قُلْ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّى رَسُولُ ٱللَّهِ إِلَيْكُمْ جَمِيعًا ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ فَـَٔامِنُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِ ٱلنَّبِىِّ ٱلْأُمِّىِّ ٱلَّذِى يُؤْمِنُ بِٱللَّهِ وَكَلِمَٰتِهِۦ وَٱتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ
Telugu Translation - Abdurrahim ibn Muhammad(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను.[1] భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు!"[2]