caseriqఖుర్‌ఆన్‌లో అర్థ ఆధారిత శోధన

సూరా Al-A'raaf, ఆయత్ 43

మక్కా · అవతరణ క్రమం 39 · 7:43

وَنَزَعْنَا مَا فِى صُدُورِهِم مِّنْ غِلٍّ تَجْرِى مِن تَحْتِهِمُ ٱلْأَنْهَٰرُ وَقَالُوا۟ ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى هَدَىٰنَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهْتَدِىَ لَوْلَآ أَنْ هَدَىٰنَا ٱللَّهُ لَقَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِٱلْحَقِّ وَنُودُوٓا۟ أَن تِلْكُمُ ٱلْجَنَّةُ أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Telugu Translation - Abdurrahim ibn Muhammadమరియు మేము వారి హృదయాల నుండి పరస్పర ద్వేషభావాలను తొలగిస్తాము. వారి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారు ఇలా అంటారు: "మాకు ఇక్కడికి చేరటానికి సన్మార్గం చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. అల్లాహ్ మాకు ఈ సన్మార్గం చూపకపోతే మేము సన్మార్గం పొంది ఉండేవారమ కాదు. మా ప్రభువు పంపిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకు వచ్చారు!" అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: "మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా, మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!"
ఒక అంశాన్ని వెతుకుతున్నారా? అర్థ ఆధారిత శోధనను ప్రయత్నించండి — మీ ప్రశ్న 6,236 ఆయతులలో వెతకబడుతుంది.
భాష — 70