caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-Baqara, ఆయత్ 219

మదీనా · అవతరణ క్రమం 87 · 2:219

يَسْـَٔلُونَكَ عَنِ ٱلْخَمْرِ وَٱلْمَيْسِرِ قُلْ فِيهِمَآ إِثْمٌ كَبِيرٌ وَمَنَٰفِعُ لِلنَّاسِ وَإِثْمُهُمَآ أَكْبَرُ مِن نَّفْعِهِمَا وَيَسْـَٔلُونَكَ مَاذَا يُنفِقُونَ قُلِ ٱلْعَفْوَ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلْـَٔايَٰتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ప్రవక్తా!) వారు, మధ్యపానాన్ని మరియు జూదాన్ని గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు[1]. నీవు ఈ విధంగా సమాధానమివ్వు: "ఈ రెంటింటిలోనూ ఎంతో హాని (పాపం) ఉంది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, కాని వాటి హాని (పాపం) వాటి లాభాల కంటే ఎంతో అధికమైనది." మరియు వారిలా అడుగుతున్నారు: "మేము (అల్లాహ్ మార్గంలో) ఏమి ఖర్చు పెట్టాలి?" నీవు ఇలా సమాధానమివ్వు: "మీ (నిత్యావసరాలకు పోగా) మిగిలేది."[2] మీరు ఆలోచించటానికి, అల్లాహ్ ఈ విధంగా తన సూచన (ఆయత్)లను మీకు విశదీకరిస్తున్నాడు -
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70