يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تُبْطِلُوا۟ صَدَقَٰتِكُم بِٱلْمَنِّ وَٱلْأَذَىٰ كَٱلَّذِى يُنفِقُ مَالَهُۥ رِئَآءَ ٱلنَّاسِ وَلَا يُؤْمِنُ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ فَمَثَلُهُۥ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُۥ وَابِلٌ فَتَرَكَهُۥ صَلْدًا لَّا يَقْدِرُونَ عَلَىٰ شَىْءٍ مِّمَّا كَسَبُوا۟ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْكَٰفِرِينَ
Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! (కేవలం) పరులకు చూపటానికి, తన ధనం ఖర్చు చేస్తూ అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించని వాని మాదిరిగా! మీరూ చేసిన మేలును చెప్పుకొని (ఉపకారం పొందిన వారిని) కష్టపెట్టి, మీ దానధర్మాలను వ్యర్థ పరచుకోకండి. ఇలాంటి వాని పోలిక మట్టి కప్పుకున్న ఒక నున్నని బండపై భారీ వర్షం కురిసి (మట్టి కొట్టుకుపోగా) అది ఉత్తగా మిగిలి పోయినట్లుగా ఉంటుంది. [1] ఇలాంటి వారు తాము సంపాదించిన దాని నుండి ఏమీ చేయలేరు. మరియు అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.