caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Baqara, ఆయత్ 61

మదీనా · అవతరణ క్రమం 87 · 2:61

وَإِذْ قُلْتُمْ يَٰمُوسَىٰ لَن نَّصْبِرَ عَلَىٰ طَعَامٍ وَٰحِدٍ فَٱدْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنۢبِتُ ٱلْأَرْضُ مِنۢ بَقْلِهَا وَقِثَّآئِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا قَالَ أَتَسْتَبْدِلُونَ ٱلَّذِى هُوَ أَدْنَىٰ بِٱلَّذِى هُوَ خَيْرٌ ٱهْبِطُوا۟ مِصْرًا فَإِنَّ لَكُم مَّا سَأَلْتُمْ وَضُرِبَتْ عَلَيْهِمُ ٱلذِّلَّةُ وَٱلْمَسْكَنَةُ وَبَآءُو بِغَضَبٍ مِّنَ ٱللَّهِ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا۟ يَكْفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقْتُلُونَ ٱلنَّبِيِّـۧنَ بِغَيْرِ ٱلْحَقِّ ذَٰلِكَ بِمَا عَصَوا۟ وَّكَانُوا۟ يَعْتَدُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు అప్పుడు మీరు: "ఓ మూసా!మేము ఒకే రకమైన ఆహారం తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకు కూరలు, దోసకాయలు (కూరగాయలు), వెల్లుల్లి (గోధుమలు), ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండించమని నీ ప్రభువును ప్రార్థించు." అని అన్నారు. దానికతను: "ఏమీ? శ్రేష్ఠమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకుంటున్నారా? (అలాగయితే) మీరు ఏదైనా నగరానికి తిరిగిపొండి. నిశ్చయంగా, అక్కడ మీకు, మీరు కోరేదంతా దొరుకుతుంది!" అని అన్నాడు. మరియు వారు, తీవ్ర అవమానం మరియు దారిద్ర్యానికి గురయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు. అదంతా వాస్తవానికి వారు అల్లాహ్ సూచన (ఆయతు) లను తిరస్కరించిన దాని మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలితం.[1] ఇదంతా వారు చేసిన ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70