caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా At-Tawba التوبة

129 ఆయతులు · మదీనా · అవతరణ క్రమం 113

بَرَآءَةٌ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلْمُشْرِكِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి (ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) ఎలాంటి సంబంధం లేదు, అని ప్రకటించబడుతోంది.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَسِيحُوا۟ فِى ٱلْأَرْضِ أَرْبَعَةَ أَشْهُرٍ وَٱعْلَمُوٓا۟ أَنَّكُمْ غَيْرُ مُعْجِزِى ٱللَّهِ وَأَنَّ ٱللَّهَ مُخْزِى ٱلْكَٰفِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున (ఓ ముష్రికులారా!) మీరు నాలుగు నెలల వరకు ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగండి[1]. కాని మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్! సత్యతిరస్కారులను అవమానం పాలు చేస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَذَٰنٌ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلنَّاسِ يَوْمَ ٱلْحَجِّ ٱلْأَكْبَرِ أَنَّ ٱللَّهَ بَرِىٓءٌ مِّنَ ٱلْمُشْرِكِينَ وَرَسُولُهُۥ فَإِن تُبْتُمْ فَهُوَ خَيْرٌ لَّكُمْ وَإِن تَوَلَّيْتُمْ فَٱعْلَمُوٓا۟ أَنَّكُمْ غَيْرُ مُعْجِزِى ٱللَّهِ وَبَشِّرِ ٱلَّذِينَ كَفَرُوا۟ بِعَذَابٍ أَلِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి పెద్ద హజ్జ్[1] రోజున సర్వమానవ జాతికి ప్రకటన చేయబడుతోంది: "నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు, బహుదైవారాధకులతో, ఎలాంటి సంబంధం లేదు. కావున మీరు (ఓ ముష్రికులారా!) పశ్చాత్తాపపడితే, అది మీ మేలుకే. కాని మీరు విముఖులైతే, మీరు అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించుకోలేరని తెలుసుకోండి." మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష (విధించబడ) నున్నదనే వార్తను వినిపించు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلْمُشْرِكِينَ ثُمَّ لَمْ يَنقُصُوكُمْ شَيْـًٔا وَلَمْ يُظَٰهِرُوا۟ عَلَيْكُمْ أَحَدًا فَأَتِمُّوٓا۟ إِلَيْهِمْ عَهْدَهُمْ إِلَىٰ مُدَّتِهِمْ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُتَّقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని ఏ బహుదైవాధకులతోనైతే మీరు ఒడంబడికలు చేసుకొని ఉన్నారో, వారు మీకు ఏ విషయంలోను లోపం చేయక, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయకుండా ఉంటే! వారి ఒడంబడికను దాని గడువు వరకు పూర్తి చెయ్యండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِذَا ٱنسَلَخَ ٱلْأَشْهُرُ ٱلْحُرُمُ فَٱقْتُلُوا۟ ٱلْمُشْرِكِينَ حَيْثُ وَجَدتُّمُوهُمْ وَخُذُوهُمْ وَٱحْصُرُوهُمْ وَٱقْعُدُوا۟ لَهُمْ كُلَّ مَرْصَدٍ فَإِن تَابُوا۟ وَأَقَامُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتَوُا۟ ٱلزَّكَوٰةَ فَخَلُّوا۟ سَبِيلَهُمْ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక నిషిద్ధమాసాలు[1] గడిచిపోయిన తరువాత బహుదైవారాధకులను, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి.[2] మరియు వారిని పట్టుకోండి[3] మరియు చుట్టుముట్టండి మరియు ప్రతి మాటు వద్ద వారికై పొంచి ఉండండి[4]. కాని వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే, వారిని వారి మార్గాన వదలి పెట్టండి.[5] నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِنْ أَحَدٌ مِّنَ ٱلْمُشْرِكِينَ ٱسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَٰمَ ٱللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُۥ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి - అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు. [1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَيْفَ يَكُونُ لِلْمُشْرِكِينَ عَهْدٌ عِندَ ٱللَّهِ وَعِندَ رَسُولِهِۦٓ إِلَّا ٱلَّذِينَ عَٰهَدتُّمْ عِندَ ٱلْمَسْجِدِ ٱلْحَرَامِ فَمَا ٱسْتَقَٰمُوا۟ لَكُمْ فَٱسْتَقِيمُوا۟ لَهُمْ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُتَّقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadబహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో ఒడంబడిక ఎలా సాధ్యం కాగలదు? మస్జిద్ అల్ హరామ్ వద్ద మీరు ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప! వారు తమ (ఒడంబడికపై) స్థిరంగా ఉన్నంత వరకు మీరు కూడా దానిపై స్థిరంగా ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గలవారిని ప్రేమిస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَيْفَ وَإِن يَظْهَرُوا۟ عَلَيْكُمْ لَا يَرْقُبُوا۟ فِيكُمْ إِلًّا وَلَا ذِمَّةً يُرْضُونَكُم بِأَفْوَٰهِهِمْ وَتَأْبَىٰ قُلُوبُهُمْ وَأَكْثَرُهُمْ فَٰسِقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(వారితో ఒడంబడిక) ఎలా సాధ్యం కాగలదు? ఎందుకంటే వారు మీపై ప్రాబల్యం వహిస్తే, వారు మీ బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు. వారు కేవలం నోటి మాటలతోనే మిమ్మల్ని సంతోష పరుస్తున్నారు. కాని వారి హృదయాలు మాత్రం మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాయి మరియు వారిలో అనేకులు అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱشْتَرَوْا۟ بِـَٔايَٰتِ ٱللَّهِ ثَمَنًا قَلِيلًا فَصَدُّوا۟ عَن سَبِيلِهِۦٓ إِنَّهُمْ سَآءَ مَا كَانُوا۟ يَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) అల్పధరకు విక్రయించి, ప్రజలను ఆయన మార్గం నుండి ఆటంకపరుస్తున్నారు. నిశ్చయంగా, వారు చేసే పనులు ఎంతో నీచమైనవి!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا يَرْقُبُونَ فِى مُؤْمِنٍ إِلًّا وَلَا ذِمَّةً وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُعْتَدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు ఏ విశ్వాసి విషయంలో కూడా బంధుత్వాన్ని గానీ, ఒడంబడికను గానీ పాటించరు! ఇటువంటి వారే, హద్దును అతిక్రమించినవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِن تَابُوا۟ وَأَقَامُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتَوُا۟ ٱلزَّكَوٰةَ فَإِخْوَٰنُكُمْ فِى ٱلدِّينِ وَنُفَصِّلُ ٱلْـَٔايَٰتِ لِقَوْمٍ يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు. మరియు తెలుసుకోగల వారికి, మేము మా సూచనలను, ఈ విధంగా స్పష్టపరుస్తున్నాము.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِن نَّكَثُوٓا۟ أَيْمَٰنَهُم مِّنۢ بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا۟ فِى دِينِكُمْ فَقَٰتِلُوٓا۟ أَئِمَّةَ ٱلْكُفْرِ إِنَّهُمْ لَآ أَيْمَٰنَ لَهُمْ لَعَلَّهُمْ يَنتَهُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు ఒడంబడిక చేసిన తరువాత, మళ్ళీ తమ ప్రమాణాలను భంగం చేస్తే! మరియు మీ ధర్మాన్ని అవమానపరిస్తే, అలాంటి సత్యతిరస్కారుల నాయకులతో మీరు యుద్ధం చేయండి. నిశ్చయంగా, వారి ప్రమాణాలు నమ్మదగినవి కావు. బహుశా ఈ విధంగానైనా వారు మానుకోవచ్చు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَا تُقَٰتِلُونَ قَوْمًا نَّكَثُوٓا۟ أَيْمَٰنَهُمْ وَهَمُّوا۟ بِإِخْرَاجِ ٱلرَّسُولِ وَهُم بَدَءُوكُمْ أَوَّلَ مَرَّةٍ أَتَخْشَوْنَهُمْ فَٱللَّهُ أَحَقُّ أَن تَخْشَوْهُ إِن كُنتُم مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి, సందేశహరుణ్ణి (మక్కా నుండి) వెడల గొట్టాలని నిర్ణయించారో! మరియు మొదట వారే, మీతో తగవు ఆరంభించారో,[1] అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమీ? మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే, కేవలం అల్లాహ్ కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَٰتِلُوهُمْ يُعَذِّبْهُمُ ٱللَّهُ بِأَيْدِيكُمْ وَيُخْزِهِمْ وَيَنصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُورَ قَوْمٍ مُّؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు. మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు;

