أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوٓا۟ أَيْدِيَكُمْ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتُوا۟ ٱلزَّكَوٰةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ ٱلْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ ٱلنَّاسَ كَخَشْيَةِ ٱللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً وَقَالُوا۟ رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا ٱلْقِتَالَ لَوْلَآ أَخَّرْتَنَآ إِلَىٰٓ أَجَلٍ قَرِيبٍ قُلْ مَتَٰعُ ٱلدُّنْيَا قَلِيلٌ وَٱلْـَٔاخِرَةُ خَيْرٌ لِّمَنِ ٱتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammad"మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: "ఓ మా ప్రభూ! యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు?[1] అని అంటారు. వారితో ఇలా అను: "ఇహలోక సుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు.