caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 176

మదీనా · అవతరణ క్రమం 92 · 4:176

يَسْتَفْتُونَكَ قُلِ ٱللَّهُ يُفْتِيكُمْ فِى ٱلْكَلَٰلَةِ إِنِ ٱمْرُؤٌا۟ هَلَكَ لَيْسَ لَهُۥ وَلَدٌ وَلَهُۥٓ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ وَهُوَ يَرِثُهَآ إِن لَّمْ يَكُن لَّهَا وَلَدٌ فَإِن كَانَتَا ٱثْنَتَيْنِ فَلَهُمَا ٱلثُّلُثَانِ مِمَّا تَرَكَ وَإِن كَانُوٓا۟ إِخْوَةً رِّجَالًا وَنِسَآءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ ٱلْأُنثَيَيْنِ يُبَيِّنُ ٱللَّهُ لَكُمْ أَن تَضِلُّوا۟ وَٱللَّهُ بِكُلِّ شَىْءٍ عَلِيمٌۢ

Telugu Translation - Abdurrahim ibn Muhammadవారు నిన్ను, (కలాలను) గురించి ధార్మిక శాసనం (ఫత్వా) అడుగుతున్నారు. అల్లాహ్ మీకు, కలాలను[1] గురించి, ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు: "ఒక పురుషుడు మరణించి, అతనికి సంతానం లేకుండా ఒక సోదరి[2] మాత్రమే ఉంటే, అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగం వాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి, అతడు (ఆమె నిజ సోదరుడు) వారసుడవుతాడు. అతనికి (మృతునికి) ఇద్దరు సోదరీమణులు ఉంటే, వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు (అనేకులుంటే) ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70