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ وَيَتُوبُ ٱللَّهُ عَلَىٰ مَن يَشَآءُ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు. మరియు అల్లాహ్! తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَمْ حَسِبْتُمْ أَن تُتْرَكُوا۟ وَلَمَّا يَعْلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَٰهَدُوا۟ مِنكُمْ وَلَمْ يَتَّخِذُوا۟ مِن دُونِ ٱللَّهِ وَلَا رَسُولِهِۦ وَلَا ٱلْمُؤْمِنِينَ وَلِيجَةً وَٱللَّهُ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? అల్లాహ్ మీలో నుండి (తన మార్గంలో) పోరాడేవారెవరో మరియు - అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప - ఇతరుల నెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో, తెలుసుకోనిదే మిమ్మల్ని వదలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا۟ مَسَٰجِدَ ٱللَّهِ شَٰهِدِينَ عَلَىٰٓ أَنفُسِهِم بِٱلْكُفْرِ أُو۟لَٰٓئِكَ حَبِطَتْ أَعْمَٰلُهُمْ وَفِى ٱلنَّارِ هُمْ خَٰلِدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadబహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయటానికి) అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّمَا يَعْمُرُ مَسَٰجِدَ ٱللَّهِ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمْ يَخْشَ إِلَّا ٱللَّهَ فَعَسَىٰٓ أُو۟لَٰٓئِكَ أَن يَكُونُوا۟ مِنَ ٱلْمُهْتَدِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించేవారు, నమాజ్ ను స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడని వారు మాత్రమే అల్లాహ్ మస్జిదులను నిర్వహించాలి. ఇలాంటి వారే మార్గదర్శకత్వం పొందినవారని ఆశించవచ్చు![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَجَعَلْتُمْ سِقَايَةَ ٱلْحَآجِّ وَعِمَارَةَ ٱلْمَسْجِدِ ٱلْحَرَامِ كَمَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَجَٰهَدَ فِى سَبِيلِ ٱللَّهِ لَا يَسْتَوُۥنَ عِندَ ٱللَّهِ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాపటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు.[1] మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِينَ ءَامَنُوا۟ وَهَاجَرُوا۟ وَجَٰهَدُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِندَ ٱللَّهِ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْفَآئِزُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవిశ్వసించి, అల్లాహ్ మార్గంలో వలస పోయిన వారికీ మరియు తమ ధనసంపత్తులను, ప్రాణాలను వినియోగించి పోరాడిన వారికీ, అల్లాహ్ దగ్గర అత్యున్నత స్థానముంది. మరియు అలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُبَشِّرُهُمْ رَبُّهُم بِرَحْمَةٍ مِّنْهُ وَرِضْوَٰنٍ وَجَنَّٰتٍ لَّهُمْ فِيهَا نَعِيمٌ مُّقِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి ప్రభువు వారికి, తన తరఫు నుండి కారుణ్యాన్ని మరియు ప్రసన్నతను మరియు శాశ్వత సౌఖ్యాలు గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خَٰلِدِينَ فِيهَآ أَبَدًا إِنَّ ٱللَّهَ عِندَهُۥٓ أَجْرٌ عَظِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దగ్గర గొప్ప ప్రతిఫలముంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَتَّخِذُوٓا۟ ءَابَآءَكُمْ وَإِخْوَٰنَكُمْ أَوْلِيَآءَ إِنِ ٱسْتَحَبُّوا۟ ٱلْكُفْرَ عَلَى ٱلْإِيمَٰنِ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! మీ తండ్రితాతలు మరియు మీ సోదరులు సత్యతిరస్కారానికి విశ్వాసంపై ప్రాధాన్యతనిస్తే, మీరు వారిని స్నేహితులుగా చేసుకోకండి. మీలో వారి వైపు మొగ్గేవారే (వారిని మీ స్నేహితులుగా చేసుకునే వారే) దుర్మార్గులు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُلْ إِن كَانَ ءَابَآؤُكُمْ وَأَبْنَآؤُكُمْ وَإِخْوَٰنُكُمْ وَأَزْوَٰجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَٰلٌ ٱقْتَرَفْتُمُوهَا وَتِجَٰرَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَٰكِنُ تَرْضَوْنَهَآ أَحَبَّ إِلَيْكُم مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦ وَجِهَادٍ فِى سَبِيلِهِۦ فَتَرَبَّصُوا۟ حَتَّىٰ يَأْتِىَ ٱللَّهُ بِأَمْرِهِۦ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْفَٰسِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారితో ఇలా అను: "మీ తండ్రితాతలు మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు (అజ్వాజ్), మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు, మందగిస్తాయేమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు - అల్లాహ్ కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాడటం కంటే - మీకు ఎక్కువ ప్రియమైనవైతే, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు."[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَقَدْ نَصَرَكُمُ ٱللَّهُ فِى مَوَاطِنَ كَثِيرَةٍ وَيَوْمَ حُنَيْنٍ إِذْ أَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنكُمْ شَيْـًٔا وَضَاقَتْ عَلَيْكُمُ ٱلْأَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّيْتُم مُّدْبِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి ఇది వరకు చాలా యుద్ధరంగాలలో (మీరు కొద్దిమంది ఉన్నా) అల్లాహ్ మీకు విజయం చేకూర్చాడు. మరియు హునైన్ (యుద్ధం) రోజు మీ సంఖ్యాబలం మీకు గర్వకారణమయింది. కాని, అది మీకు ఏ విధంగానూ పనికి రాలేదు మరియు భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకై పోయింది. తరువాత మీరు వెన్ను చూపి పారిపోయారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ أَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَىٰ رَسُولِهِۦ وَعَلَى ٱلْمُؤْمِنِينَ وَأَنزَلَ جُنُودًا لَّمْ تَرَوْهَا وَعَذَّبَ ٱلَّذِينَ كَفَرُوا۟ وَذَٰلِكَ جَزَآءُ ٱلْكَٰفِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతరువాత అల్లాహ్ తన ప్రవక్తపై మరియు విశ్వాసులపై ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. మరియు మీకు కనిపించని (దైవదూతల) దళాలను దింపి సత్యతిరస్కారులను శిక్షించాడు.[1] మరియు ఇదే సత్యతిరస్కారులకు లభించే ప్రతిఫలం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ثُمَّ يَتُوبُ ٱللَّهُ مِنۢ بَعْدِ ذَٰلِكَ عَلَىٰ مَن يَشَآءُ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ తరువాత కూడా అల్లాహ్ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِنَّمَا ٱلْمُشْرِكُونَ نَجَسٌ فَلَا يَقْرَبُوا۟ ٱلْمَسْجِدَ ٱلْحَرَامَ بَعْدَ عَامِهِمْ هَٰذَا وَإِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنِيكُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦٓ إِن شَآءَ إِنَّ ٱللَّهَ عَلِيمٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! నిశ్చయంగా, బహుదైవారాధకులు (ముష్రికీన్) అపరిశుద్ధులు (నజ్స్)[1]. కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిద్ అల్ హరామ్ సమీపానికి రాకూడదు.[2] మరియు ఒకవేళ మీరు లేమికి భయపడితే! అల్లాహ్ కోరితే, తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపన్నులుగా చేయగలడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قَٰتِلُوا۟ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱللَّهِ وَلَا بِٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ ٱللَّهُ وَرَسُولُهُۥ وَلَا يَدِينُونَ دِينَ ٱلْحَقِّ مِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ حَتَّىٰ يُعْطُوا۟ ٱلْجِزْيَةَ عَن يَدٍ وَهُمْ صَٰغِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని; అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించినవి, నిషిద్ధమని భావించని; సత్యధర్మాన్ని తమ ధర్మంగా స్వీకరించని గ్రంథ ప్రజలతో - వారు స్వయంగా తమ చేతులతో జిజ్ యా[1] ఇచ్చి లోబడి ఉండే వరకూ - పోరాడండి.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقَالَتِ ٱلْيَهُودُ عُزَيْرٌ ٱبْنُ ٱللَّهِ وَقَالَتِ ٱلنَّصَٰرَى ٱلْمَسِيحُ ٱبْنُ ٱللَّهِ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَٰهِهِمْ يُضَٰهِـُٔونَ قَوْلَ ٱلَّذِينَ كَفَرُوا۟ مِن قَبْلُ قَٰتَلَهُمُ ٱللَّهُ أَنَّىٰ يُؤْفَكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు.[1] మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక! వారెంత మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱتَّخَذُوٓا۟ أَحْبَارَهُمْ وَرُهْبَٰنَهُمْ أَرْبَابًا مِّن دُونِ ٱللَّهِ وَٱلْمَسِيحَ ٱبْنَ مَرْيَمَ وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوٓا۟ إِلَٰهًا وَٰحِدًا لَّآ إِلَٰهَ إِلَّا هُوَ سُبْحَٰنَهُۥ عَمَّا يُشْرِكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు (యూదులు మరియు క్రైస్తవులు) అల్లాహ్ ను వదలి తమ యూద మతాచారులు (అహ్ బార్) లను మరియు (క్రైస్తవ) సన్యాసులను (రుహ్ బాన్ లను) మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ ను (క్రీస్తును) తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు.[1] వాస్తవానికి, వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يُرِيدُونَ أَن يُطْفِـُٔوا۟ نُورَ ٱللَّهِ بِأَفْوَٰهِهِمْ وَيَأْبَى ٱللَّهُ إِلَّآ أَن يُتِمَّ نُورَهُۥ وَلَوْ كَرِهَ ٱلْكَٰفِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో (ఊది) ఆర్పగోరుతున్నారు, కాని అల్లాహ్ అలా కానివ్వడు; సత్యతిరస్కారులకు అది ఎంత అసహ్యకరమైనా, ఆయన తన జ్యోతిని పూర్తిచేసి (ప్రసరింపజేసి) తీరుతాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

