుండి తీస్తాడు. మరియు నిర్జీవిని సజీవి నుండి తీస్తాడు. మరియు ఆయన భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇదే విధంగా మీరు కూడా (గోరీల నుండి) వెలికి తీయబడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَآ أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టి నుండి సృష్టించటం.[1] ఆ తరువాత మీరు మానవులుగా (భూమిలో) వ్యాపిస్తున్నారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا لِّتَسْكُنُوٓا۟ إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి - మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْ ءَايَٰتِهِۦ خَلْقُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱخْتِلَٰفُ أَلْسِنَتِكُمْ وَأَلْوَٰنِكُمْ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّلْعَٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం; మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْ ءَايَٰتِهِۦ مَنَامُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ وَٱبْتِغَآؤُكُم مِّن فَضْلِهِۦٓ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన సూచనలలో, మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْ ءَايَٰتِهِۦ يُرِيكُمُ ٱلْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَيُحْىِۦ بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన సూచనలలో, ఆయన మీకు మెరుపును చూపించి, భయాన్ని మరియు ఆశను కలుగజేయడం;[1] మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ ٱلْأَرْضِ إِذَآ أَنتُمْ تَخْرُجُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం.[1] ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమి నుండి లేచి ఒకేసారి బయటికి రావటం కూడా ఉన్నాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَهُۥ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ كُلٌّ لَّهُۥ قَٰنِتُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనదే. అన్నీ ఆయనకే ఆజ్ఞావర్తనులై ఉంటాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَهُوَ ٱلَّذِى يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ وَلَهُ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు.[1] ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది.[2] ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَٰنُكُم مِّن شُرَكَآءَ فِى مَا رَزَقْنَٰكُمْ فَأَنتُمْ فِيهِ سَوَآءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَٰتِ لِقَوْمٍ يَعْقِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆయన, స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ? మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతో పాటు సరిసమానులుగా, భాగస్వాములు కాగలరా? మీరు పరస్పరం ఒకరి పట్ల నొకరు భీతి కలిగి ఉన్నట్లు, వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా? ఈ విధంగా మేము బుద్ధిమంతులకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము[1].

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

بَلِ ٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَهْوَآءَهُم بِغَيْرِ عِلْمٍ فَمَن يَهْدِى مَنْ أَضَلَّ ٱللَّهُ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని దుర్మార్గులైనటువంటి వారు, తెలివి లేనిదే, తమ కోరికలను అనుసరిస్తారు. అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలిన వ్యక్తికి మార్గదర్శకత్వం ఎవడు చేయగలడు? [1] మరియు వారికి సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا فِطْرَتَ ٱللَّهِ ٱلَّتِى فَطَرَ ٱلنَّاسَ عَلَيْهَا لَا تَبْدِيلَ لِخَلْقِ ٱللَّهِ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు.[1] అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مُنِيبِينَ إِلَيْهِ وَٱتَّقُوهُ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُشْرِكِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఎల్లప్పుడు) మీరు ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతూ ఉండండి. మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నమాజ్ స్థాపించండి. మరియు ఆయన (అల్లాహ్) కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిపోకండి;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مِنَ ٱلَّذِينَ فَرَّقُوا۟ دِينَهُمْ وَكَانُوا۟ شِيَعًا كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతివర్గం వారు తమ వద్దనున్న దాని (సిద్ధాంతం) తోనే సంతోషపడుతున్నారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا مَسَّ ٱلنَّاسَ ضُرٌّ دَعَوْا۟ رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَآ أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మానవులకు ఆపద వచ్చినపుడు, వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను వేడుకుంటారు. ఆ తరువాత ఆయన కారుణ్యం నుండి కొంత వారికి రుచి చూపించినప్పుడు, వారిలో కొందరు తమ ప్రభువుకు సాటి (భాగస్వాములను) కల్పించసాగుతారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَٰهُمْ فَتَمَتَّعُوا۟ فَسَوْفَ تَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమేము వారికి ప్రసాదించిన దానికి (అనుగ్రహాలకు) కృతఘ్నత చూపటానికి (వారు అలా చేస్తారు). సరే! మీరు కొంత కాలం సుఖసంతోషాలు అనుభవించండి, త్వరలోనే మీరు (మీ ముగింపును) తెలుసుకుంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَٰنًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا۟ بِهِۦ يُشْرِكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadలేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని[1] అవతరింప జేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి?