قُلْ هَلُمَّ شُهَدَآءَكُمُ ٱلَّذِينَ يَشْهَدُونَ أَنَّ ٱللَّهَ حَرَّمَ هَٰذَا فَإِن شَهِدُوا۟ فَلَا تَشْهَدْ مَعَهُمْ وَلَا تَتَّبِعْ أَهْوَآءَ ٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا وَٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ وَهُم بِرَبِّهِمْ يَعْدِلُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఇంకా) ఇలా అను: " 'నిశ్చయంగా, అల్లాహ్ ఈ వస్తువులను నిషేధించాడు.' అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకొని రండి." ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే, నీవు వారితో కలిసి సాక్ష్యమివ్వకు. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించే వారి మరియు పరలోకము నందు విశ్వాసం లేని వారి మరియు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి మనోవాంఛలను నీవు ఏ మాత్రం అనుసరించకు!