هُوَ ٱلَّذِىٓ أَرْسَلَ رَسُولَهُۥ بِٱلْهُدَىٰ وَدِينِ ٱلْحَقِّ لِيُظْهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦ وَلَوْ كَرِهَ ٱلْمُشْرِكُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadబహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِنَّ كَثِيرًا مِّنَ ٱلْأَحْبَارِ وَٱلرُّهْبَانِ لَيَأْكُلُونَ أَمْوَٰلَ ٱلنَّاسِ بِٱلْبَٰطِلِ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَٱلَّذِينَ يَكْنِزُونَ ٱلذَّهَبَ وَٱلْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِى سَبِيلِ ٱللَّهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! నిశ్చయంగా, చాలా మంది యూద మతాచారులు (అహ్ బార్) మరియు క్రైస్తవ సన్యాసులు (రుహ్ బాన్) ప్రజల సొత్తును అక్రమ పద్ధతుల ద్వారా తిని వేస్తున్నారు మరియు వారిని అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తున్నారు. మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَوْمَ يُحْمَىٰ عَلَيْهَا فِى نَارِ جَهَنَّمَ فَتُكْوَىٰ بِهَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ هَٰذَا مَا كَنَزْتُمْ لِأَنفُسِكُمْ فَذُوقُوا۟ مَا كُنتُمْ تَكْنِزُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ దినమున దానిని (జకాత్ ఇవ్వని ధనాన్ని /ఆ వెండి బంగారాన్ని) నరకాగ్నిలో కాల్చి దానితో వారి నుదురుల మీద, ప్రక్కల మీద మరియు వీపుల మీద వాతలు వేయబడతాయి.[1] (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఇదంతా మీరు మీ కొరకు కూడ బెట్టుకున్నదే. కావున మీరు కూడ బెట్టుకున్న దానిని చవి చూడండి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثْنَا عَشَرَ شَهْرًا فِى كِتَٰبِ ٱللَّهِ يَوْمَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ مِنْهَآ أَرْبَعَةٌ حُرُمٌ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ فَلَا تَظْلِمُوا۟ فِيهِنَّ أَنفُسَكُمْ وَقَٰتِلُوا۟ ٱلْمُشْرِكِينَ كَآفَّةً كَمَا يُقَٰتِلُونَكُمْ كَآفَّةً وَٱعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ مَعَ ٱلْمُتَّقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిద్ధ (మాసాలు).[1] ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగ హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి.[2] బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) అందరూ కలిసి పోరాడండి. ఏ విధంగా అయితే వారందరూ కలిసి మీతో పోరాడుతున్నారో! మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితోనే ఉంటాడని తెలుసుకోండి.[3]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّمَا ٱلنَّسِىٓءُ زِيَادَةٌ فِى ٱلْكُفْرِ يُضَلُّ بِهِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُحِلُّونَهُۥ عَامًا وَيُحَرِّمُونَهُۥ عَامًا لِّيُوَاطِـُٔوا۟ عِدَّةَ مَا حَرَّمَ ٱللَّهُ فَيُحِلُّوا۟ مَا حَرَّمَ ٱللَّهُ زُيِّنَ لَهُمْ سُوٓءُ أَعْمَٰلِهِمْ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْكَٰفِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, నెలలను వెనుక ముందు చేయటం (నసీఉ) సత్యతిరస్కారంలో అదనపు చేష్టయే! దాని వల్ల సత్యతిరస్కారులు మార్గభ్రష్టత్వానికి గురి చేయబడుతున్నారు. వారు దానిని ఒక సంవత్సరం ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం నిషేధించుకుంటారు. ఈ విధంగా వారు అల్లాహ్ నిషేధించిన (నెలల) సంఖ్యను తమకు అనుగుణంగా మార్చుకొని అల్లాహ్ నిషేధించిన దానిని ధర్మసమ్మతం చేసుకుంటున్నారు. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా కనిపిస్తున్నాయి. మరియు అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ مَا لَكُمْ إِذَا قِيلَ لَكُمُ ٱنفِرُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ ٱثَّاقَلْتُمْ إِلَى ٱلْأَرْضِ أَرَضِيتُم بِٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا مِنَ ٱلْـَٔاخِرَةِ فَمَا مَتَٰعُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا فِى ٱلْـَٔاخِرَةِ إِلَّا قَلِيلٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! మీకేమయింది? మీతో: "అల్లాహ్ మార్గంలో బయలు దేరండి." అని చెప్పినపుడు మీరు భూమికి అతుక్కొని పోతున్నారేమిటి? ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది![1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا تَنفِرُوا۟ يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا وَيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوهُ شَيْـًٔا وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు బయలు దేరకపోతే, ఆయన మీకు బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు మీకు బదులుగా మరొక జాతిని మీ స్థానంలో తెస్తాడు. మరియు మీరు ఆయనకు ఎలాంటి నష్టం కలిగించలేరు.[1] మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِلَّا تَنصُرُوهُ فَقَدْ نَصَرَهُ ٱللَّهُ إِذْ أَخْرَجَهُ ٱلَّذِينَ كَفَرُوا۟ ثَانِىَ ٱثْنَيْنِ إِذْ هُمَا فِى ٱلْغَارِ إِذْ يَقُولُ لِصَٰحِبِهِۦ لَا تَحْزَنْ إِنَّ ٱللَّهَ مَعَنَا فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَيْهِ وَأَيَّدَهُۥ بِجُنُودٍ لَّمْ تَرَوْهَا وَجَعَلَ كَلِمَةَ ٱلَّذِينَ كَفَرُوا۟ ٱلسُّفْلَىٰ وَكَلِمَةُ ٱللَّهِ هِىَ ٱلْعُلْيَا وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ మీరు అతనికి (ప్రవక్తకు) సహాయం చేయకపోతే ఏం ఫర్వాలేదు! (అల్లాహ్ అతనికి తప్పక సహాయం చేస్తాడు). ఏ విధంగానైతే, సత్యతిరస్కారులు అతనిని పారద్రోలి నపుడు, అల్లాహ్ అతనికి సహాయం చేశాడో! అప్పుడు అతను ఇద్దరిలో రెండవ వాడిగా (సౌర్) గుహలో ఉన్నప్పుడు అతను తన తోటి వానితో (అబూ బక్ర్ తో): "నీవు దుఃఖ పడకు, నిశ్చయంగా అల్లాహ్ మనతో ఉన్నాడు!" అని అన్నాడు.[1] అప్పుడు అల్లాహ్! అతనిపై తన తరఫు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనిని మీకు కనిపించని (దైవదూతల) దళాలతో సహాయం చేసి సత్యతిరస్కారుల మాటను కించపరచాడు. మరియు అల్లాహ్ మాట సదా సర్వోన్నతమైనదే. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహో వివేచనాపరుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱنفِرُوا۟ خِفَافًا وَثِقَالًا وَجَٰهِدُوا۟ بِأَمْوَٰلِكُمْ وَأَنفُسِكُمْ فِى سَبِيلِ ٱللَّهِ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَوْ كَانَ عَرَضًا قَرِيبًا وَسَفَرًا قَاصِدًا لَّٱتَّبَعُوكَ وَلَٰكِنۢ بَعُدَتْ عَلَيْهِمُ ٱلشُّقَّةُ وَسَيَحْلِفُونَ بِٱللَّهِ لَوِ ٱسْتَطَعْنَا لَخَرَجْنَا مَعَكُمْ يُهْلِكُونَ أَنفُسَهُمْ وَٱللَّهُ يَعْلَمُ إِنَّهُمْ لَكَٰذِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅది తొందరగా దొరికే లాభం మరియు సులభమైన ప్రయాణం అయితే వారు తప్పక నీ వెంట వెళ్ళేవారు. కాని వారికది (తబూక్ ప్రయాణం) చాలా కష్టమైనదిగా (దూరమైనదిగా) అనిపించింది. కావున వారు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ అంటున్నారు: "మేము రాగల స్థితిలో ఉంటే తప్పక మీ వెంట వచ్చి ఉండేవారము." (ఈ విధంగా అబద్ధమాడి) వారు తమను తాము నాశనం చేసుకుంటున్నారు. మరియు వారు అబద్ధమాడుతున్నారని అల్లాహ్ కు బాగా తెలుసు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

عَفَا ٱللَّهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكَ ٱلَّذِينَ صَدَقُوا۟ وَتَعْلَمَ ٱلْكَٰذِبِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నిన్ను మన్నించు గాక! సత్యవంతులెవరో నీకు స్పష్టం కాకముందే మరియు అబద్ధమాడే వారెవరో నీకు తెలియక ముందే, వారిని (వెనుక ఉండటానికి) ఎందుకు అనుమతి నిచ్చావు?[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا يَسْتَـْٔذِنُكَ ٱلَّذِينَ يُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ أَن يُجَٰهِدُوا۟ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ وَٱللَّهُ عَلِيمٌۢ بِٱلْمُتَّقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు, తమ సంపత్తి మరియు తమ ప్రాణాలను వినియోగించి (అల్లాహ్ మార్గంలో) పోరాడటం నుండి తప్పించుకోవటానికి ఎన్నడూ అనుమతి అడగరు. మరియు దైవభీతి గలవారు ఎవరో అల్లాహ్ కు బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّمَا يَسْتَـْٔذِنُكَ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَٱرْتَابَتْ قُلُوبُهُمْ فَهُمْ فِى رَيْبِهِمْ يَتَرَدَّدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిస్సందేహంగా, అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించని వారే, వెనుక ఉండటానికి అనుమతి అడుగుతారు. మరియు వారి హృదయాలు సందేహంలో మునిగి ఉన్నాయి. కావున వారు తమ సందేహాలలో పడి ఊగిసలాడుతున్నారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوْ أَرَادُوا۟ ٱلْخُرُوجَ لَأَعَدُّوا۟ لَهُۥ عُدَّةً وَلَٰكِن كَرِهَ ٱللَّهُ ٱنۢبِعَاثَهُمْ فَثَبَّطَهُمْ وَقِيلَ ٱقْعُدُوا۟ مَعَ ٱلْقَٰعِدِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఒకవేళ వారు బయలుదేరాలని కోరి ఉంటే తప్పక దానికై వారు యుద్ధ సామగ్రి సిద్ధ పరచుకొని ఉండేవారు, కాని వారు బయలు దేరటం అల్లాహ్ కు ఇష్టం లేదు, కావున వారిని నిలిపివేశాడు. మరియు వారితో: "కూర్చొని ఉన్న వారితో మీరు కూడా కూర్చొని ఉండండి!" అని చెప్పబడింది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَوْ خَرَجُوا۟ فِيكُم مَّا زَادُوكُمْ إِلَّا خَبَالًا وَلَأَوْضَعُوا۟ خِلَٰلَكُمْ يَبْغُونَكُمُ ٱلْفِتْنَةَ وَفِيكُمْ سَمَّٰعُونَ لَهُمْ وَٱللَّهُ عَلِيمٌۢ بِٱلظَّٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ వారు మీతో కలిసి వెళ్ళినా మీలో కలతలు తప్ప మరేమీ అధికం చేసేవారు కాదు. మరియు మీ మధ్య ఉపద్రవం (ఫిత్న) రేకెత్తించటానికి తీవ్రప్రయత్నాలు చేసేవారు. మరియు మీలో కొందరు వారి కొరకు (కపట విశ్వాసుల కొరకు) మాటలు వినేవారు (వారి గూఢాచారులు) ఉన్నారు. మరియు అల్లాహ్ కు దుర్మార్గుల గురించి బాగా తెలుసు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَقَدِ ٱبْتَغَوُا۟ ٱلْفِتْنَةَ مِن قَبْلُ وَقَلَّبُوا۟ لَكَ ٱلْأُمُورَ حَتَّىٰ جَآءَ ٱلْحَقُّ وَظَهَرَ أَمْرُ ٱللَّهِ وَهُمْ كَٰرِهُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ప్రవక్తా!) వాస్తవానికి, వారు ఇంతకు ముందు కూడా కల్లోలాన్ని (ఫిత్నను) పుట్టించి, నీ కార్యాలను తలక్రిందులు చేయగోరారు. చివరకు సత్యం బహిర్గతమయింది మరియు అల్లాహ్ నిర్ణయం స్పష్టమయ్యింది. మరియు వారు దీన్ని అసహ్యించుకున్నారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْهُم مَّن يَقُولُ ٱئْذَن لِّى وَلَا تَفْتِنِّىٓ أَلَا فِى ٱلْفِتْنَةِ سَقَطُوا۟ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌۢ بِٱلْكَٰفِرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారిలో: "నాకు (వెనుక ఉండటానికి) అనుమతినివ్వు! నన్ను ఏ మాత్రం పరీక్షకు గురిచేయకు!" అని అనేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి, వారు (ఇలా అనుమతి కోరి) పరీక్షకు గురి అయ్యారు! మరియు నిశ్చయంగా, సత్యతిరస్కారులను నరకాగ్ని చుట్టుకోనున్నది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِن تُصِبْكَ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِن تُصِبْكَ مُصِيبَةٌ يَقُولُوا۟ قَدْ أَخَذْنَآ أَمْرَنَا مِن قَبْلُ وَيَتَوَلَّوا۟ وَّهُمْ فَرِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ప్రవక్తా!) ఒకవేళ నీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. మరియు నీపై ఆపద వస్తే వారు: "మేము ముందుగానే జాగ్రత్త పడ్డాము!" అని అంటూ సంతోషపడుతూ మరలిపోతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُل لَّن يُصِيبَنَآ إِلَّا مَا كَتَبَ ٱللَّهُ لَنَا هُوَ مَوْلَىٰنَا وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారితో ఇలా అను: "అల్లాహ్ మా కొరకు వ్రాసింది తప్ప మరేమీ మాకు సంభవించదు. ఆయనే మా సంరక్షకుడు. మరియు విశ్వాసులు అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُلْ هَلْ تَرَبَّصُونَ بِنَآ إِلَّآ إِحْدَى ٱلْحُسْنَيَيْنِ وَنَحْنُ نَتَرَبَّصُ بِكُمْ أَن يُصِيبَكُمُ ٱللَّهُ بِعَذَابٍ مِّنْ عِندِهِۦٓ أَوْ بِأَيْدِينَا فَتَرَبَّصُوٓا۟ إِنَّا مَعَكُم مُّتَرَبِّصُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అను: "మీరు మా విషయంలో నిరీక్షిస్తున్నది రెండు మేలైన వాటిలో ఒకటి. అల్లాహ్ స్వయంగా మీకు శిక్ష విధిస్తాడా, లేదా మా చేతుల ద్వారానా? అని మేము నిరీక్షిస్తున్నాము. కావున మీరూ నిరీక్షించండి, నిశ్చయంగా మేము కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాము!"