[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَآ أَذَقْنَا ٱلنَّاسَ رَحْمَةً فَرِحُوا۟ بِهَا وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము మానవులకు కారణ్యపు రుచి చూపించినప్పుడు వారు దానితో చాలా సంతోషపడతారు. కాని వారు తమ చేతులారా చేసుకున్న కర్మల ఫలితంగా[1] వారికేదైనా కీడు కలిగితే నిరాశ చెందుతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوَلَمْ يَرَوْا۟ أَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారికి తెలియదా? అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ఇస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలున్నాయి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَـَٔاتِ ذَا ٱلْقُرْبَىٰ حَقَّهُۥ وَٱلْمِسْكِينَ وَٱبْنَ ٱلسَّبِيلِ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ ٱللَّهِ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు నీ బంధువుకు అతని హక్కు ఇవ్వు మరియు యాచించని పేదవానికి మరియు బాటసారికి (కూడా)[1]. ఇది అల్లాహ్ ప్రసన్నతను కోరేవారికి ఎంతో ఉత్తమమైనది. మరియు ఇలాంటి వారే సాఫల్యము పొందేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ ءَاتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَا۟ فِىٓ أَمْوَٰلِ ٱلنَّاسِ فَلَا يَرْبُوا۟ عِندَ ٱللَّهِ وَمَآ ءَاتَيْتُم مِّن زَكَوٰةٍ تُرِيدُونَ وَجْهَ ٱللَّهِ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُضْعِفُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీరు ప్రజలకు - రిబా[1] (వడ్డీ మీద డబ్బు /కానుకలు) ఇచ్చి దాని ద్వారా వారి సంపద నుండి వృద్ధి పొందాలని - ఇచ్చే ధనం, అల్లాహ్ దృష్టిలో ఏ మాత్రం వృద్ధి పొందదు. మరియు మీరు అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశంతో ఏదైనా దానం (జకాత్) చేస్తే అలాంటి వారి (సంపద) ఎన్నో రెట్లు అధికమవుతుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ هَلْ مِن شُرَكَآئِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَىْءٍ سُبْحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ యే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్ళీ బ్రతికిస్తాడు. అయితే? మీరు (అల్లాహ్ కు) సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన వారిలో, ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా! [1] ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ظَهَرَ ٱلْفَسَادُ فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِى ٱلنَّاسِ لِيُذِيقَهُم بَعْضَ ٱلَّذِى عَمِلُوا۟ لَعَلَّهُمْ يَرْجِعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమానవులు తమ చేజేతులా సంపాదించుకున్న దాని ఫలితంగా భూమిలో మరియు సముద్రంలో కల్లోలం వ్యాపించింది. ఇది వారిలో కొందరు చేసిన దుష్కర్మల ఫలితాన్ని రుచి చూపటానికి, బహుశా ఇలాగైనా వారు (అల్లాహ్ వైపునకు) మరలుతారేమోనని!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلُ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారితో ఇలా అను: "భూమిలో ప్రయాణం చేసి చూడండి, మీకు పూర్వం గతించిన వారి ముగింపు ఎలా జరిగిందో! వారిలో చాలా మంది బహుదైవారాధకు లుండిరి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ ٱلْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు నీ ముఖాన్ని సరైన ధర్మం (ఇస్లాం) వైపునకే స్థిరంగా నిలుపు[1] - అల్లాహ్ తరఫు నుండి - ఆ రోజు రాకముందే దేనినైతే ఎవ్వడూ తొలగించలేడో! ఆ రోజు వారు పరస్పరం చెదిరిపోయి వేరవుతారు.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُۥ وَمَنْ عَمِلَ صَٰلِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadసత్యాన్ని తిరస్కరించినవాడు, తన తిరస్కార ఫలితాన్ని అనుభవిస్తాడు. మరియు సత్కార్యాలు చేసిన వారు, తమ కొరకే (సాఫల్యమార్గాన్ని) తయారు చేసుకుంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لِيَجْزِىَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ مِن فَضْلِهِۦٓ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْكَٰفِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇది ఆయన (అల్లాహ్), తన అనుగ్రహంతో విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫల మివ్వటానికి.[1] నిశ్చయంగా, ఆయన సత్యతిరస్కారులను ప్రేమించడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن يُرْسِلَ ٱلرِّيَاحَ مُبَشِّرَٰتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِۦ وَلِتَجْرِىَ ٱلْفُلْكُ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక ఆయన సూచనలలో ఆయన గాలులను శుభవార్తలిచ్చేవిగా పంపి మీకు తన కారుణ్యాన్ని రుచి చూపటం మరియు ఆయన ఆజ్ఞతో ఓడలను నడిపి, మిమ్మల్ని ఆయన అనుగ్రహాన్ని అన్వేషించనివ్వటం కూడా ఉన్నాయి. ఇవన్నీ, బహుశా మీరు కృతజ్ఞతలు చూపుతారేమోనని!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَآءُوهُم بِٱلْبَيِّنَٰتِ فَٱنتَقَمْنَا مِنَ ٱلَّذِينَ أَجْرَمُوا۟ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ ٱلْمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి మేము నీకు పూర్వం కూడా, సందేశహరులను తమ తమ జాతి వారి వద్దకు పంపాము.