caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-An'aam, ఆయత్ 152

మక్కా · అవతరణ క్రమం 55 · 6:152

وَلَا تَقْرَبُوا۟ مَالَ ٱلْيَتِيمِ إِلَّا بِٱلَّتِى هِىَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُۥ وَأَوْفُوا۟ ٱلْكَيْلَ وَٱلْمِيزَانَ بِٱلْقِسْطِ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا وَإِذَا قُلْتُمْ فَٱعْدِلُوا۟ وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ وَبِعَهْدِ ٱللَّهِ أَوْفُوا۟ ذَٰلِكُمْ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad" 'మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని, బాగుపరచటానికి తప్ప ఇతర ఉద్దేశ్యంతో సమీపించకండి. కొలవటంలో మరియు తూచటంలో న్యాయాన్ని పాటించండి. ఏ ప్రాణిపై గడూ మేము దాని శక్తికి మించిన భారాన్ని మోపము. పలికితే న్యాయమే పలకండి. అది మీ దగ్గరి బంధువుకు (ప్రతికూలమైనది) అయినా సరే! అల్లాహ్ తో చేసిన ఒడంబడికను పూర్తి చేయండి. మీరు హితోపదేశం స్వీకరించాలని ఆయన మీకు ఈ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాడు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70