caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-An'aam, ఆయత్ 93

మక్కా · అవతరణ క్రమం 55 · 6:93

وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوْ قَالَ أُوحِىَ إِلَىَّ وَلَمْ يُوحَ إِلَيْهِ شَىْءٌ وَمَن قَالَ سَأُنزِلُ مِثْلَ مَآ أَنزَلَ ٱللَّهُ وَلَوْ تَرَىٰٓ إِذِ ٱلظَّٰلِمُونَ فِى غَمَرَٰتِ ٱلْمَوْتِ وَٱلْمَلَٰٓئِكَةُ بَاسِطُوٓا۟ أَيْدِيهِمْ أَخْرِجُوٓا۟ أَنفُسَكُمُ ٱلْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ ٱلْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى ٱللَّهِ غَيْرَ ٱلْحَقِّ وَكُنتُمْ عَنْ ءَايَٰتِهِۦ تَسْتَكْبِرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అల్లాహ్ పై అబద్ధపు నింద మోపే వాని కంటే, లేదా తనపై ఏ దివ్య జ్ఞానం (వహీ) అవతరించక పోయినప్పటికీ: "నాపై దివ్యజ్ఞానం అవతరింప జేయబడుతుంది." అని చేప్పేవాని కంటే, లేదా: "అల్లాహ్ అవతరింప జేసినటువంటి విషయాలను నేను కూడా అవతరింపజేయగలను." అని పలికే వాని కంటే, మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!"[1] అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది![2]
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70