سَيَقُولُ ٱلْمُخَلَّفُونَ إِذَا ٱنطَلَقْتُمْ إِلَىٰ مَغَانِمَ لِتَأْخُذُوهَا ذَرُونَا نَتَّبِعْكُمْ يُرِيدُونَ أَن يُبَدِّلُوا۟ كَلَٰمَ ٱللَّهِ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمْ قَالَ ٱللَّهُ مِن قَبْلُ فَسَيَقُولُونَ بَلْ تَحْسُدُونَنَا بَلْ كَانُوا۟ لَا يَفْقَهُونَ إِلَّا قَلِيلًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadఇక మీరు మీ విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు, వెనుక ఉండి పోయిన వారు ఇలా అంటారు: "మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి."[1] వారు అల్లాహ్ ఉత్తరువును మార్చగోరుతున్నారు.[2] వారితో అను: "మీరు మా వెంట రాజాలరు; మీ గురించి అల్లాహ్ ముందే ఈ విధంగా చెప్పాడు." అప్పుడు వారు ఇలా అంటారు: "అది కాదు! మీరు మా మీద అసూయ పడుతున్నారు." అలా కాదు! వారు వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ.