caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 171

మదీనా · అవతరణ క్రమం 92 · 4:171

يَٰٓأَهْلَ ٱلْكِتَٰبِ لَا تَغْلُوا۟ فِى دِينِكُمْ وَلَا تَقُولُوا۟ عَلَى ٱللَّهِ إِلَّا ٱلْحَقَّ إِنَّمَا ٱلْمَسِيحُ عِيسَى ٱبْنُ مَرْيَمَ رَسُولُ ٱللَّهِ وَكَلِمَتُهُۥٓ أَلْقَىٰهَآ إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ فَـَٔامِنُوا۟ بِٱللَّهِ وَرُسُلِهِۦ وَلَا تَقُولُوا۟ ثَلَٰثَةٌ ٱنتَهُوا۟ خَيْرًا لَّكُمْ إِنَّمَا ٱللَّهُ إِلَٰهٌ وَٰحِدٌ سُبْحَٰنَهُۥٓ أَن يَكُونَ لَهُۥ وَلَدٌ لَّهُۥ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ గ్రంథప్రజలారా! మీరు మీ ధర్మ విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి.[1] మరియు అల్లాహ్ ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ (ఏసు క్రీస్తు), అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన (అల్లాహ్) మర్యమ్ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్) యొక్క ఆజ్ఞ (కలిమ)[2] మరియు ఆయన (అల్లాహ్) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూహ్). కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు (ఆరాధ్య దైవాలు): "ముగ్గురు!" అని అనకండి.[3] అది మానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70