caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 46

మదీనా · అవతరణ క్రమం 92 · 4:46

مِّنَ ٱلَّذِينَ هَادُوا۟ يُحَرِّفُونَ ٱلْكَلِمَ عَن مَّوَاضِعِهِۦ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَٱسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَٰعِنَا لَيًّۢا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِى ٱلدِّينِ وَلَوْ أَنَّهُمْ قَالُوا۟ سَمِعْنَا وَأَطَعْنَا وَٱسْمَعْ وَٱنظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَٰكِن لَّعَنَهُمُ ٱللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadయూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: "మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి'అనా వ 'అ'సయ్ నా)." అనీ; మరియు: "విను! నీ మాట వినకబోవు గాక! (వస్ మ 'అ 'గైర మస్ మ'ఇన్)."[1] అనీ; మరియు (ఓ ముహమ్మద్!) నీవు మా మాట విను (రా'ఇనా) [2] అనీ తమ నాలుకలను మెలి త్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: "విన్నాము, విధేయులమయ్యాము. (సమి'అనా వ అ'త'అనా)." అనీ; మరియు: "మమ్మల్ని విను మరియు మా దిక్కుచూడు / మాకు వ్యవధినివ్వు (వస్ మ'అ వన్'జుర్ నా)," అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70