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

قُلْ أَنفِقُوا۟ طَوْعًا أَوْ كَرْهًا لَّن يُتَقَبَّلَ مِنكُمْ إِنَّكُمْ كُنتُمْ قَوْمًا فَٰسِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అను: "మీరు మీ (సంపదను) ఇష్టపూర్వకంగా ఖర్చు చేసినా, లేదా ఇష్టం లేకుండా ఖర్చు చేసినా అది మీ నుండి స్వీకరించబడదు.[1] నిశ్చయంగా, మీరు అవిధేయులు (ఫాసిఖూన్)."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا مَنَعَهُمْ أَن تُقْبَلَ مِنْهُمْ نَفَقَٰتُهُمْ إِلَّآ أَنَّهُمْ كَفَرُوا۟ بِٱللَّهِ وَبِرَسُولِهِۦ وَلَا يَأْتُونَ ٱلصَّلَوٰةَ إِلَّا وَهُمْ كُسَالَىٰ وَلَا يُنفِقُونَ إِلَّا وَهُمْ كَٰرِهُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి విరాళం (చందా) స్వీకరించబడకుండా పోవటానికి కారణం, వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి తిరస్కరించడం మరియు నమాజ్ కొరకు ఎంతో సోమరితనంతో తప్ప రాకపోవడం మరియు అయిష్టంతో (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టడమే!"[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَا تُعْجِبْكَ أَمْوَٰلُهُمْ وَلَآ أَوْلَٰدُهُمْ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ لِيُعَذِّبَهُم بِهَا فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَٰفِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ, నిన్ను ఆశ్చర్యంలో పడనివ్వకూడదు![1] నిశ్చయంగా, అల్లాహ్ వాటి వలన వారిని, ఇహలోక జీవితంలో శిక్షించగోరుతున్నాడు. మరియు వారు సత్యతిరస్కార స్థితిలోనే తమ ప్రాణాలను కోల్పోతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَيَحْلِفُونَ بِٱللَّهِ إِنَّهُمْ لَمِنكُمْ وَمَا هُم مِّنكُمْ وَلَٰكِنَّهُمْ قَوْمٌ يَفْرَقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నామని అల్లాహ్ పై ప్రమాణం చేస్తున్నారు. కాని వారు మీతో లేరు. వాస్తవానికి వారు మీకు భయపడుతున్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَوْ يَجِدُونَ مَلْجَـًٔا أَوْ مَغَٰرَٰتٍ أَوْ مُدَّخَلًا لَّوَلَّوْا۟ إِلَيْهِ وَهُمْ يَجْمَحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఒకవేళ వారికి ఏదైనా ఆశ్రయం గానీ, గుహగానీ లేదా తలదాచుకోవటానికి ఏకాంత స్థలం గానీ దొరికితే, వారు తొందరగా పరుగెత్తి అందులో దాక్కుంటారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْهُم مَّن يَلْمِزُكَ فِى ٱلصَّدَقَٰتِ فَإِنْ أُعْطُوا۟ مِنْهَا رَضُوا۟ وَإِن لَّمْ يُعْطَوْا۟ مِنْهَآ إِذَا هُمْ يَسْخَطُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు దానాలు (సదఖాత్) పంచే విషయంలో నీపై అపనిందలు మోపుతున్నారు.[1] దాని నుండి వారికి కొంత ఇవ్వబడితే సంతోషిస్తారు. కాని దాని నుండి వారికి ఇవ్వబడక పోతే కోపగించుకుంటారు!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَوْ أَنَّهُمْ رَضُوا۟ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ وَقَالُوا۟ حَسْبُنَا ٱللَّهُ سَيُؤْتِينَا ٱللَّهُ مِن فَضْلِهِۦ وَرَسُولُهُۥٓ إِنَّآ إِلَى ٱللَّهِ رَٰغِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారికి ఇచ్చిన దానితో వారు తృప్తి పడి: "అల్లాహ్ యే మాకు చాలు! అల్లాహ్ తన అనుగ్రహంతో మాకు ఇంకా చాలా ఇస్తాడు మరియు ఆయన ప్రవక్త కూడా (ఇస్తాడు). నిశ్చయంగా, మేము అల్లాహ్ నే వేడుకుంటాము!" అని పలికి ఉంటే (అది వారికే బాగుండేది!)

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّمَا ٱلصَّدَقَٰتُ لِلْفُقَرَآءِ وَٱلْمَسَٰكِينِ وَٱلْعَٰمِلِينَ عَلَيْهَا وَٱلْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِى ٱلرِّقَابِ وَٱلْغَٰرِمِينَ وَفِى سَبِيلِ ٱللَّهِ وَٱبْنِ ٱلسَّبِيلِ فَرِيضَةً مِّنَ ٱللَّهِ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా దానాలు (సదఖాత్)[1] కేవలం యాచించు నిరుపేదలకు మరియు యాచించని పేదవారికి[2], (జకాత్) వ్యవహారాలపై నియుక్తులైన వారికి మరియు ఎవరి హృదయాలనైతే (ఇస్లాం వైపుకు) ఆకర్షించ వలసి ఉందో వారికి, బానిసల విముక్తి కొరకు, ఋణగ్రస్తులైన వారి కొరకు, అల్లాహ్ మార్గంలో (పోయేవారి) కొరకు మరియు బాటసారుల కొరకు. ఇది అల్లాహ్ నిర్ణయించిన ఒక విధి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْهُمُ ٱلَّذِينَ يُؤْذُونَ ٱلنَّبِىَّ وَيَقُولُونَ هُوَ أُذُنٌ قُلْ أُذُنُ خَيْرٍ لَّكُمْ يُؤْمِنُ بِٱللَّهِ وَيُؤْمِنُ لِلْمُؤْمِنِينَ وَرَحْمَةٌ لِّلَّذِينَ ءَامَنُوا۟ مِنكُمْ وَٱلَّذِينَ يُؤْذُونَ رَسُولَ ٱللَّهِ لَهُمْ عَذَابٌ أَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారిలో కొందరు ప్రవక్తను తమ మాటలతో బాధ కలిగించే వారున్నారు. వారంటారు: "ఇతను (చెప్పుడు మాటలు) వినేవాడు[1]." ఇలా అను: "అతను వినేది మీ మేలుకే! అతను అల్లాహ్ ను విశ్వసిస్తాడు మరియు విశ్వాసులను నమ్ముతాడు మరియు మీలో విశ్వసించిన వారికి అతను కారుణ్యమూర్తి." మరియు అల్లాహ్ సందేశహరునికి బాధ కలిగించే వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَحْلِفُونَ بِٱللَّهِ لَكُمْ لِيُرْضُوكُمْ وَٱللَّهُ وَرَسُولُهُۥٓ أَحَقُّ أَن يُرْضُوهُ إِن كَانُوا۟ مُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ విశ్వాసులారా!) మిమ్మల్ని సంతోషపెట్టటానికి వారు మీ ముందు అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తున్నారు. వాస్తవానికి వారు విశ్వాసులే అయితే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను సంతోషపెట్టటమే వారి బాధ్యత.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَعْلَمُوٓا۟ أَنَّهُۥ مَن يُحَادِدِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَأَنَّ لَهُۥ نَارَ جَهَنَّمَ خَٰلِدًا فِيهَا ذَٰلِكَ ٱلْخِزْىُ ٱلْعَظِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి విరోధించేవానికి, నిశ్చయంగా! భగభగమండే నరకాగ్ని శిక్ష ఉందనీ, అదే అతని శాశ్వత నివాసమనీ, వారికి తెలియదా? ఇది ఎంత గొప్ప అవమానం!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَحْذَرُ ٱلْمُنَٰفِقُونَ أَن تُنَزَّلَ عَلَيْهِمْ سُورَةٌ تُنَبِّئُهُم بِمَا فِى قُلُوبِهِمْ قُلِ ٱسْتَهْزِءُوٓا۟ إِنَّ ٱللَّهَ مُخْرِجٌ مَّا تَحْذَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadతమ హృదయాలలో ఉన్న (రహస్యాలను) స్పష్టంగా తెలియజేసేటటు వంటి సూరహ్ వారికి విరుద్ధంగా అవతరింప జేయబడుతుందేమోనని, ఈ కపట విశ్వాసులు భయపడుతున్నారు. వారితో అను: "మీరు ఎగతాళి చెయ్యండి, మీరు (బయట పడుతుందని) భయపడుతున్న విషయాన్ని, అల్లాహ్ తప్పక బయటపెడ్తాడు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِٱللَّهِ وَءَايَٰتِهِۦ وَرَسُولِهِۦ كُنتُمْ تَسْتَهْزِءُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవు వారిని అడిగితే వారు తప్పక: "మేము కేవలం కాలక్షేపానికి మరియు పరిహాసానికి మాత్రమే ఇలా మాట్లాడు తున్నాము." అని సమాధానమిస్తారు. వారితో అను: "ఏమీ? మీరు అల్లాహ్ తో మరియు ఆయన సూచనలతో (ఆయాత్ లతో) మరియు ఆయన ప్రవక్తతో వేళాకోళం చేస్తున్నారా?

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا تَعْتَذِرُوا۟ قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَٰنِكُمْ إِن نَّعْفُ عَن طَآئِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَآئِفَةًۢ بِأَنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక మీరు సాకులు చెప్పకండి, వాస్తవానికి మీరు విశ్వసించిన తరువాత సత్యాన్ని తిరస్కరించారు." మీలో కొందరిని మేము క్షమించినా ఇతరులను తప్పకుండా శిక్షిస్తాము, ఎందుకంటే వాస్తవానికి వారు అపరాధులు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلْمُنَٰفِقُونَ وَٱلْمُنَٰفِقَٰتُ بَعْضُهُم مِّنۢ بَعْضٍ يَأْمُرُونَ بِٱلْمُنكَرِ وَيَنْهَوْنَ عَنِ ٱلْمَعْرُوفِ وَيَقْبِضُونَ أَيْدِيَهُمْ نَسُوا۟ ٱللَّهَ فَنَسِيَهُمْ إِنَّ ٱلْمُنَٰفِقِينَ هُمُ ٱلْفَٰسِقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకపట విశ్వాసులైన పురుషులు మరియు కపట విశ్వాసులైన స్త్రీలు అందరూ ఒకే కోవకు చెందినవారు! వారు అధర్మాన్ని ఆదేశిస్తారు. మరియు ధర్మాన్ని నిషేధిస్తారు.[1] మరియు తమ చేతులను (మేలు నుండి) ఆపుకుంటారు. వారు అల్లాహ్ ను మరచిపోయారు,[2] కావున ఆయన కూడా వారిని మరచిపోయాడు. నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులే అవిధేయులు (ఫాసిఖూన్).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَعَدَ ٱللَّهُ ٱلْمُنَٰفِقِينَ وَٱلْمُنَٰفِقَٰتِ وَٱلْكُفَّارَ نَارَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَا هِىَ حَسْبُهُمْ وَلَعَنَهُمُ ٱللَّهُ وَلَهُمْ عَذَابٌ مُّقِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు కపట విశ్వాసులైన పురుషులకు మరియు కపట విశ్వాసులైన స్త్రీలకు మరియు సత్యతిరస్కారులకు, అల్లాహ్ నరకాగ్ని వాగ్దానం చేశాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే వారికి తగినది. మరియు అల్లాహ్ వారిని శపించాడు (బహష్కరించాడు). మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

