يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِذَا ضَرَبْتُمْ فِى سَبِيلِ ٱللَّهِ فَتَبَيَّنُوا۟ وَلَا تَقُولُوا۟ لِمَنْ أَلْقَىٰٓ إِلَيْكُمُ ٱلسَّلَٰمَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا فَعِندَ ٱللَّهِ مَغَانِمُ كَثِيرَةٌ كَذَٰلِكَ كُنتُم مِّن قَبْلُ فَمَنَّ ٱللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوٓا۟ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
Telugu Translation - Abdurrahim ibn Muhammadఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మార్గంలో (జిహాద్ కు) బయలుదేరి నప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీ వైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని - ప్రాపంచిక ప్రయోజనాలను పొంద గోరి - "నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు."[1] అని (త్వరపడి) అనకండి. అల్లాహ్ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండేవారు కదా! ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచితమైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్! మీరు చేసేదంతా బాగా ఎరుగును.