[1] వారు, వారి వద్దకు స్పష్టమైన సూచనలను తీసుకొని వచ్చారు. ఆ తరువాత కూడా నేరం చేసిన వారికి తగిన ప్రతీకారం[2] చేశాము. మరియు విశ్వాసులకు సహాయం చేయటం మా కర్తవ్యం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱللَّهُ ٱلَّذِى يُرْسِلُ ٱلرِّيَٰحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُۥ فِى ٱلسَّمَآءِ كَيْفَ يَشَآءُ وَيَجْعَلُهُۥ كِسَفًا فَتَرَى ٱلْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَٰلِهِۦ فَإِذَآ أَصَابَ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ యే గాలులను పంపేవాడు, కావున అవి మేఘాలను పైకి ఎత్తుతాయి, ఆ తరువాత ఆయన వాటిని తాను కోరినట్లు ఆకాశంలో వ్యాపింపజేస్తాడు. మరియు వాటిని ముక్కలు ముక్కలుగా చేసి, తరువాత వాటి మధ్య నుండి వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన దానిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించగా వారు సంతోషపడతారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِن كَانُوا۟ مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِۦ لَمُبْلِسِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి, అది (వర్షం) కురవక ముందు వారు ఎంతో నిరాశ చెంది ఉండేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱنظُرْ إِلَىٰٓ ءَاثَٰرِ رَحْمَتِ ٱللَّهِ كَيْفَ يُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ إِنَّ ذَٰلِكَ لَمُحْىِ ٱلْمَوْتَىٰ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున (ఓ మానవుడా!) అల్లాహ్ కారుణ్య చిహ్నాలను చూడు: ఆయన నిర్జీవంగా ఉన్న భూమిలో ఏ విధంగా ప్రాణం పోస్తాడో! నిశ్చయంగా, ఇదే విధంగా ఆయన (మరణానంతరం) మృతులకు కూడా ప్రాణం పోస్తాడు! మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا۟ مِنۢ بَعْدِهِۦ يَكْفُرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము గాలిని పంపితే, దాని నుండి వారి పంటలను పసుపు పచ్చగా మారి పోవటాన్ని చూసిన తరువాత వారు కృతఘ్నతకు లోనవుతారు (సత్యతిరస్కారులవుతారు).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِنَّكَ لَا تُسْمِعُ ٱلْمَوْتَىٰ وَلَا تُسْمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوْا۟ مُدْبِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నీవు (ఓ ముహమ్మద్!) మృతులకు వినిపించలేవు. మరియు నీవు వెనుదిరిగి పోయే చెవిటివారికి కూడా సందేశాన్ని వినిపించలేవు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَآ أَنتَ بِهَٰدِ ٱلْعُمْىِ عَن ضَلَٰلَتِهِمْ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِـَٔايَٰتِنَا فَهُم مُّسْلِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు నీవు అంధులను, వారి మార్గభ్రష్టత్వం నుండి తప్పించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. నీవు కేవలం విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మాత్రమే మా సూచనలు వినిపించగలవు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً يَخْلُقُ مَا يَشَآءُ وَهُوَ ٱلْعَلِيمُ ٱلْقَدِيرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత మీకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారిగా చేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు, సర్వసమర్ధుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُقْسِمُ ٱلْمُجْرِمُونَ مَا لَبِثُوا۟ غَيْرَ سَاعَةٍ كَذَٰلِكَ كَانُوا۟ يُؤْفَكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఆ ఘడియ[1] సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణం చేస్తూ: "మేము ఒక ఘడియ సేపు కంటే ఎక్కువ కాలం (ప్రపంచంలో) ఉండలేదు" అని అంటారు. ఇదే విధంగా వారు (ప్రాపంచిక జీవితంలో) భ్రమలో ఉండేవారు.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ وَٱلْإِيمَٰنَ لَقَدْ لَبِثْتُمْ فِى كِتَٰبِ ٱللَّهِ إِلَىٰ يَوْمِ ٱلْبَعْثِ فَهَٰذَا يَوْمُ ٱلْبَعْثِ وَلَٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు జ్ఞానం మరియు విశ్వాసం అనుగ్రహింప బడినవారు ఇలా అంటారు: "వాస్తవానికి అల్లాహ్ మూలగ్రంథం[1] ప్రకారం మీరు పునరుత్థాన దినం వరకు (ఇహలోకంలో) ఉంటిరి. ఇక ఇదే ఆ పునరుత్థాన దినం, కాని నిశ్చయంగా! మీరిది తెలుసు కోలేక పోయారు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ ٱلَّذِينَ ظَلَمُوا۟ مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకనుక ఆ రోజు దుర్మార్గులకు, వారి సాకులు ఏ మాత్రం ప్రయోజనకరం కావు మరియు వారికి తమను తాము సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِى هَٰذَا ٱلْقُرْءَانِ مِن كُلِّ مَثَلٍ وَلَئِن جِئْتَهُم بِـَٔايَةٍ لَّيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజలకు, ప్రతి ఒక్క విషయపు ఉపమానాన్ని బోధించాము.[1] అయినా నీవు వారి వద్దకు ఏ అద్భుత సూచన (ఆయత్) తెచ్చినా, వారిలో సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మీరు కేవలం బూటకాలే పలుకుతున్నారు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَذَٰلِكَ يَطْبَعُ ٱللَّهُ عَلَىٰ قُلُوبِ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఈ విధంగా, అల్లాహ్ జ్ఞానహీనుల హృదయాల మీద ముద్ర వేస్తాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ وَلَا يَسْتَخِفَّنَّكَ ٱلَّذِينَ لَا يُوقِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం! కావున విశ్వాసహీనులు నిన్ను వ్యాకుల పరచరాదు సుమా!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70