كَٱلَّذِينَ مِن قَبْلِكُمْ كَانُوٓا۟ أَشَدَّ مِنكُمْ قُوَّةً وَأَكْثَرَ أَمْوَٰلًا وَأَوْلَٰدًا فَٱسْتَمْتَعُوا۟ بِخَلَٰقِهِمْ فَٱسْتَمْتَعْتُم بِخَلَٰقِكُمْ كَمَا ٱسْتَمْتَعَ ٱلَّذِينَ مِن قَبْلِكُم بِخَلَٰقِهِمْ وَخُضْتُمْ كَٱلَّذِى خَاضُوٓا۟ أُو۟لَٰٓئِكَ حَبِطَتْ أَعْمَٰلُهُمْ فِى ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْخَٰسِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(మీరు కూడా) గతించిన మీ పూర్వీకుల వంటివారు. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ధనవంతులు మరియు అధిక సంతానం గలవారు. వారు తమ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. మీరు కూడా మీ పూర్వీకులు అనుభవించినట్లు మీ భాగపు ఐహిక సుఖాలను అనుభవించారు. వారు పడి నటువంటి వ్యర్థ వాదోపవాదాలలో మీరు కూడా పడ్డారు. ఇలాంటి వారి కర్మలు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ వ్యర్థమవుతాయి. మరియు ఇలాంటి వారు! వీరే నష్టానికి గురి అయ్యేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَأْتِهِمْ نَبَأُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَقَوْمِ إِبْرَٰهِيمَ وَأَصْحَٰبِ مَدْيَنَ وَٱلْمُؤْتَفِكَٰتِ أَتَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَٰتِ فَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూహ్ జాతి వారి, ఆద్, సమూద్,[1] ఇబ్రాహీమ్ జాతి వారి,[2] మద్ యన్ (షుఐబ్) ప్రజల[3] మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల (లూత్) వారి (గాథలు అందలేదా)?[4] వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయదలచు కోలేదు కాని వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلْمُؤْمِنُونَ وَٱلْمُؤْمِنَٰتُ بَعْضُهُمْ أَوْلِيَآءُ بَعْضٍ يَأْمُرُونَ بِٱلْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ ٱلْمُنكَرِ وَيُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤْتُونَ ٱلزَّكَوٰةَ وَيُطِيعُونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓ أُو۟لَٰٓئِكَ سَيَرْحَمُهُمُ ٱللَّهُ إِنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు. వారు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మం నుండి నిషేధిస్తారు (వారిస్తారు) మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారినే అల్లాహ్ కరుణిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَعَدَ ٱللَّهُ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ جَنَّٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَمَسَٰكِنَ طَيِّبَةً فِى جَنَّٰتِ عَدْنٍ وَرِضْوَٰنٌ مِّنَ ٱللَّهِ أَكْبَرُ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అల్లాహ్ విశ్వాసులైన పురుషులకు మరియు విశ్వాసులైన స్త్రీలకు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల వాగ్దానం చేశాడు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. మరియు శాశ్వతమైన సుఖాలున్న ఆ స్వర్గవనాలలో, వారి కొరకు పరిశుద్ధ నివాసాలు ఉంటాయి.[1] వాటన్నిటి కంటే మించింది వారికి లభించే అల్లాహ్ ప్రసన్నత. అదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلنَّبِىُّ جَٰهِدِ ٱلْكُفَّارَ وَٱلْمُنَٰفِقِينَ وَٱغْلُظْ عَلَيْهِمْ وَمَأْوَىٰهُمْ جَهَنَّمُ وَبِئْسَ ٱلْمَصِيرُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ ప్రవక్తా! సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో పోరాడు మరియు వారి పట్ల కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَحْلِفُونَ بِٱللَّهِ مَا قَالُوا۟ وَلَقَدْ قَالُوا۟ كَلِمَةَ ٱلْكُفْرِ وَكَفَرُوا۟ بَعْدَ إِسْلَٰمِهِمْ وَهَمُّوا۟ بِمَا لَمْ يَنَالُوا۟ وَمَا نَقَمُوٓا۟ إِلَّآ أَنْ أَغْنَىٰهُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ مِن فَضْلِهِۦ فَإِن يَتُوبُوا۟ يَكُ خَيْرًا لَّهُمْ وَإِن يَتَوَلَّوْا۟ يُعَذِّبْهُمُ ٱللَّهُ عَذَابًا أَلِيمًا فِى ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ وَمَا لَهُمْ فِى ٱلْأَرْضِ مِن وَلِىٍّ وَلَا نَصِيرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammad"మేము ఏమీ (చెడు మాట) అనలేదు!" అని వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి అంటున్నారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారపు మాట అన్నారు. మరియు ఇస్లాంను స్వీకరించిన తరువాత దానిని తిరస్కరించారు. మరియు వారికి అసాధ్యమైన దానిని చేయదలచుకున్నారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త, (అల్లాహ్) అనుగ్రహంతో వారిని సంపన్నులుగా చేశారనే కదా! వారు ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారు. ఇప్పుడైనా వారు పశ్చాత్తాప పడితే అది వారికే మేలు. మరియు వారు మరలిపోతే, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ, బాధాకరమైన శిక్ష విధిస్తాడు. మరియు భూమిలో వారికి ఏ రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఉండడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنْهُم مَّنْ عَٰهَدَ ٱللَّهَ لَئِنْ ءَاتَىٰنَا مِن فَضْلِهِۦ لَنَصَّدَّقَنَّ وَلَنَكُونَنَّ مِنَ ٱلصَّٰلِحِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారిలో (కొందరు) ఈ విధంగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవారు కూడా ఉన్నారు: "ఆయన (అల్లాహ్) తన అనుగ్రహంతో మాకేమీ ప్రసాదించినా మేము తప్పక దానం చేస్తాము మరియు సద్వర్తనులమై ఉంటాము."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلَمَّآ ءَاتَىٰهُم مِّن فَضْلِهِۦ بَخِلُوا۟ بِهِۦ وَتَوَلَّوا۟ وَّهُم مُّعْرِضُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని అల్లాహ్ తన అనుగ్రహం వల్ల వారికి (ధనం) ప్రసాదించినప్పుడు, వారు పిసినారితనం ప్రదర్శించి, తమ (వాగ్దానం) నుండి విముఖులై మరలిపోతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَأَعْقَبَهُمْ نِفَاقًا فِى قُلُوبِهِمْ إِلَىٰ يَوْمِ يَلْقَوْنَهُۥ بِمَآ أَخْلَفُوا۟ ٱللَّهَ مَا وَعَدُوهُ وَبِمَا كَانُوا۟ يَكْذِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఆ పిదప వారు అల్లాహ్ తో చేసిన వాగ్దానం పూర్తి చేయనందుకు, అసత్యం పలికినందుకు, ఆయన్ను కలుసుకునే (పునరుత్థాన) దినం వరకు, ఆయన వారి హృదయాలలో కాపట్యం నాటుకునేటట్లు చేశాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ يَعْلَمُ سِرَّهُمْ وَنَجْوَىٰهُمْ وَأَنَّ ٱللَّهَ عَلَّٰمُ ٱلْغُيُوبِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారి గుప్త రహస్యాలు మరియు వారి రహస్య సమాలోచనలు , అల్లాహ్ కు తెలుసని వారికి తెలియదా? మరియు నిశ్చయంగా, అల్లాహ్ అగోచర విషయాలన్నీ తెలిసి వున్నవాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلَّذِينَ يَلْمِزُونَ ٱلْمُطَّوِّعِينَ مِنَ ٱلْمُؤْمِنِينَ فِى ٱلصَّدَقَٰتِ وَٱلَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُونَ مِنْهُمْ سَخِرَ ٱللَّهُ مِنْهُمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమనస్ఫూర్తిగా సంతోషంతో (అల్లాహ్ మార్గంలో) దానం చేసే విశ్వాసులను నిందించే వారినీ మరియు తమ శ్రమ తప్ప మరేమీ ఇవ్వటానికి లేని వారిని ఎగతాళి చేసే వారినీ, అల్లాహ్ ఎగతాళికి గురి చేస్తాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱسْتَغْفِرْ لَهُمْ أَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْ إِن تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِينَ مَرَّةً فَلَن يَغْفِرَ ٱللَّهُ لَهُمْ ذَٰلِكَ بِأَنَّهُمْ كَفَرُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْفَٰسِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ప్రవక్తా!) నీవు వారి (కపట విశ్వాసుల) క్షమాపణ కొరకు వేడుకున్నా, లేదా వారి క్షమాపణ కొరకు వేడుకోక పోయినా ఒక్కటే - ఇంకా నీవు డెబ్బైసార్లు వారి క్షమాపణ కొరకు వేడుకున్నా - అల్లాహ్ వారిని క్షమించడు.[1] ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు అల్లాహ్ అవిధేయులైన ప్రజలకు సన్మార్గం చూపడు.[2]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَرِحَ ٱلْمُخَلَّفُونَ بِمَقْعَدِهِمْ خِلَٰفَ رَسُولِ ٱللَّهِ وَكَرِهُوٓا۟ أَن يُجَٰهِدُوا۟ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ فِى سَبِيلِ ٱللَّهِ وَقَالُوا۟ لَا تَنفِرُوا۟ فِى ٱلْحَرِّ قُلْ نَارُ جَهَنَّمَ أَشَدُّ حَرًّا لَّوْ كَانُوا۟ يَفْقَهُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(తబూక్ దండయాత్రకు పోకుండా) వెనుక ఆగిపోయిన వారు, తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్ళటాన్ని నిరోధించి (తమ ఇండ్లలో) కూర్చుండి నందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధనసంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో: "ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి!" అని అన్నారు. వారితో అను: "భగభగ మండే నరకాగ్ని దీని కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది." అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది!

