caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా An-Nisaa, ఆయత్ 127

మదీనా · అవతరణ క్రమం 92 · 4:127

وَيَسْتَفْتُونَكَ فِى ٱلنِّسَآءِ قُلِ ٱللَّهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِى ٱلْكِتَٰبِ فِى يَتَٰمَى ٱلنِّسَآءِ ٱلَّٰتِى لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَٱلْمُسْتَضْعَفِينَ مِنَ ٱلْوِلْدَٰنِ وَأَن تَقُومُوا۟ لِلْيَتَٰمَىٰ بِٱلْقِسْطِ وَمَا تَفْعَلُوا۟ مِنْ خَيْرٍ فَإِنَّ ٱللَّهَ كَانَ بِهِۦ عَلِيمًا

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "అల్లాహ్ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: 'అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్) ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడ గోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథ పిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుపబడుతోంది.'[1] మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పకుండా తెలుస్తుంది."
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70