caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-An'aam, ఆయత్ 151

మక్కా · అవతరణ క్రమం 55 · 6:151

قُلْ تَعَالَوْا۟ أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ أَلَّا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًٔا وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَٰنًا وَلَا تَقْتُلُوٓا۟ أَوْلَٰدَكُم مِّنْ إِمْلَٰقٍ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ وَلَا تَقْرَبُوا۟ ٱلْفَوَٰحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَلَا تَقْتُلُوا۟ ٱلنَّفْسَ ٱلَّتِى حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلْحَقِّ ذَٰلِكُمْ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمْ تَعْقِلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadఇలా అను: "రండి మీ ప్రభువు మీకు నిషేధించి వున్న వాటిని మీకు వినిపిస్తాను: 'మీరు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి[1]. మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి[2]. మేమే మీకూ మరియు వారికి కూడా జీవనోపాధిని ఇచ్చేవారము. మరియు బహిరంగంగా గానీ, లేదా దొంగచాటుగా గానీ అశ్లీలమైన (సిగ్గుమాలిన) పనులను సమీపించకండి. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని, న్యాయం కొరకు తప్ప చంపకండి[3]. మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70