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَلْيَضْحَكُوا۟ قَلِيلًا وَلْيَبْكُوا۟ كَثِيرًا جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَكْسِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున ఇప్పుడు వారిని కొంత నవ్వనివ్వు మరియు వారి కర్మలకు ప్రతిఫలంగా (మున్ముందు) వారికి ఎంతో ఏడ్వవలసి ఉంది.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِن رَّجَعَكَ ٱللَّهُ إِلَىٰ طَآئِفَةٍ مِّنْهُمْ فَٱسْتَـْٔذَنُوكَ لِلْخُرُوجِ فَقُل لَّن تَخْرُجُوا۟ مَعِىَ أَبَدًا وَلَن تُقَٰتِلُوا۟ مَعِىَ عَدُوًّا إِنَّكُمْ رَضِيتُم بِٱلْقُعُودِ أَوَّلَ مَرَّةٍ فَٱقْعُدُوا۟ مَعَ ٱلْخَٰلِفِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకావున (ఓ ప్రవక్తా!) ఒకవేళ అల్లాహ్ నిన్ను తిరిగి వారిలో (కపట విశ్వాసులలో) ఒక వర్గం వారి వద్దకు తీసుకొని పోతే! మరియు వారు నిన్ను (మరొక దండయాత్రకు) పోవటానికి అనుమతి అడిగితే! వారితో అను! "మీరు నాతో ఏ మాత్రం బయలుదేర వద్దు! మరియు నా పక్షమున శత్రువులతో పోరాడనూ వద్దు! వాస్తవానికి మీరు మొదట కూర్చొని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు వెనుక ఉండి పోయిన వారితో (ఇండ్లలోనే) కూర్చొని ఉండండి."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تُصَلِّ عَلَىٰٓ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا وَلَا تَقُمْ عَلَىٰ قَبْرِهِۦٓ إِنَّهُمْ كَفَرُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَمَاتُوا۟ وَهُمْ فَٰسِقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారిలో (కపట విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏ మాత్రం చేయకు మరియు అతని గోరీ వద్ద కూడా నిలబడకు,[1] నిశ్చయంగా వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారు అవిధేయులు (ఫాసిఖూన్)గా ఉన్న స్థితిలోనే మరణించారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا تُعْجِبْكَ أَمْوَٰلُهُمْ وَأَوْلَٰدُهُمْ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ أَن يُعَذِّبَهُم بِهَا فِى ٱلدُّنْيَا وَتَزْهَقَ أَنفُسُهُمْ وَهُمْ كَٰفِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారి సిరిసంపదలు మరియు వారి సంతానం నిన్ను ఆశ్చర్యానికి గురి చేయనివ్వకూడదు. నిశ్చయంగా, అల్లాహ్! వాటితో ఈ ప్రపంచంలో వారిని శిక్షించాలనీ మరియు వారు సత్యతిరస్కారులుగా ఉన్న స్థితిలోనే వారి ప్రాణాలను కోల్పోవాలనీ సంకల్పించాడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَآ أُنزِلَتْ سُورَةٌ أَنْ ءَامِنُوا۟ بِٱللَّهِ وَجَٰهِدُوا۟ مَعَ رَسُولِهِ ٱسْتَـْٔذَنَكَ أُو۟لُوا۟ ٱلطَّوْلِ مِنْهُمْ وَقَالُوا۟ ذَرْنَا نَكُن مَّعَ ٱلْقَٰعِدِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు: "అల్లాహ్ ను విశ్వసించండి. మరియు ఆయన ప్రవక్తతో కలసి (అల్లాహ్ మార్గంలో) పోరాడండి!" అని సూరహ్ అవతరింప జేయబడి నపుడు,[1] వారిలోని ధనవంతులు నీతో: "వెనుక ఉండే వారితో కూర్చోవటానికి మమ్మల్ని విడిచి పెట్టు." అని అనుమతి కోరారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

رَضُوا۟ بِأَن يَكُونُوا۟ مَعَ ٱلْخَوَالِفِ وَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు, వెనుక ఉండిపోయే వారితో ఉండటానికి ఇష్టపడ్డారు. వారి హృదయాల మీద ముద్ర వేయబడి వుంది, కావున వారు అర్థం చేసుకోలేరు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَٰكِنِ ٱلرَّسُولُ وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ جَٰهَدُوا۟ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ وَأُو۟لَٰٓئِكَ لَهُمُ ٱلْخَيْرَٰتُ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని, ప్రవక్త మరియు అతనితో పాటు విశ్వసించిన వారు తమ సిరిసంపదలతో మరియు తమ ప్రాణాలతో (అల్లాహ్ మార్గంలో) పోరాడారు. మరియు అలాంటి వారికి అన్ని మేళ్ళూ ఉన్నాయి. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَعَدَّ ٱللَّهُ لَهُمْ جَنَّٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَا ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు సిద్ధం చేసి ఉంచాడు, వారందులో శాశ్వతంగా ఉంటారు. అదే గొప్ప విజయం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَجَآءَ ٱلْمُعَذِّرُونَ مِنَ ٱلْأَعْرَابِ لِيُؤْذَنَ لَهُمْ وَقَعَدَ ٱلَّذِينَ كَذَبُوا۟ ٱللَّهَ وَرَسُولَهُۥ سَيُصِيبُ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు సాకులు చెప్పే ఎడారి వాసులు (బద్దూలు)[1] కూడా వచ్చి వెనుక ఉండి పోవటానికి అనుమతి అడిగారు. మరియు ఈ విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు అబద్ధాలు చెప్పిన వారు కూర్చుండి పోయారు. త్వరలో సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష ఉండగలదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَّيْسَ عَلَى ٱلضُّعَفَآءِ وَلَا عَلَى ٱلْمَرْضَىٰ وَلَا عَلَى ٱلَّذِينَ لَا يَجِدُونَ مَا يُنفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُوا۟ لِلَّهِ وَرَسُولِهِۦ مَا عَلَى ٱلْمُحْسِنِينَ مِن سَبِيلٍ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadబలహీనులు మరియు వ్యాధిగ్రస్తులు మరియు ప్రయాణపు ఖర్చులు లేనివారు, ఒకవేళ అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు వాస్తవానికి విశ్వాసపాత్రులై ఉంటే వారిపై (జిహాద్ కు వెళ్ళకుంటే) ఎలాంటి నిందలేదు. సజ్జనులపై కూడా ఎలాంటి నిందలేదు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا عَلَى ٱلَّذِينَ إِذَا مَآ أَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَآ أَجِدُ مَآ أَحْمِلُكُمْ عَلَيْهِ تَوَلَّوا۟ وَّأَعْيُنُهُمْ تَفِيضُ مِنَ ٱلدَّمْعِ حَزَنًا أَلَّا يَجِدُوا۟ مَا يُنفِقُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎవరైతే నీ వద్దకు వచ్చి వాహనాలు కోరినప్పుడు నీవు వారితో: "నా దగ్గర మీకివ్వటానికి ఏ వాహనం లేదు." అని పలికినప్పుడు, ఖర్చు చేయటానికి తమ దగ్గర ఏమీ లేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగి పోయారో, అలాంటి వారిపై కూడా ఎలాంటి నింద లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّمَا ٱلسَّبِيلُ عَلَى ٱلَّذِينَ يَسْتَـْٔذِنُونَكَ وَهُمْ أَغْنِيَآءُ رَضُوا۟ بِأَن يَكُونُوا۟ مَعَ ٱلْخَوَالِفِ وَطَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని వాస్తవానికి ధనవంతులై కూడా, వెనుక కూర్చున్న వారితో ఉండటానికి ఇష్టపడి, నిన్ను అనుమతి అడిగే వారిపై తప్పక నింద గలదు. అల్లాహ్ వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాడు, కావున (తాము పోగొట్టుకునేదేమిటో) వారికి తెలియదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَعْتَذِرُونَ إِلَيْكُمْ إِذَا رَجَعْتُمْ إِلَيْهِمْ قُل لَّا تَعْتَذِرُوا۟ لَن نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّأَنَا ٱللَّهُ مِنْ أَخْبَارِكُمْ وَسَيَرَى ٱللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُۥ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلْغَيْبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు (తబూక్ దండయాత్ర నుండి) మరలి వారి వద్దకు వచ్చిన తరువాత కూడా వారు (కపటవిశ్వాసులు) మీతో తమ సాకులు చెబుతున్నారు. వారితో అను: "మీరు సాకులు చెప్పకండి, మేము మీ మాటలను నమ్మము. అల్లాహ్ మాకు మీ వృత్తాంతం తెలిపి వున్నాడు. మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీ ప్రవర్తనను కనిపెట్టగలరు, తరువాత మీరు అగోచర మరియు గోచర విషయాలు ఎరుగునట్టి ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు. అప్పుడాయన మీరు చేస్తూ ఉన్న వాటిని గురించి మీకు తెలుపుతాడు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

سَيَحْلِفُونَ بِٱللَّهِ لَكُمْ إِذَا ٱنقَلَبْتُمْ إِلَيْهِمْ لِتُعْرِضُوا۟ عَنْهُمْ فَأَعْرِضُوا۟ عَنْهُمْ إِنَّهُمْ رِجْسٌ وَمَأْوَىٰهُمْ جَهَنَّمُ جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَكْسِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ విశ్వాసులారా!) మీరు వారి వద్దకు మరలి వచ్చిన తరువాత వారిని వదలి పెట్టాలని (మీరు వారిపై చర్య తీసుకో గూడదని), వారు మీ ముందు అల్లాహ్ పేరుతో ప్రమాణాలు చేస్తారు. కావున మీరు వారి నుండి విముఖులు కండి. నిశ్చయంగా, వారు అశుచులు (మాలిన్యం వంటివారు). వారి నివాసం నరకమే. అదే వారు అర్జించిన దాని ఫలితం.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَحْلِفُونَ لَكُمْ لِتَرْضَوْا۟ عَنْهُمْ فَإِن تَرْضَوْا۟ عَنْهُمْ فَإِنَّ ٱللَّهَ لَا يَرْضَىٰ عَنِ ٱلْقَوْمِ ٱلْفَٰسِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమీరు వారితో రాజీ పడాలని, వారు (కపట విశ్వాసులు) మీ ముందు ప్రమాణాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు వారితో రాజీ పడినా, నిశ్చయంగా, అల్లాహ్ అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలతో రాజీ పడడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلْأَعْرَابُ أَشَدُّ كُفْرًا وَنِفَاقًا وَأَجْدَرُ أَلَّا يَعْلَمُوا۟ حُدُودَ مَآ أَنزَلَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఎడారివాసులు (బద్దూలు) సత్యతిరస్కార మరియు కపట విశ్వాస విషయాలలో అతి కఠినులు. వారు అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన (ధర్మ) నియమాలు అర్థం చేసుకునే యోగ్యత లేనివారు.[1] మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنَ ٱلْأَعْرَابِ مَن يَتَّخِذُ مَا يُنفِقُ مَغْرَمًا وَيَتَرَبَّصُ بِكُمُ ٱلدَّوَآئِرَ عَلَيْهِمْ دَآئِرَةُ ٱلسَّوْءِ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసిన దానిని దండుగగా భావించే వారున్నారు. (ఓ విశ్వాసులారా!) మీరు ఆపదలలో చిక్కుకోవాలని వారు ఎదురు చూస్తున్నారు. (కాని) వారినే ఆపద చుట్టుకుంటుంది. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِنَ ٱلْأَعْرَابِ مَن يُؤْمِنُ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَيَتَّخِذُ مَا يُنفِقُ قُرُبَٰتٍ عِندَ ٱللَّهِ وَصَلَوَٰتِ ٱلرَّسُولِ أَلَآ إِنَّهَا قُرْبَةٌ لَّهُمْ سَيُدْخِلُهُمُ ٱللَّهُ فِى رَحْمَتِهِۦٓ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారున్నారు.[1] వారు తాము (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేసేది, తమకు అల్లాహ్ సాన్నిధ్యాన్ని మరియు ప్రవక్త ప్రార్థనలను చేకూర్చటానికి సాధనంగా చేసుకుంటున్నారు. వాస్తవానికి అది వారికి తప్పక సాన్నిధ్యాన్ని చేకూర్చుతుంది. అల్లాహ్ వారిని తన కారుణ్యంలోకి చేర్చుకోగలడు. నిశ్చయంగా! అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلسَّٰبِقُونَ ٱلْأَوَّلُونَ مِنَ ٱلْمُهَٰجِرِينَ وَٱلْأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحْسَٰنٍ رَّضِىَ ٱللَّهُ عَنْهُمْ وَرَضُوا۟ عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّٰتٍ تَجْرِى تَحْتَهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدًا ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం).

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمِمَّنْ حَوْلَكُم مِّنَ ٱلْأَعْرَابِ مُنَٰفِقُونَ وَمِنْ أَهْلِ ٱلْمَدِينَةِ مَرَدُوا۟ عَلَى ٱلنِّفَاقِ لَا تَعْلَمُهُمْ نَحْنُ نَعْلَمُهُمْ سَنُعَذِّبُهُم مَّرَّتَيْنِ ثُمَّ يُرَدُّونَ إِلَىٰ عَذَابٍ عَظِيمٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మీ చుట్టుప్రక్కల ఉండే ఎడారివాసులలో (బద్దూలలో) కొందరు కపట విశ్వాసులున్నారు. మరియు (ప్రవక్త) నగరం (మదీనా మునవ్వరా)లో కూడా (కపటవిశ్వాసులు) ఉన్నారు.[1] వారు తమ కాపట్యంలో నాటుకొని ఉన్నారు. కాని (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఎరుగవు.[2] మేము వారిని ఎరుగుతాము. మేము వారికి రెట్టింపు శిక్షను విధించగలము. తరువాత వారు ఘోరశిక్ష వైపుకు మరలింపబడతారు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَءَاخَرُونَ ٱعْتَرَفُوا۟ بِذُنُوبِهِمْ خَلَطُوا۟ عَمَلًا صَٰلِحًا وَءَاخَرَ سَيِّئًا عَسَى ٱللَّهُ أَن يَتُوبَ عَلَيْهِمْ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇతరులు, తమ పాపాలను ఒప్పుకున్న వారున్నారు. వారు తమ సత్కార్యాన్ని ఇతర పాపకార్యంతో కలిపారు.[1] అల్లాహ్ వారిని తప్పక[2] క్షమిస్తాడు! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

خُذْ مِنْ أَمْوَٰلِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيْهِمْ إِنَّ صَلَوٰتَكَ سَكَنٌ لَّهُمْ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు. మరియు వారి కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు. మరియు నిశ్చయంగా, నీ ప్రార్థనలు వారికి మనశ్శాంతిని కలిగిస్తాయి. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَلَمْ يَعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ هُوَ يَقْبَلُ ٱلتَّوْبَةَ عَنْ عِبَادِهِۦ وَيَأْخُذُ ٱلصَّدَقَٰتِ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వాస్తవానికి అల్లాహ్ తన దాసుల పశ్చాత్తాపాన్ని (తౌబహ్ ను) అంగీకరిస్తాడని మరియు వారి దానాలను (సదఖాత్ లను) స్వీకరిస్తాడని వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَقُلِ ٱعْمَلُوا۟ فَسَيَرَى ٱللَّهُ عَمَلَكُمْ وَرَسُولُهُۥ وَٱلْمُؤْمِنُونَ وَسَتُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلْغَيْبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (ఓ ప్రవక్తా!) వారితో అను: "మీరు (మీ పని) చేస్తూ ఉండండి, అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు మీరు చేస్తున్న పనులు చూస్తున్నారు. తరువాత మీరు తప్పక అగోచర మరియు గోచర విషయాలను ఎరుగు ఆయన (అల్లాహ్) వద్దకు తిరిగి పంపబడగలరు. అప్పుడాయన మీరు చేస్తూ వున్న కర్మలను గురించి మీకు తెలియజేస్తాడు."

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَءَاخَرُونَ مُرْجَوْنَ لِأَمْرِ ٱللَّهِ إِمَّا يُعَذِّبُهُمْ وَإِمَّا يَتُوبُ عَلَيْهِمْ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరికొందరు అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) కొరకు వేచి ఉన్నారు. ఆయన వారిని శిక్షించనూ వచ్చు, లేదా క్షమించనూ వచ్చు! మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَٱلَّذِينَ ٱتَّخَذُوا۟ مَسْجِدًا ضِرَارًا وَكُفْرًا وَتَفْرِيقًۢا بَيْنَ ٱلْمُؤْمِنِينَ وَإِرْصَادًا لِّمَنْ حَارَبَ ٱللَّهَ وَرَسُولَهُۥ مِن قَبْلُ وَلَيَحْلِفُنَّ إِنْ أَرَدْنَآ إِلَّا ٱلْحُسْنَىٰ وَٱللَّهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَٰذِبُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (కపట విశ్వాసులలో) కొందరు (విశ్వాసులకు) హాని కలిగించటానికి, సత్యతిరస్కార వైఖరిని (బలపరచటానికి) మరియు విశ్వాసులను విడదీయటానికి, అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో ఇంతకు ముందు పోరాడిన వారు పొంచి ఉండటానికి, ఒక మస్జిద్ నిర్మించారు. మరియు వారు: "మా ఉద్దేశం మేలు చేయటం తప్ప మరేమీ కాదు!" అని గట్టి ప్రమాణాలు కూడా చేస్తున్నారు.[1] కాని వారు వాస్తవంగా అసత్యవాదులని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا تَقُمْ فِيهِ أَبَدًا لَّمَسْجِدٌ أُسِّسَ عَلَى ٱلتَّقْوَىٰ مِنْ أَوَّلِ يَوْمٍ أَحَقُّ أَن تَقُومَ فِيهِ فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا۟ وَٱللَّهُ يُحِبُّ ٱلْمُطَّهِّرِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనీవెన్నడూ దానిలో (నమాజ్ కు) నిలబడకు. మొదటి రోజు నుండియే దైవభీతి ఆధారంగా స్థాపించబడిన మస్జిదే నీకు (నమాజ్ కు) నిలబడటానికి తగినది. అందులో పరిశుద్ధులు కాగోరేవారున్నారు. మరియు అల్లాహ్ పరిశుద్ధులు కాగోరేవారిని ప్రేమిస్తాడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَفَمَنْ أَسَّسَ بُنْيَٰنَهُۥ عَلَىٰ تَقْوَىٰ مِنَ ٱللَّهِ وَرِضْوَٰنٍ خَيْرٌ أَم مَّنْ أَسَّسَ بُنْيَٰنَهُۥ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٍ فَٱنْهَارَ بِهِۦ فِى نَارِ جَهَنَّمَ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّٰلِمِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? ఎవడైతే అల్లాహ్ యందు గల భయభక్తులు మరియు ఆయన ప్రీతి, పునాదుల మీద తన (మస్జిద్) కట్టడాన్ని కట్టాడో, అతడు శ్రేష్ఠుడా? లేక, తన కట్టడపు పునాదులను, వరదలకు కూలిపోయి దాని క్రింది భాగం ఖాళీగా ఉన్న నది ఒడ్డున కట్టేవాడా? అది వానితో సహా నరకాగ్నిలోకి కొట్టుకొని పోతుంది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَا يَزَالُ بُنْيَٰنُهُمُ ٱلَّذِى بَنَوْا۟ رِيبَةً فِى قُلُوبِهِمْ إِلَّآ أَن تَقَطَّعَ قُلُوبُهُمْ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారి హృదయాలు ముక్కలైపోయి (వారు చనిపోయి) నంత వరకు, వారు కట్టిన కట్టడం వారి హృదయాలలో కలతలు పుట్టిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱللَّهَ ٱشْتَرَىٰ مِنَ ٱلْمُؤْمِنِينَ أَنفُسَهُمْ وَأَمْوَٰلَهُم بِأَنَّ لَهُمُ ٱلْجَنَّةَ يُقَٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ فَيَقْتُلُونَ وَيُقْتَلُونَ وَعْدًا عَلَيْهِ حَقًّا فِى ٱلتَّوْرَىٰةِ وَٱلْإِنجِيلِ وَٱلْقُرْءَانِ وَمَنْ أَوْفَىٰ بِعَهْدِهِۦ مِنَ ٱللَّهِ فَٱسْتَبْشِرُوا۟ بِبَيْعِكُمُ ٱلَّذِى بَايَعْتُم بِهِۦ وَذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను కొన్నాడు. కాబట్టి నిశ్చయంగా, వారి కొరకు స్వర్గముంది. వారు అల్లాహ్ మార్గంలో పోరాడి (తమ శత్రువులను) చంపుతారు మరియు చంపబడతారు. మరియు ఇది తౌరాత్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్ లలో, ఆయన (అల్లాహ్) చేసిన వాగ్దానం, సత్యమైనది. మరియు తన వాగ్దానాన్ని నెరవేర్చటంలో అల్లాహ్ ను మించిన వాడు ఎవడు? కావున మీరు ఆయనతో చేసిన వ్యాపారానికి సంతోషపడండి. మరియు ఇదే ఆ గొప్ప విజయం.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ٱلتَّٰٓئِبُونَ ٱلْعَٰبِدُونَ ٱلْحَٰمِدُونَ ٱلسَّٰٓئِحُونَ ٱلرَّٰكِعُونَ ٱلسَّٰجِدُونَ ٱلْـَٔامِرُونَ بِٱلْمَعْرُوفِ وَٱلنَّاهُونَ عَنِ ٱلْمُنكَرِ وَٱلْحَٰفِظُونَ لِحُدُودِ ٱللَّهِ وَبَشِّرِ ٱلْمُؤْمِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(వీరే అల్లాహ్ ముందు) పశ్చాత్తాప పడేవారు, ఆయనను ఆరాధించేవారు, స్తుతించేవారు (అల్లాహ్ మార్గంలో) సంచరించేవారు (ఉపవాసాలు చేసేవారు).[1] ఆయన సన్నిధిలో వంగే (రుకూఉ చేసే) వారు, సాష్టాంగం (సజ్దా) చేసేవారు, ధర్మమును ఆదేశించేవారు మరియు ఆధర్మమును నిషేధించేవారు[2] మరియు అల్లాహ్ విధించిన హద్దును పాటించేవారు కూడాను. మరియు విశ్వాసులకు శుభవార్త తెలుపు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا كَانَ لِلنَّبِىِّ وَٱلَّذِينَ ءَامَنُوٓا۟ أَن يَسْتَغْفِرُوا۟ لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوٓا۟ أُو۟لِى قُرْبَىٰ مِنۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمْ أَنَّهُمْ أَصْحَٰبُ ٱلْجَحِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅల్లాహ్ కు సాటి కల్పించే వారు (ముష్రికులు), దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించటం తగదు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا كَانَ ٱسْتِغْفَارُ إِبْرَٰهِيمَ لِأَبِيهِ إِلَّا عَن مَّوْعِدَةٍ وَعَدَهَآ إِيَّاهُ فَلَمَّا تَبَيَّنَ لَهُۥٓ أَنَّهُۥ عَدُوٌّ لِّلَّهِ تَبَرَّأَ مِنْهُ إِنَّ إِبْرَٰهِيمَ لَأَوَّٰهٌ حَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఇబ్రాహీమ్ తన తండ్రి క్షమాపణ కొరకు ప్రార్థించింది కేవలం అతను అతడి (తన తండ్రి)తో చేసిన వాగ్దానం వల్లనే.[1] కాని అతనికి, అతడు (తన తండ్రి) నిశ్చయంగా అల్లాహ్ కు శత్రువని స్పష్టమైనప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అతడిని విడనాడాడు. వాస్తవానికి ఇబ్రాహీమ్ వినయ విధేయతలతో (అల్లాహ్ ను) అర్థించేవాడు,[2] సహనశీలుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا كَانَ ٱللَّهُ لِيُضِلَّ قَوْمًۢا بَعْدَ إِذْ هَدَىٰهُمْ حَتَّىٰ يُبَيِّنَ لَهُم مَّا يَتَّقُونَ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఒక జాతికి సన్మార్గం చూపిన తరువాత వారు దూరంగా ఉండవలసిన విషయాలను గురించి వారికి స్పష్టంగా తెలుపనంత వరకు, అల్లాహ్ వారిని మార్గభ్రష్టత్వంలో పడవేయడు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

إِنَّ ٱللَّهَ لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ يُحْىِۦ وَيُمِيتُ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِىٍّ وَلَا نَصِيرٍ

Telugu Translation - Abdurrahim ibn Muhammadనిశ్చయంగా, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. మరియు అల్లాహ్ తప్ప మీకు వేరే రక్షకుడు గానీ సహాయకుడు గానీ ఎవ్వడూ లేడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَّقَد تَّابَ ٱللَّهُ عَلَى ٱلنَّبِىِّ وَٱلْمُهَٰجِرِينَ وَٱلْأَنصَارِ ٱلَّذِينَ ٱتَّبَعُوهُ فِى سَاعَةِ ٱلْعُسْرَةِ مِنۢ بَعْدِ مَا كَادَ يَزِيغُ قُلُوبُ فَرِيقٍ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَيْهِمْ إِنَّهُۥ بِهِمْ رَءُوفٌ رَّحِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని (ముహాజిర్ లను) మరియు అన్సార్ లను, ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో! అలాంటి వారినందరినీ క్షమించాడు.[1] వారిలో ఒక పక్షం వారి హృదయాలు, దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ (ప్రవక్త వెంట వెళ్ళారు), అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయన వారి పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَعَلَى ٱلثَّلَٰثَةِ ٱلَّذِينَ خُلِّفُوا۟ حَتَّىٰٓ إِذَا ضَاقَتْ عَلَيْهِمُ ٱلْأَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَيْهِمْ أَنفُسُهُمْ وَظَنُّوٓا۟ أَن لَّا مَلْجَأَ مِنَ ٱللَّهِ إِلَّآ إِلَيْهِ ثُمَّ تَابَ عَلَيْهِمْ لِيَتُوبُوٓا۟ إِنَّ ٱللَّهَ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వెనుక ఉండి పోయిన ఆ ముగ్గురిని కూడా (ఆయన క్షమించాడు).[1] చివరకు విశాలంగా ఉన్న భూమి కూడా వారికి ఇరుకై పోయింది. మరియు వారి ప్రాణాలు కూడా వారికి భారమయ్యాయి. అల్లాహ్ నుండి (తమను కాపాడుకోవటానికి) ఆయన శరణం తప్ప మరొకటి లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు - వారు పశ్చాత్తాప పడాలని. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَكُونُوا۟ مَعَ ٱلصَّٰدِقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు సత్యవంతులతో ఉండండి.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

مَا كَانَ لِأَهْلِ ٱلْمَدِينَةِ وَمَنْ حَوْلَهُم مِّنَ ٱلْأَعْرَابِ أَن يَتَخَلَّفُوا۟ عَن رَّسُولِ ٱللَّهِ وَلَا يَرْغَبُوا۟ بِأَنفُسِهِمْ عَن نَّفْسِهِۦ ذَٰلِكَ بِأَنَّهُمْ لَا يُصِيبُهُمْ ظَمَأٌ وَلَا نَصَبٌ وَلَا مَخْمَصَةٌ فِى سَبِيلِ ٱللَّهِ وَلَا يَطَـُٔونَ مَوْطِئًا يَغِيظُ ٱلْكُفَّارَ وَلَا يَنَالُونَ مِنْ عَدُوٍّ نَّيْلًا إِلَّا كُتِبَ لَهُم بِهِۦ عَمَلٌ صَٰلِحٌ إِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُحْسِنِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమదీనా పురవాసులకు మరియు చుట్టుప్రక్కలలో ఉండే ఎడారి వాసులకు (బద్దూలకు) అల్లాహ్ ప్రవక్తను వదలి వెనుక ఉండి పోవటం మరియు తమ ప్రాణాలకు అతని (దైవప్రవక్త) ప్రాణాలపై ఆధిక్యత నివ్వటం తగిన పని కాదు. ఎందుకంటే అల్లాహ్ మార్గంలో వారు ఆకలి దప్పులు, (శారీరక) కష్టాలు సహిస్తే, శత్రువుల భూమిలోకి దూరి సత్యతిరస్కారుల కోపాన్ని రేకెత్తిస్తే మరియు శత్రువుల నుండి ఏదైనా సాధిస్తే,[1] దానికి బదులుగా వారికి ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనుల ఫలితాన్ని వ్యర్థ పరచడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَلَا يُنفِقُونَ نَفَقَةً صَغِيرَةً وَلَا كَبِيرَةً وَلَا يَقْطَعُونَ وَادِيًا إِلَّا كُتِبَ لَهُمْ لِيَجْزِيَهُمُ ٱللَّهُ أَحْسَنَ مَا كَانُوا۟ يَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు (అల్లాహ్ మార్గంలో) వారు ఖర్చు చేసే ధనం కొంచెమైనా లేదా అధికమైనా లేక వారు (శ్రమపడి) కొండలోయలను దాటే విషయమూ, అంతా వారి కొరకు వ్రాయబడకుండా ఉండదు - వారు చేస్తూ ఉండిన ఈ సత్కార్యాల కొరకు - అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَمَا كَانَ ٱلْمُؤْمِنُونَ لِيَنفِرُوا۟ كَآفَّةً فَلَوْلَا نَفَرَ مِن كُلِّ فِرْقَةٍ مِّنْهُمْ طَآئِفَةٌ لِّيَتَفَقَّهُوا۟ فِى ٱلدِّينِ وَلِيُنذِرُوا۟ قَوْمَهُمْ إِذَا رَجَعُوٓا۟ إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు విశ్వాసులందరూ (పోరాటానికి) బయలు దేరటం సరికాదు. కావున వారిలో ప్రతి తెగ నుండి కొందరు ధర్మజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పోయి, వారు వారి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తమ జాతి (ప్రాంత) ప్రజలను హెచ్చరిస్తే! బహుశా వారు కూడా తమను తాము (దుర్మార్గం నుండి) కాపాడు కోగలరు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ قَٰتِلُوا۟ ٱلَّذِينَ يَلُونَكُم مِّنَ ٱلْكُفَّارِ وَلْيَجِدُوا۟ فِيكُمْ غِلْظَةً وَٱعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ مَعَ ٱلْمُتَّقِينَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! మీ దగ్గరున్న సత్యతిరస్కారులతో పోరాడి, వారిని మీలో నున్న కాఠిన్యాన్ని గ్రహించనివ్వండి.[1] మరియు నిశ్చయంగా, అల్లాహ్ దైవభీతి గల వారితో ఉంటాడని తెలుసుకోండి.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا مَآ أُنزِلَتْ سُورَةٌ فَمِنْهُم مَّن يَقُولُ أَيُّكُمْ زَادَتْهُ هَٰذِهِۦٓ إِيمَٰنًا فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ فَزَادَتْهُمْ إِيمَٰنًا وَهُمْ يَسْتَبْشِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఒక సూరహ్ అవతరింప జేయబడినప్పుడల్లా వారి (కపట విశ్వాసుల) లో కొందరు: "ఇది మీలో ఎవరి విశ్వాసాన్ని అధికం చేసింది?" అని అడుగుతారు. కాని వాస్తవానికి అది విశ్వసించిన వారందరి విశ్వాసాన్ని అధికం చేస్తుంది. మరియు వారు దానితో సంతోషపడతారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَأَمَّا ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا إِلَىٰ رِجْسِهِمْ وَمَاتُوا۟ وَهُمْ كَٰفِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadకాని ఎవరి హృదయాలలో రోగముందో, ఇది వారి మాలిన్యంలో మరింత మాలిన్యాన్ని అధికం చేస్తుంది. మరియు వారు సత్యతిరస్కారులుగానే మరణిస్తారు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

أَوَلَا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِى كُلِّ عَامٍ مَّرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لَا يَتُوبُونَ وَلَا هُمْ يَذَّكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఏమీ? వారు ప్రతి సంవత్సరం ఒకసారి లేక రెండుసార్లు (బాధలతో) పరీక్షింప బడటాన్ని గమనించటం లేదా? అయినా వారు పశ్చాత్తాప పడటం లేదు మరియు గుణపాఠం కూడా నేర్చుకోవటం లేదు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

وَإِذَا مَآ أُنزِلَتْ سُورَةٌ نَّظَرَ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ هَلْ يَرَىٰكُم مِّنْ أَحَدٍ ثُمَّ ٱنصَرَفُوا۟ صَرَفَ ٱللَّهُ قُلُوبَهُم بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు ఏదైనా సూరహ్ అవతరించినపుడల్లా వారు ఒకరినొకరు చూసుకుంటూ (అంటారు): "ఎవడైనా మిమ్మల్ని చూస్తున్నాడా?" ఆ తరువాత అక్కడి నుండి మెల్లగా జారుకుంటారు. అల్లాహ్ వారి హృదయాలను (సన్మార్గం నుండి) మళ్ళించాడు. ఎందుకంటే నిశ్చయంగా, వారు అర్థం చేసుకోలేని జనులు.[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

لَقَدْ جَآءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِٱلْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ప్రజలారా!) వాస్తవానికి, మీ వద్దకు మీలో నుంచే ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి ఉన్నాడు;[1] మీరు ఆపదకు గురి కావటం అతనికి కష్టం కలిగిస్తుంది; అతను మీ మేలు కోరేవాడు, విశ్వాసుల ఎడల కనికరుడు, కరుణామయుడు.

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

فَإِن تَوَلَّوْا۟ فَقُلْ حَسْبِىَ ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ عَلَيْهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ ٱلْعَرْشِ ٱلْعَظِيمِ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఅయినా వారు విముఖులైతే, వారితో అను: "నాకు అల్లాహ్ చాలు! ఆయన తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు! నేను ఆయననే నమ్ముకున్నాను. మరియు ఆయనే సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు."[1]

ఈ ఆయత్ యొక్క అన్ని అనువాదాలను చూడండి →

ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70